Meghasandesam Serial Today Episode : భూమి భోజనం తీసుకుని వచ్చి మధ్యాహ్నం నుంచి మీరు ఏమీ తినలేదంట తినండి నాన్నా అని చెప్తుంది. నేను తినలేదని ఎవరు చెప్పారమ్మా అని శరత్ చంద్ర అడగ్గానే.. పిన్ని వాళ్లు అనుకుంటుంటే.. విన్నాను అందుకే మీకు భోజనం తీసుకొచ్చాను అని చెప్తుంది. భోజనం తినమని భూమి చెప్తుంది.
శరత్: ఆకలిగా లేదమ్మా..?
భూమి: నేను తినిపించినా తినరా నాన్నా.. ఒకప్పుడు నా కూతురు రావాలి. మా అమ్మలా నాకు అన్నం తినిపించాలి అన్నారు కదా..?
శరత్: ఆ మాట నీకు ఇంకా గుర్తు ఉందా..? అయితే ఇప్పుడు నువ్వు నాకు అమ్మవు అవుతావు అమ్మా..?
భూమి: అవును తినండి..
శరత్: ఇప్పుడు నువ్వు నాకు అమ్మలా కాదు.. మీ అమ్మలా కనబడుతున్నావు.. శోభ కూడా నీలాగే ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. నువ్వు కూడా నన్ను ఎప్పటికీ ఇలాగే చూసుకుంటావు కదమ్మా..?
భూమి: ఎలా చూసుకోగలను నాన్నా.. ఎప్పటికైనా దూరం కావాల్సిన ఆడపిల్లనే కదా..? నాన్నా నేను ఈ ఇంటి నుంచి దూరం వెళ్లాక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్లు ఎవరో మీకు గుర్తుకు వచ్చినా మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. ఆవేశ పడకూడదు. తిరిగొచ్చిన నాకే చెప్పాలి.
శరత్: తిరిగి వచ్చిన అంటే అత్తారింటి నుంచి తిరిగొచ్చిన అనేనా అమ్మా నీ ఉద్దేశ్యం.
భూమి: అవును నాన్నా..?
శరత్: అదేంటమ్మా నువ్వేదో ఈ రాత్రికే అత్తారింటికి వెళ్లిపోతున్నట్టు మాట్లాడుతున్నావు. అయినా నిన్ను నేను ఏ అత్తారింటికి పంపించను. ఇల్లరికం వస్తానన్న అల్లుడినే నీకు పెళ్లి చేస్తాను. అప్పుడు నువ్విలా మాట్లాడవలసిన అవసరం రాదు కదమ్మా..? ఏం మాట్లాడవేంటి భూమి.. నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకోవా అమ్మా.. నాకోసం ఆ గగన్‌ను మర్చిపోవా అమ్మా..?
అంటూ శరత్ చంద్ర అడగ్గానే.. భూమి భోజనం ప్లేట్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది. శరత్ చంద్ర ఏడుస్తుంటాడు. రూంలోకి వెళ్లిన భూమి శోభాచంద్ర ఫోటో తీసుకుని చూస్తూ.. ఏడుస్తుంది.
భూమి: ఏంటమ్మా నాకు ఈ కష్టం. కొన్ని రోజులే అంతా నేను కరెక్టు చేస్తానని గగన్ గారు అంటారు. ఆయన కూడా కరెక్టే కదమ్మా..? ఆయన కాకుండా నాన్న చెప్పిన ప్రకారం ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా.. నేను గగన్ గారితో ఒక రాత్రి గడిపానని నా మీద పడ్డ నింద నిజమైపోతుంది కదమ్మా.. అందుకే కదా ఈరోజు నేను గగన్ గారితో వెళ్లిపోవాలనుకున్నది.
శరత్: వెళ్లిపోవాలనుకుంటుంది నా కూతురు నా శత్రువు గగన్ గాడితో వెళ్లిపోవాలనుకుంటుంది. వాణ్ని కాకుండా ఎంత లేని వాణ్ని అయినా మన భూమి ప్రేమించి ఉంటే మన భూమికి ఈరోజు ఇలా దొంగచాటుగా వెళ్లిపోవాల్సిన అవసరం ఏముంది శోభ. నేనే ఘనంగా పది కాలాల పాటు గుర్తుండి పోయేలా పెళ్లి చేసేవాణ్ని
అంటూ శరత్ చంద్ర, శోభా చంద్ర ఫోటో ముందు నిలబడి బాధపడుతుంటే.. అపూర్వ వచ్చి చూస్తుంది. శరత్ చంద్రను ఓదారుస్తుంది. భూమి వెళ్లిపోతుందన్న నిజాన్ని తెలుసుకుని గగన్ ఇంటికి రాగానే చంపించాలని ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్టుగానే.. భూమిని తీసుకెళ్లడానికి గగన్ కారేసుకుని శరత్ చంద్ర ఇంటిక ఇరాగానే అపూర్వ గన్ తీసుకొచ్చి శరత్ చంద్ర కు ఇచ్చి వాణ్ని కాల్చేయ్ బావ అంటుంది. శరత్ చంత్ర గన్ గగన్‌కు ఎయిమ్ చేస్తాడు. గగన్ లోపలికి వచ్చి భూమిని తీసుకుని కారు దగ్గరకు వెళ్తాడు. అక్కడ భూమి ఏడుస్తూ మీతో నేను రాలేనని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!