Brahmamudi Serial Today Episode:  అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి గుడిలో కనకాన్ని కలుస్తారు నువ్వే ఎలాగైనా వాళ్లిద్దర్ని కలపాలని చెప్తారు. దీంతో వాళ్లిద్దరు ఒకరికి చెప్పేవాళ్లు..  వాళ్లకు మనమేం చెబుతాం చెప్పండి అంటుంది కనకం. ఒకటి మాత్రం నిజం అది అల్లుడిగారిని ప్రతిక్షణం గుర్తుచేసుకుంటూనే ఉంది అంటుంది కనకం.


అపర్ణ: మేం బాగా ఆలోచిస్తే ఒకటే అనిపిస్తుంది. ఆ ఇద్దరిని ఒకచోట చేర్చి ఒకర్ని ఒకరు అర్థం చేసుకునేలా చేస్తే ఏదైనా ఫలితం ఉందేమో అనిపిస్తుంది.


కనకం: ఏం చేసినా అల్లుడుగారు కావ్య కోసం మా ఇంటికి రాడు వదిన. నేను పోయినా రారు.


ఇందిరాదేవి: ఏంటి కనకం అంత మాట ఎందుకు అంటున్నావు.


కనకం: లేదమ్మా.. నిజంగానే చెప్తున్నాను. కూతురు అల్లుడు మళ్లీ కలిస్తే చూసే అదృష్టం నాకు ఈ జన్మకు లేకుండా చేశాడు ఆ దేవుడు.


ఇందిరాదేవి: అంటే నువ్వు బతికి ఉన్నంత కాలం కలవనే కలవరు అంటున్నావా?


కనకం: అవునమ్మా..


ఇందిరాదేవి: ఎందుకలా అంటున్నావు..


కనకం: ఎందుకంటే నేను బతికేదు మహా అయితే ఇంకో మూడు నెలలో నాలుగు నెలలో కావొచ్చు. అవునమ్మా నెల రోజుల క్రితమే నాకీ విషయం తెలిసింది. తరచుగా ముక్కులోంచి రక్తం వస్తుంటే పరీక్షలు చేయించాను. అన్ని రిపోర్టులు చేసి నాకు క్యాన్సర్‌ అని చెప్పారు.


 అంటూ కనకం ఏడుస్తుంది. అపర్ణ, ఇందిరాదేవి షాక్‌ అవుతారు. నువ్వు బాధపడకు మేము పెద్ద హాస్పిటల్స్‌ కు చూపిస్తాం అన్నా కూడా లాభం లేదని బాధపడుతుంది కనకం. ఇద్దరూ అలాగే చూస్తుండిపోతుంటే కనకం గట్టిగా నవ్వుతుంది.  మీ ఇద్దరూ నమ్మేశారు కదా? అంటుంది. నాకు క్యాన్సర్‌ లేదు ఆల్సర్‌ లేదు అంటూ ఈ ప్లాన్‌ వాడితే రాజ్‌ మారుతాడని.. నా ఇంటికి వచ్చి నా కూతురును తీసుకెళ్తాడని చెప్తుంది. దీంతో అపర్ణ షాకింగ్‌ గా నీకు ఎలా వస్తాయి ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు అంటుంది. తర్వాత ముగ్గురు కలిసి నాటకం మొదలు పెడతారు. మరోవైపు మూర్తి దగ్గరకు వెళ్లిన కావ్య మీ 25వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ చేయాలనుకుంటున్నట్టు చెప్తుంది. ఇంతలో కనకం వస్తుంది.


కనకం: స్వప్న కూడా మా పెళ్లి రోజు జరిపించాలని ఆశపడుతుంది.


కావ్య: అక్కను నువ్వెక్కడ కలిశావు అమ్మా. ఆ ఇంటికి వెళ్లావా?


కనకం: ఏంటో ఆ ఇంటికి వెళ్లావు అని అడుగుతున్నావు. నాకేం పని పాటా లేదనుకున్నావా? ఇందాక స్వప్న గుడికి వచ్చింది. అక్కడే చెప్పింది.


కావ్య: వద్దమ్మా ఆ ఇంటి నుంచి మన ఇంటికి రూపాయి కూడా రావడానికి వీల్లేదు. ఉన్నంతలోనే నాదగ్గర ఉన్న డబ్బుతోనే జరిపిస్తాను.


