Bigg Boss Captaincy Contender Promo : బిగ్​బాస్ సీనజ్ 9 తెలుగు డే 45కి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. 7వ వారానికి గానూ కెప్టెన్సీ కోసం టాస్క్​ జరుగుతుంది. నామినేషన్ల తర్వాత మొదలైన ఈ టాస్క్ రెండో రోజు కూడా కొనసాగుతుంది. దీనిలో భాగంగా కంటెండర్స్ అందరూ దొంగల రూపంలో ముస్తాబయ్యారు. గేమ్​లో స్ట్రాటజీలు ప్లే చేస్తూ.. దొంగతనాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన మొదటి ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో.. 

బిగ్​బాస్ హోజ్​లో దొంగల టాస్క్ మొదలైంది. నేను చూశా సుమన్ అన్న తీయడం.. మళ్లీ వచ్చి నా దగ్గరే డ్రామా చేస్తున్నారు. అది చూడడానికి చాలా చిరాగ్గా ఉందంటూ రీతూ చెప్పడంతో ప్రోమో స్టార్ట్ అయింది. తనూజ, సుమన్ శెట్టి కలిసి దొంగతనం చేస్తున్నట్లు చూపించాడు బిగ్​బాస్. తనూజ.. సుమన్ దగ్గరికి వచ్చి మీ దగ్గర 3 నోట్స్ ఉన్నాయా అని అడగ్గా.. సుమన్ చూపిస్తాడు. సరే పెట్టుకో అంటుంది. 

Continues below advertisement

దివ్య కూడా వాళ్లతోనే.. 

దివ్య దగ్గరికి వెళ్లిన రీతూ డబ్బుల దొంగతనం గురించి మాట్లాడుతుంది. దానికి దివ్య టీమ్ మొత్తం కంటెండర్స్ అవుతారా? అంటూ అడుగుతుంది. దానికి రీతూ రిప్లై ఇస్తూ.. ఎవరూ డబ్బు దొంగలిస్తే.. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్లే కంటెండర్స్ అవుతారా అంటూ అడుగుతుంది. ఎందుకవుతారు అలాగా అని దివ్య అంటుంది. లోపలికి వచ్చిన దివ్యతో తనూజ గేమే.. దొంగతనం గేమ్ అంటూ చెప్తుంది. 

తనూజ vs రీతూ

తనూజ కూడా దొంగతనం చేస్తుందని రీతూకి తెలిసి ఉండొచ్చు. దానిలో భాగంగా రీతూ తనూజతో మరి ఇంకెందుకు టీమ్ అంటూ గొడవ వేసుకుంటుంది. తనూజ సీరయస్ అయి.. మళ్లీ మళ్లీ అరవకు రీతూ అంటూ గట్టిగా అరిచి వెళ్లిపోతుంది. దివ్వెల మాధురి తనూజ దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా తీయలేదా అని అడుగుతుంది. నువ్వు చూడలేదా చూడలేదు అని చెప్తుంది. అయితే ప్రామిస్ వేయి అంటే.. దీనికి ప్రామిస్ వరకు ఎందుకు అంటుంది. నెక్స్ట్ సీన్లో తనూజ డబ్బులు కొట్టేసి దాస్తున్నట్లు కనిపిస్తుంది. 

తనూజ, దివ్య కూడా డబ్బులు దాస్తారు. లోపలికి వచ్చిన సంజన.. దివ్య నువ్వు డబ్బులు తీశావా అని అడుగుతుంది. లేదు అని చెప్పగా.. అయితే రేపు మీరు లేకుండా గేమ్ ఆడుతామని చెప్తుంది. మీరు చేస్తే గేమ్, ఫెయిర్.. మేము చేస్తే అన్​ఫెయిర్ గేమ్ ఆపేస్తారు అంటూ అడుగుతుంది. మీకు ఒక రూల్, వేరేవాళ్లకి ఒక రూల్ అనేసరికి ప్రోమో అయిపోయింది.