Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, లక్ష్మీలకు పెళ్లి అయిందని పండుకి తెలిసిపోతుంది. ఇన్నాళ్లు నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని విహారికి తెలీదా అని అడుగుతాడు. లక్ష్మీ తెలీదు అనడంతో చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ లక్ష్మీమ్మ అని అంటాడు. నీ భర్త వేరొకరి సొంతం అవుతుంటే ఎలా చూస్తూ ఉన్నావని ఈ నిశ్చితార్థం ఆపి అందరికీ నిజం చెప్తానని పరుగులు తీస్తాడు. విహరి, సహస్రలు రింగులు మార్చుకునే టైంకి వెళ్లి ఆపుతాడు.
పండు: ఆపండి.. అయ్యగారు ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఓ నిజం ఈ రోజు మీ అందరికీ తెలియాలి. లక్ష్మీకి పెళ్లి అయింది.
కాదంబరి: పండు లక్ష్మీకి పెళ్లి అయితే ఎవరికి కావాలి దానికి మొగుడు వదిలేస్తే ఎవరికి కావాలి అయినా దానికి పెళ్లి అయితే నీకు నొప్పి ఏంటి ఈ నిశ్చితార్థం ఎందుకు ఆపాలి.
పండు: ఎందుకంటే లక్ష్మీకి ఈ నిశ్చితార్థానికి సంబంధం ఉంది కాబట్టి.
విహారి: పండు నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరికీ అర్థం కావడం లేదురా అసలు నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పు.
పండు: బాబు.. బాబు.. లక్ష్మీ భర్త ఎవరో కాదు విహారి బాబు. ( అందరూ బిత్తరపోతారు. యమునకి అయితే గుండె ఆగినంత పని అవుతుంది)
పద్మాక్షి: పండు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పేలుతుంది. అడ్రస్ లేని దాని మొగుడు విహారి ఎలా అవుతాడు. అసలు విహారి లక్ష్మీ మెడలో మూడు ముళ్లు ఎలా వేస్తాడు.
పండు: ఇలా అయితే మీరు నమ్మరు మీరు నమ్మేలా ఏం చేయాలో నాకు తెలుసు అని పేపర్‌లో ఫొటో చూపిస్తాడు. అందరూ మరోసారి షాక్ అవుతారు. సహస్ర ఏడుస్తుంది. లక్ష్మీమ్మ ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నది బయటకి రామ్మా.
పద్మాక్షి: విహారి ఏంటి ఇదంతా పేపరేంటి అందులో ఫొటో ఏంటో నీకు లక్ష్మీకి పెళ్లి అవ్వడం ఏంటి..
విహారి: అత్తా అది ఏం జరిగింది అంటే.
అంబిక: విహారి నువ్వు ఆగు. విహారిని అడిగితే ఏం సమాధానం చెప్తాడక్కా అసలు ఈ మాయలాడి ఎక్కడ తాళి కట్టించుకుందో దాన్ని అడిగితే చెప్తుంది. ఏయ్ లక్ష్మీ విహారిని ఏం చేశావే.
లక్ష్మీ: ఏంటి అమ్మగారు అలా మాట్లాడుతారేంటి.
పద్మాక్షి: ఇంకెలా మాట్లాడాలే నా అల్లుడు బాగా ఉన్నోడని ఏం అడిగినా ఇస్తాడని తాళి కట్టించుకున్నావా.
యమున: వదినా ఒక్క నిమిషం ఆగుతావా. విహారి ఏంట్రా ఇదంతా. నీకు లక్ష్మీకి పెళ్లి జరిగిందా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు. నా దగ్గర ఎందుకు దాచి పెట్టావ్
పద్మాక్షి: మీ ఇద్దరి నాటకాలు చాలా బాగున్నాయమ్మా. నీ గురించి నాకు తెలీదా యమునా నీ కొడుకు పెళ్లి గురించి నీకు ముందే తెలుసు అందుకే కదా అనామకురాలిగా దీన్ని ఇంటికి తెచ్చావ్. మీ తల్లీ కొడుకుల నాటకం బయట పడిపోయింది.
కాదంబరి: రేయ్ ఎందుకురా ఇలా చేశావ్ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నామ్‌రా. నిన్ను బంగారంలా చూసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావ్రా.
అత్తయ్యా మీ మనవడితో అలా మాట్లాడొద్దని యమున అంటే కాదాంబరి యమునను కొడుతుంది. అందరూ షాక్ అయిపోతారా. ఇలాంటి దాన్నా నీ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశావ్ ఇలాంటి దాన్నా ఈ ఇంటి కోడలిని చేశావని అంటుంది. కాదాంబరి కూడా ఏడుస్తుంది. లక్ష్మీ తాను మాట్లాడుతూ తన తండ్రి ప్రాణం కోసం జాలి పడి ఆయన నాకు తాళి కట్టారని ఇందులో యమున, విహారిల తప్పు లేదని చెప్తుంది. ఈ క్షణం వరకు తను ఎవరో యమునకు తెలీదని అంటుంది. దాంతో సహస్ర నువ్వు ఎవరే నా జీవితం నాశనం చేశావ్ పోవే అని నెట్టేస్తుంది. విహారి చూస్తూ ఉండిపోతాడు.
ఇక పద్మాక్షి ఏడుస్తూ ప్రతి రోజు నా కూతురితో నీకు ఈ ఇళ్లే శాశ్వతం నీ బావే నా సర్వస్వం అని అందర్ని బాగా చూసుకున్నాం అని చెప్పానని కానీ ఈక్షణం నుంచి వీళ్లతో మనకు ఏం సంబంధం లేదని అంటుంది. మళ్లీ జీవితంలో మీ ఇంటి గడప తొక్కనని ఇరవై ఏళ్ల క్రితం చేసిన అవమానం మళ్లీ చేశారని కూతుర్ని తీసుకొని వెళ్లిపోతుంటే లక్ష్మీ ఆపుతుంది. పద్మాక్షి కాళ్లు పట్టుకుంటుంది. తనకు విహారికి ఏం సంబంధం లేదు అని అంటే పద్మాక్షి తన్నేసి వెళ్లిపోతుంది. చూస్తే ఇదంతా లక్ష్మీ కల. జరిగింది అంతా ఊహించుకొని నిజం చెప్పకూడదని అనుకుంటారు. ఈ విషయం తెలిస్తే యమునని దారుణంగా చూస్తారని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్: నాటకం మొదలు పెట్టిన అపర్ణ, ఇందిరాదేవి – ప్రకాష్ కామెడీతో రాజ్ కు టెన్షన్