కనకం: ఏమోనే వాళ్లు జరిపిస్తానంటే నువ్వెందుకు కాదంటున్నావు. వాళ్లు అపార్థం చేసుకుంటారు. గొడవలన్నీ సర్దు మణగడానికి ఇదొక అవకాశం.


కావ్య: వాళ్లంటే ఎవరు?


కనకం: అదే తెలియదు. వాళ్లల్లో ఎవరొస్తారే ఏమో తెలియదు.


కావ్య: అది కాదమ్మా..


కనకం: నువ్వు ఇంకేం మాట్లాడకు కావ్య. వాళ్లు ముందుకు వచ్చినప్పుడు నువ్వు అడ్డు పడ్డావంటే మళ్లీ ఏదో ఒక గొడవకు దారి తీస్తుంది.


కావ్య: మీ ఇష్టం..


 అని వెళ్లిపోతుంది. దీంతో మూర్తి, స్వప్న చెబితే నువ్వెలా ఒప్పుకుంటావే అంటాడు. దీంతో గుడిలో జరిగింది చెప్తుంది కనకం. మరోవైపు డల్లుగా ఇంటికి వెళ్తారు అపర్ణ, ఇందిరాదేవి. హాల్లో కూర్చున్న రాజ్‌ ఏమైందని అడుగుతాడు.  దీంతో అపర్ణ, ఇందిరాదేవి నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అంటూ ఇద్దరూ చెప్పరు ఏంటో చెప్పండి అని రాజ్‌ అడగ్గానే అపర్ణ మన కావ్య అనగానే మమ్మీ అసలు ఆ పేరే మన ఇంట్లో వినిపించొద్దు అంటే మీకు అర్థం కాదా? అంటూ కోపంగా బయటకు వెళ్తాడు.


రాజ్: ఏ పైరేతే వినకూడదని అనుకున్నానో.. ఆ పేరే పదే పదే వినాల్సి వస్తుంది.


కనకం, అపర్ణకు ఫోన్‌ చేస్తుంది.


కనకం: వదిన నేను ఇక్కడ కావ్యను ఒప్పించేశాను. నా ప్రయత్నం సూపర్‌ హిట్‌. అక్కడ పరిస్థితేంటి?


అపర్ణ: అట్టర్‌ ప్లాప్‌.  


కనకం: కనీసం యావరేజ్‌ కూడా కాదా?  


అపర్ణ: డిజాస్టర్‌.


కనకం: మరి ఎలా వదిన.. మీ వల్ల కాకపోతే చెప్పండి నేను రంగంలోకి దిగుతాను.


అపర్ణ: గొయ్యి తీసి అందులో పాతేస్తా.. మమ్మల్ని మరీ అంత తీసేయకు. పెట్టేయ్‌ ఫోన్‌.


ఇందిరాదేవి: డైరెక్టుగా చెబితే వాడు ఒప్పుకోడు. మనకు ఒక మీడియేటర్‌ కావాలి. ( ప్రకాశ్‌ వస్తుంటే..) దొరికాడు వీడి ద్వారా ట్రై చేద్దాం. ప్రకాశం ఇలా రా..


ప్రకాష్‌: ఏంటమ్మా..?


అపర్ణ: నీకు రాజ్‌, కావ్య కలవాలని ఉందా? లేదా?


ప్రకాష్‌: ఎందుకు లేదు వదిన కావ్య లేని ఇల్లు మెదడు లేని తలకాయలా ఉంది. ఇద్దరిని కలపాలని నాకు  ఉంది. కానీ వాడు ఒప్పుకోడు కదా?


ఇందిరాదేవి: వాళ్లిద్దరినీ కలిపే అవకాశం మేమిస్తాం చేస్తావా?


చేస్తానని ప్రకాష్‌ చెప్పగానే కావ్యకు చాలా నష్టం జరిగిపోయిందని చెప్పు. ఏం జరిగిందని అడిగితే మర్చిపోయానని చెప్పు అనగానే సరేనని ప్రకాష్‌, రాజ్‌ దగ్గరకు చెప్పింది చేప్పినట్లు చేస్తాడు. దీంతో రాజ్‌ లోపలికి రాగానే లోపల అపర్ణ, ఇందిరాదేవి తన నాటకం మొదలుపెడతారు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గురించి ఫీల్‌ అయిన గగన్‌ – అపూర్వకు నిజం చెప్పిన భూమి