Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను, వివేక్‌లు ఇంట్లోకి వస్తారు. జాను దీపం పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటుంది. తాను ఎన్ని బాధలు అయినా పడతాను కానీ మా అక్కకి బాధలు రాకూడదు అని కోరుకుంటుంది. తర్వాత అరవింద, జయదేవ్‌లు జాను, వివేక్‌ని దీవిస్తారు. మిత్ర లక్ష్మీల్లా కాకుండా మీరు అయినా సంతోషంగా ఉండండని అంటారు. ఇక మిత్ర, లక్ష్మీలు ఇద్దర్ని దీవిస్తారు. మనీషా కోపంతో చూస్తూ ఉంటుంది. జాను లక్ష్మీని హగ్ చేసుకుంటుంది. 


లక్ష్మీ: నిన్నటి వరకు నువ్వు నా చెల్లివి ఈ రోజు వివేక్ భార్య ఈ ఇంటి కోడలివి. అందరితో గౌరవంగా ప్రేమగా ఉండాలి. సమస్యలు వస్తాయి సహనంతో ఓపికగా ఉండాలి. పెద్దవాళ్లు ముఖ్యంగా మీ అత్తయ్యని నొప్పించకు.
జయదేవ్: ఏంటమ్మా అప్పగింతలు చేస్తున్నావ్ తను వేరే ఇంటికి రాలేదు కదా నీతో పాటు నీ తోడి కోడలిగా వచ్చింది కదా. 
లక్ష్మీ: తను ఇక్కడే ఉంటుంది మామయ్య గారు కానీ నేనే ఎన్నాళ్లు ఈ ఇంట్లో ఉంటానో తెలీదు కదా. నా భవిష్యత్ నాకు అగమ్యగోచమనీయం వెళ్లిపోవాల్సిన టైం వస్తే వెళ్లిపోవాలి కదా అందుకే జానుకి అన్నీ చెప్తున్నా.
మనీషా: ఈ మనీషా సింపతితో మార్కులు కొట్టేస్తుందేంటి.
అరవింద: నీ భవిష్యత్ మిత్ర చేతిలో ఉంది మిత్ర తలచుకుంటే నీ భవిష్యత్ బాగుంటుంది.
మనీషా: ఎప్పుడో జరిగిన పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు వివేక్ మీ మామ్ దగ్గర ఆశీర్వాదం తీసుకో రా.


మనీషా దగ్గరుండి ఇద్దరినీ తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పిస్తుంది. ఇక ఇద్దర్నీ పంపేస్తుంది. తర్వాత మనీషా మీద దేవయాని అరుస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అంటుంది. నన్ను విలన్‌లా చేసి నువ్వు మిత్ర దగ్గర మార్కులు కొట్టేస్తున్నావా అని అడుగుతుంది. దానికి మనీషా వాళ్లు వేరే కాపురం పెట్టి ఆస్తి తీసుకొని వెళ్లిపోతే మీరు వాళ్ల దగ్గరే ఉండాల్సి వస్తుంది. అప్పుడు మిమల్ని జాను వీధి కుక్కలా చేస్తుందనే అదే వాళ్లు ఇక్కడ ఉంటే మీరు జానుని పెంపుడు కుక్కలా చేయొచ్చని చెప్తుంది. ముందు ఈ రోజు ఫస్ట్ నైట్ ఆపాలని మనీషా దేవయానితో చెప్తుంది. వివేక్, జానులను దూరం చేయాలి అంటే ఇద్దరూ కలవకుండా చేయాలని చెప్తుంది మనీషా. ఇద్దరూ దూరం అయిన తర్వాత వివేక్‌కు మరో పెళ్లి చేయాలని అంటుంది.


జయదేవ్, అరవిందలు మనీషా మార్పుని మెచ్చుకుంటారు. ఇంతలో లక్ష్మీ వచ్చి మనీషా లాభం లేకుండా ఏం చేయడని అంటుంది. ఇక మిత్ర మనీషాకు థ్యాంక్స్ చెప్తాడు. జాను, వివేక్‌ల విషయంలో చాలా హెల్ప్ చేశాడని మెచ్చుకుంటారు. అరవింద వాళ్లు మాత్రం మిత్ర మెప్పుకోసమే ఇదంతా చేసిందని మిత్రని తన వైపు తెచ్చుకోడానికే చేసిందని అనుకుంటారు. మనీషా నిజస్వరూపం మిత్రతో చెప్పాల్సిందని లక్ష్మీతో అరవింద అంటుంది.  ఇక మనీషా మిత్రతో నేను ఇంటి పెద్ద కోడలిని కదా నిన్ను త్వరలో పెళ్లి చేసుకుంటానని అంటే మిత్ర వెళ్లిపోతాడు. సంజన జానుని తీసుకొని వస్తుంది. వివేక్ సంజనను బయటకు తోసేస్తాడు. గడియ పెడతాడు. నాతో ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా అని జాను వివేక్ మీద కస్సుబుస్సులాడుతోంది.


ఇక వివేక్ ఇన్నాళ్లు మనం లవర్స్ ఇప్పుడు కపుల్స్ కదా నో బౌండరీస్, నో బోర్డర్స్ నో రిస్ట్రక్షన్స్ అని జానుని దగ్గరకు తీసుకోబోతే జాను వివేక్‌ని తోసేసి వెళ్లిపోతుంది. ఇక జాను, వివేక్ ఫస్ట్ నైట్కి టైం ఫిక్స్ చేస్తారు. ముహూర్తం ముందు పూల తలంబ్రాలు, బిందెల్లో ఉంగరాల కార్యక్రమాలు చేయాలనుకుంటారు. ఇక దేవయాని పిలిస్తే రాను అంటుంది. ఎలా అయినా ఆవిడను రప్పించాలని లక్ష్మీ అంటే మిత్ర మనీషాని పురమాయిస్తాడు. మనీషా ఇంటి పెద్ద కోడలు తానే అన్నట్లు ఆవిడను తీసుకొస్తానని అంటుంది. మనీషా దేవయాని దగ్గరకు వెళ్తుంది. విషయం చెప్పి మనీషా దేవయానిని పిలిస్తే నా శత్రువు వాళ్లా నువ్వా అని దేవయాని అడుగుతుంది. బలి అవ్వబోయే జానుకి చిన్న ఎంటర్‌టైన్ మెంట్ ఇద్దామని దేవయానిని ఒప్పిస్తుంది. జాను ఫస్ట్ నైట్ గదికి వెళ్తుంది కానీ ఫస్ట్ నైట్ జరగదు అని అంతా ప్లాన్ చేశానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంట్లో కాంచన, కార్తీక్.. దీపకు జ్యోత్స్న, పారులు కూడా థ్యాంక్స్ చెప్పారే.. జ్యో పెళ్లి ఫిక్స్!