Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode రాజీ విహారికి కాల్ చేసి ఆదికేశవ్ కండీషన్ గురించి చెప్తుంది. విహారి విషయం తెలియడంతో షాక్ అయిపోతాడు. మీరే ఆదుకోవాలని రాజీ అంటుంది. ఆపరేషన్ గురించి కనక మహాలక్ష్మీకి తెలుసుంటుంది కానీ నాతో ఎందుకు చెప్పలేదు అని విహారి కనకం గదికి వెళ్తాడు. ఇక కనకం మహాలక్ష్మీ ఎవరూ చూడకుండా కుంకుమార్చన వ్రతం చేస్తుంటుంది. విహారి లక్ష్మీ గదికి వెళ్లడం అంబిక చూస్తుంది. 


అంబిక: విహారి లక్ష్మీ గది దగ్గర ఏం చేస్తున్నాడు. 
లక్ష్మీ: తల్లీ విహారి గారు తిన్న ప్లేట్‌లో నేను తింటే ఈరోజు నా పూజ పరిపూర్ణం అవుతుంది. విహారిని చూసి కబోర్డ్ తలుపులు లక్ష్మీ మూసేస్తుంది. 
అంబిక: విహారి లక్ష్మీ గదికి ఎందుకు వెళ్లాడు. విహారి నాకు భలే దొరికిపోయాడు. వీళ్లిద్దరినీ ఇలా అక్కకి చూపిస్తే విహారి పరువు పోతుంది. అధికారం అనే సింహాసనాన్ని నేను దక్కించుకోవచ్చు. ఈ గదికి తాళం వేస్తే బెటర్. ఇప్పుడు విహారి మీద ఏకంగా బురదే పడబోతుంది.
విహారి: లక్ష్మీ నీకు థ్యాంక్స్ చెప్పాలి అని వచ్చాను నన్ను కాపాడి రక్తం ఇచ్చావు. లక్ష్మీ నాకు ఓ డౌట్ అడగనా. నాకు ఇన్ని సాయాలు నువ్వు చేశావు కదా మరి నా దగ్గర ఎందుకు సాయం తీసుకోవాలి అనుకోవడం లేదు. 
లక్ష్మీ: మీ దగ్గర నేను సాయం ఏం ఉంటుందండి.
విహారి: ఏం లేదా ఆలోచించు. 
లక్ష్మీ: నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు ఇంతకంటే సాయం ఏముంటుంది. ఇంకేం సాయం అడగగలను.
విహారి: పది రోజుల్లో మీ నాన్నకి ఆపరేషన్ చేయాలి 25 లక్షలు వరకు కావాలి  ఆ సాయం కూడా నాకు అడగాలి అనిపించలేదా. చెప్పు లక్ష్మీ నా దగ్గర సాయం తీసుకోవాలి అనిపించలేదా. రాజీ కాల్ చేసి విషయం చెప్పింది.  


అంబిక ఇంట్లో అందరికీ చెప్పి రచ్చ రచ్చ చేయాలని అనుకుంటుంది. ఇంతలో సుభాష్ అంబికకు కాల్ చేసి ఓ మంచి న్యూస్ ఉందని వెంటనే రమ్మని చెప్తాడు. విహారిని అధికారం నుంచి తప్పించడానికి మంచి అవకాశం ఉందని వెంటనే రమ్మని చెప్తుంది. దాంతో అంబిక విహారి సంగతి తర్వాత చూద్దామని అనుకొని వెళ్లిపోతుంది. విహారి కనకంతో నువ్వు సాయం అడగకపోయినా నేను సాయం చేస్తాను రేపు ఉదయానికి డబ్బు ఇస్తానని అంటాడు. దాంతో లక్ష్మీ వద్దని నా బంధువుల్ని అడిగానని వాళ్లు సాయం చేస్తానని చెప్పారని అంటుంది.


సాయం వద్దని లక్ష్మీ రెండు చేతులు జోడిస్తుంది. దాంతో విహారి చివరి నిమిషంలో డబ్బు అవసరం అయితే నన్ను అడుగు అని చెప్పి వెళ్లబోతాడు. ఇక డోర్ తీస్తే తెరుచుకోదు. ఏమైందని విహారి అడిగితే డోర్ రావడం లేదని చెప్తాడు. లక్ష్మీ కూడా ప్రయత్నిస్తుంది కానీ డోర్ రాదు. బయట నుంచి ఎవరో లాక్ చేసుంటారని విహారి అడిగితే లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. అంత అవసరం ఎవరికి ఉంటుందని అంటుంది. ఇక విహారి పండుకి కాల్ చేస్తానని ఫోన్ చూస్తే ఫోన్ గదిలో వదిలేసుంటాడు. ఇక కనకం ఫోన్ తీసుకురమ్మని విహారి అడుగుతాడు. దాంతో లక్ష్మీ చూసి ఫోన్ కిచెన్‌లో ఛార్జింగ్‌ పెట్టి మర్చిపోయానని అంటుంది. అందరూ చాలా నిందలు వేస్తారని చాలా కంగారు పడుతుంది. 


మరోవైపు సుభాష్ అంబికను ఇద్దరు బిజినెస్‌ మెన్‌లను పరిచయం చేస్తాడు. గోల్డోన్ స్టోన్ అనే ఓ ప్రాజెక్ట్‌ త్వరలో రాబోతుందని విహారి కూడా దానికి టెండర్ వేస్తాడని ఎలా అయినా విహారి ఆ ప్రాజెక్ట్ దక్కించుకుంటాని అందుకు నువ్వు ఆ టెండర్ ఎంతకు వేస్తాడో మాకు చెప్తే 50 కోట్లు దుబాయ్‌లో ఓ ప్లాట్ ఇస్తామని అంటారు. దాంతో అంబిక ఓకే చెప్తుంది. విహారి లక్ష్మీ ఒకే గదిలో ఉంటారు. విహారి బెడ్ మీద కూర్చొంటాడు. లక్ష్మీ అటూ ఇటూ తిరగడం విహారి చూస్తే ఏంటి అలా చూస్తున్నారు అని లక్ష్మీ అడిగితే మన ఇద్దరినీ ఇలా చూస్తే ఎంత రచ్చ రచ్చ జరుగుతుందని చెప్తుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: చక్రవర్తికి సర్‌ఫ్రైజ్ ఇచ్చిన క్రిష్.. మైత్రి ఇంట్లో హర్ష.. నందిని ఫైర్!