Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తండ్రి పని మీద పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌కి బయల్దేరుతాడు. వెనకాలే అంబిక కూడా జారుకుంటుంది. అంబిక విహారి గురించి సుభాష్‌కి కాల్ చేసి చెప్పడం లక్ష్మీ చాటుగా వింటుంది. అంబిక వాళ్లని ఫాలో అవుతుంది. విహారి ఓ పోలీస్ కాల్ చేస్తాడు. అంతను విహారి తండ్రి ఫైల్ తీసుకొని ఓ లొకేషన్‌లో ఉన్నానని అక్కడికి రమ్మని విహారికి చెప్తాడు.
విహారి ఆ పోలీస్‌ని కలిసి పోస్ మార్టం రిపోర్ట్స్ పటాన్ చెరు ఏరియా హాస్పిటల్‌లో ఉన్నాయని వాటిని చూస్తే ఏమైనా క్లూ దొరుకుతుందని చెప్పి పంపిస్తాడు. విహారి అటు వెళ్తుంటే సుభాష్ అంబికకు కాల్ చేసి చెప్తే అంబిక విహారి కంటే ముందే అక్కడికి వెళ్లమని సుభాష్‌తో చెప్తుంది. ఇక ఇంట్లో పద్మాక్షి చాలా చీరలు తీసుకొచ్చి కార్యం కోసం ఏ చీర కట్టించాలి అని వెతికేస్తారు. కాదాంబరి ఒక చీర సెలక్ట్ చేస్తుంది. ఇదే నీ అసలైన రోజు అని సిగ్గు పడితే నీ బావ నీ మాట వినడు అని బావ దగ్గర తల దించుకోవాల్సి ఉంటుందని కాదాంబరి అంటుంది. దానికి సహస్ర బావని పెళ్లి చేసుకోవడం నా డ్రీమ్ అది పూర్తయింది. ఇక నుంచి బావ చెప్పినట్లు నడుచుకోవడమే నా పని బావని నేను కంట్రోల్ చేయాలి అనుకోను అని అంటుంది.
యమున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఏడాది తిరిగే సరికి పండంటి బాబో పాపో మాకు ఇచ్చేయ్ అని పద్మాక్షి అంటే మామయ్యే నా కడుపున పుడతాడు అని సహస్ర అంటుంది. దానికి యమున కచ్చితంగా ఆయనే పుడతారు సహస్ర. నా కొడుకు మీ కొడుకుగా పుడితే అంత కంటే నాకు అదృష్టమా వాడిని నా చేతులతో ఆడిస్తా అని కాదాంబరి ఎమోషనల్ అయిపోతుంది. యమున పద్మాక్షితో విహారి గది సిద్ధం చేద్దాం అని పిలుస్తుంది. పద్మాక్షి సరే అని తల్లిని వసుధని కూడా పిలుస్తుంది.
విహారి హాస్పిటల్ దగ్గరకు వెళ్తాడు. సుభాష్ కూడా ఫాలో అవుతాడు. లక్ష్మీ కూడా వస్తుంది. విహారి స్టాఫ్‌ని కలిసి రిపోర్ట్స్ కోసం అడుగుతాడు. ఓ వ్యక్తి విహారిని తీసుకెళ్తాడు. లక్ష్మీ కూడా విహారిని కలుస్తుంది. సుభాష్ చూసి ఇది వచ్చిందేంటి అనుకుంటాడు. లక్ష్మీతో విహారి మాట్లాడుతుండగా సుభాష్ పోస్ట్ మార్టం రిపోర్స్ ఉన్న గదికి వెళ్తాడు. మొత్తం వెతికి విహారి తండ్రి రిపోర్ట్ ఉన్న పేపర్‌ని కనిపెట్టి దాన్ని చింపేసి తీసుకెళ్లిపోతాడు. తర్వాత విహారి వాళ్లు వెళ్లి ఆ బుక్ తీసి చూస్తారు. తీరా చూసే సరికి పేజ్ చిరిగి ఉంటుంది. విహారి వాళ్లు షాక్ అయిపోతారు.
సుభాష్ అంబికకు కాల్ చేసి రిపోర్ట్స్ చింపేశా నువ్వు సేఫ్ అని చెప్తాడు. అంబిక చాలా హ్యాపీగా ఫీలవుతుంది. విహారి డిసప్పాయింట్ అవుతాడు. అంబిక లక్ష్మీని చూసి ఇది ఎందుకు ఇక్కడికి వచ్చింది దీనికి ఏం పని అని అనుకుంటుంది. విహారి లక్ష్మీ చేయి పట్టుకొని మాట్లాడటం ఫొటో తీసి సహస్రకు పంపిస్తుంది. లక్ష్మీ అంబికను చూస్తుంది. అనుమానిస్తుంది. సహస్ర విహారి, లక్ష్మీల ఫొటో చూసి కోపంతో ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ మెడలో వారసత్వ నగ.. ముడిపడిన లక్ష్మీ, సహస్రల తాళి!