Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ కుంకుమార్చన వ్రతం చేసి స్వామీజీ ఇచ్చిన తీర్థం, కుంకుమ తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. అక్కడ అంబికను చూసి భయపడుతుంది. మరోవైపు విహారి పెళ్లి బాసికం కట్టుకున్న ఫొటో ఎగిరి అంబిక వైపు వస్తుంటుంది. ఇంతలో పండుని చూసిన లక్ష్మీ పండుకి సైగలు చేస్తుంది. పండు మెట్ల మార్గం పక్కనుంచి రమ్మని చెప్తాడు. ఎవరూ చూడకుండా లక్ష్మీ విహారి దగ్గరకు వెళ్తుంది.
లక్ష్మీ: విహారి గారు మీకో విషయం తెలుసా ఆడపిల్లకి ఒక సారి తాళి పడిన తర్వాత ఆ తాళి తనకు లోకం అవుతుంది. అది కట్టిన వాడే ఆ అమ్మాయికి ప్రపంచం అవుతాడు. ఆ మనిషి నీడలోనే తాను జీవిస్తుంది. కానీ నేను మీరు కట్టిన తాళి మాత్రం నా మెడలో ఉంచుకొని మీతో ఏర్పడిన బంధాన్ని నా గుండెల్లోనే దాచుకొని పక్కకు తప్పుకోవాలి అనుకున్నాను. మీ దారిలోకి రాకూడదు అనుకున్నాను కానీ కాలం విచిత్రమైంది. ఇప్పుడు నేను మీ భార్య స్థానంలో పూజ చేయాల్సి వచ్చింది. అక్కడనుంచి తెచ్చిన ఈ కుంకుమ ఇప్పుడు మీ భార్య స్థానంలో ఉండి మీ నుదిటిన పెట్టాల్సి వస్తుంది. విహారి నుదిటిన కుంకుమ పెట్టి మీరు త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలి అని కుంకుమ పెడుతుంది.
ఇక విహారికి కుంకుమ పెట్టిన తర్వాత పసుపు కనకం కంట్లో పడటంతో కన్ను రుద్దుకునే టైంలో తన చేతికి ఉన్న కుంకుమ కనకం నుదిటిన కూడా అంటుంది. తర్వాత తీర్థం విహారికి కనక మహాలక్ష్మీ తాగిస్తుంది. మరోవైపు బయట అందరూ ఉంటారు. సహస్ర దగ్గరకు పద్మాక్షి వెళ్లి విహారిని చూడమని అంటుంది. సహస్ర లక్ష్మీని చూస్తే పరిస్థితి ఏంటి అని పండు కంగారు పడతాడు. లక్ష్మీని విహారి దగ్గర చూసిన సహస్ర ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతుంది. కనకం చేతిలో రాగి చెంబు చూసి బావకి ఏం తాగిస్తున్నావ్ అని అడుగుతుంది. విహారి నుదిటిన బొట్టు చూసి బొట్టు నువ్వే పెట్టావా అని అడుగుతుంది. స్వామీజీ పెట్టమన్నారు అని పెట్టానని లక్ష్మీ చెప్తుంది. దాంతో సహస్ర కోపంతో లక్ష్మీ బయటకు తీసుకొచ్చి అందరి ముందుకి తీసుకొచ్చి తోసేస్తుంది. మరోవైపు కనకం తల్లిదండ్రులు కూడా అటుగా వస్తుంటారు.
సహస్ర: బావ నుదిటిన బొట్టు పెట్టడానికి బావతో ఇలాంటి తీర్థాలు తాగించడానికి నీకు ఎంత ధైర్యమే. ఇది చేసిన పని చెప్తే అందరూ కలిసి దీన్ని చంపేస్తారు. ఈ లక్ష్మీ బావని ముట్టుకొని బావ నుదిటిన బొట్టు పెట్టింది. బావతో ఏదో సొంత పెళ్లాం అయినట్లు పక్కనే కూర్చొని తీర్థం తాగిస్తుంది. బావని పెళ్లి చేసుకోవాల్సిన నేనే ఏం చేయలేదు. ఈ లక్ష్మీ ఎందుకు చేసింది. మనల్ని మభ్యబెట్టి ఇలా ఎందుకు వెళ్లింది.
అంబిక: చెప్పవే సహస్ర అడుగుతుంది కదా చెప్పు. నువ్వు ఎందుకు అలాంటి సేవలు చేస్తున్నావు.
లక్ష్మీ: విహారి బాబుకి అలా ఉండే సరికి కొంచెం బాధ అనిపించింది. మీరు బాబు గారి గురించి బాధ పడుతుంటే నా గుండె తరుక్కుపోయింది. అందుకే స్వామీజీ దగ్గరకు వెళ్తే పూజ చేయించి కుంకుమ పెట్టి తీర్థం తాగించమన్నారు. అంతకు మించి నాకు ఎలాంటి దురుద్దేశం లేదు.
పద్మాక్షి: నువ్వు ఏది పడితే అది చెప్తే గుడ్డిగా మేం నమ్మేస్తాం అనుకున్నావా నీ కట్టు కథలకు మేం పడిపోతాం అనుకున్నావా మా అందరి కళ్లు కప్పి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది.
లక్ష్మీ: నేను నిజమే చెప్తున్నా అమ్మా.
యమున: లక్ష్మీ మంచి ఉద్దేశంతోనే అలా చేసుంటుంది.
పద్మాక్షి: నువ్వు ఆపు యమున దానికి సపోర్ట్ చేయకు. అసలు నువ్వు ఎందుకు ఆ రూమ్‌కి వెళ్లావ్.
సహస్ర లక్ష్మీ నుదిటిన కుంకుమ చూసి నీకు పెళ్లి కాలేదు కదా నీ పాపిటిలో కుంకుమ ఎలా వచ్చిందే అని అడుగుతుంది. నాకు ఏదో అనుమానంగా ఉందని సహస్ర అంటుంది. లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. పెళ్లి అవ్వని దానికి పాపిటిలో కుంకుమ ఏంటి అని అంబిక కూడా అడుగుతుంది. లక్ష్మీని ఏం అనొద్దు అని యమున అంటుంది. లక్ష్మీ మీద అనుమానం పోవాలి అంటే తన పాపిటిలో బొట్టు చెరగాలి అని పద్మాక్షి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ కోసం హాస్పిటల్‌కి పరుగులు తీసిన సత్య.. కిడ్నాపర్ల డిమాండ్‌కి షాక్‌లో హర్ష!