Brahmamudi Serial Today Episode: తన ఫోటో రుద్రాణి రూంలోకి ఎలా వచ్చిందని స్వప్న తిడుతుంది. నాకేం తెలియదు అంటూ రుద్రాణి వెళ్లిపోతుంది. కిందకు వెళ్లిన రాజ్‌ను రెస్ట్ తీసుకున్నావా… అని అపర్ణ, ఇందిరాదేవి అడుగుతారు.
రాజ్: రెస్ట్ తీసుకునే విధంగా ఆంటీ రూం లేదు
అపర్ణ: అసలు నువ్వు కళావతి విషయంలో సీరిసయ్‌గా ఉన్నావా..?
రాజ్: అదేంటమ్మా అలా అడిగావు.. తనను ఇంప్రెస్ చేయడానికి వంట రాకపోయినా వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఇలా ఎందుకు కష్టపడతాను
ఇందిరాదేవి: కష్టపడి పాలు పితికి అమ్మితే ఆస్తులు వస్తాయి కానీ అమ్మాయి రాదమ్మా..?
రాజ్: మరి ఏం చేయమంటారు
అపర్ణ: ఇంప్రెస్ చేయమని చెప్తున్నాను కదా
రాజ్: ఫస్ట్ స్టెప్పే ఫెయిల్ అయింది. ఇక నేనేం చేయాలి
ఇందిరాదేవి: ఓరేయ్ ఫెయిల్ అయిందని మూలన కూర్చుంటే ఎలా మేము ఉన్నాము కదా..? నీ వెనక ఇదిగో ఈ గిఫ్టు తీసుకెళ్లి కావ్యకు ఇవ్వు వెళ్లు..
అని చెప్పగానే.. గిఫ్టులు తీసుకుని రాజ్ పైకి వెళ్తాడు.
అపర్ణ: అత్తయ్యా లోపలికి వెళ్లగానే ఏం తేడా కొట్టదు కదా
ఇందిరాదేవి: పిచ్చిదానా అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను విను.. మొదట నా మనవడు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. కావ్య రాజ్‌ను చూడగానే.. మీరు నా గదిలోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది.
కావ్య: గదిలోకి ఎందుకు వచ్చారు..?
రాజ్: మీ కోసమే
కావ్య: ఇంట్లో అందరూ ఉండగా అలా గదిలోకి వచ్చేస్తారా..?
కావ్య: నేను రావడం ఎవరూ చూడలేదు
కావ్య: అయినా సరే మీరు ఇలా రావడం నాకు నచ్చడం లేదు
రాజ్: మీకు ఇష్టం లేదు కాబట్టి రాకూడదు అనుకున్నాను కానీ రాకుండా ఉండలేకపోయాను..
కావ్య: అసలు గదిలోకి ఎందుకు వచ్చారు అది చెప్పండి.
రాజ్: మీకు గిఫ్టు ఇద్దామని వచ్చాను.. ఇదిగోండి బొకే
కింద
ఇందిరాదేవి: ఆ తర్వాత డ్రెస్ ఇస్తాడు. ఆ డ్రెస్ తీసుకుని ఈ డ్రెస్ నాకా అంటుంది. మీకే అని రాజ్ చెప్తాడు. డ్రెస్ చూసి ఎంత బాగుందో అంటుంది. అప్పుడు నా మనవుడు నా కోసం ఒకసారి వేసుకుంటారా..? అని అడుగుతాడు. కావ్య డ్రెస్ వేసుకుని వస్తుంది. ఆ డ్రెస్‌లో కావ్యను చూసి రాజ్ షాక్ స్టన్నయిపోతాడు. కావ్యను అలాగే చూస్తుండిపోతాడు.
అని చెప్తూ ఇందిరాదేవి గట్టిగా అరుస్తుంది. పక్కనే ఉన్న అపర్ణ ఉలిక్కిపడి అత్తయ్యా అంటూ గట్టిగా పిలుస్తుంది.
అపర్ణ: అత్తయ్యా ఏంటి ఏమైంది
ఇందిరాదేవి: అపర్ణ నా మనవడు మనవరాలు ఏడి ఎక్కడ వాళ్లు కలిసిపోయారు కదా
అపర్ణ: వాళ్లు కలవలేదు.. మీరు కలవరిస్తున్నారు అంతే
ఇందిరాదేవి: అయ్యో ఇదంతా నా కలా..? నిజం కాదా..?
రాజ్ కిందకు వస్తుంటే.. చూడు నేను కలవరించిందే అక్కడ జరిగి ఉంటుంది అని ఇందిరాదేవి చెప్తుంది. ఇంతలో కిందకు వచ్చిన రాజ్ అపర్ణ, ఇందిరాదేవిని తిట్టి పైన కావ్య తనను తిట్టి డ్రెస్ విసిరికొట్టింది అని చెప్తాడు. అయితే ఇంకో ప్లాన్ వేద్దాం అని ఇందిరాదేవి చెప్పగానే ఇద్దరూ అమెను అదో రకంగా చూస్తుంటారు. మరోవైపు రూంలో ఉన్న రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది.
యామిని: హలో రుద్రాణి గారు ఫోటో చూపించారా..? రాజ్ చూసి షాక్ అయ్యాడా..?
రుద్రాణి: అవును చూసి షాక్ అవ్వడమే కాదు థ్రిల్ అయిపోయాడు
యామిని: అవునా ఈ పాటికి గొడవ పెట్టుకుని ఉండాలే… నన్నే మోసం చేస్తావా అంటూ బాగా తిట్టి ఉండాలి కదా
రుద్రాణి: అవును తిట్టాడు.. బాగా తిట్టాడు.. కానీ కావ్యను కాదు నన్ను
యామిని: మిమ్మల్ని ఎందుకు తిడతాడు
అంటూ యామిని కోపంగా రుద్రాణిని తిడుతుంది. జరిగి విషయం రుద్రాణి చెప్పగానే అయితే ఇంకో ప్లాన్ వేద్దాం అని తన ప్లాన్ రుద్రాణికి చెప్తుంది. సరేనని రుద్రాణి కిందకు వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ను తిట్టిన కావ్య దగ్గరకు అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి తిడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!