Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం వ్రతం కోసం యమున, వసుధ ఏర్పాట్లు చేస్తారు. నువ్వు నీ భర్తని ఆరాధిస్తూ నీ భర్త కోసం చాలా కష్టపడుతున్నావ్ కానీ అతను నీ కోసం రాడు అని యమున అంటుంది. దానికి వసుధ మనసులో వదిన లక్ష్మీ భర్తే నీ కొడుకు లక్ష్మీనే నీ కోడలు తను ఆ విషయం ఎప్పటికీ చెప్పదు. విహారి నిజం చెప్పాలి అని ప్రయత్నించినా మీరు పెళ్లి అని నోరు మూయించేశారు అనుకుంటుంది.

Continues below advertisement


లక్ష్మీకి భిక్ష ఎవరు వేశారు అని అంబిక అంటుంది. ఇక పద్మాక్షి వచ్చి వచ్చేసిందా ఆ లక్ష్మీ తనతో పాటు ఎవరు ఆవిడ అని అంటుంది. ఎవరో పెద్ద ముత్తయిదువు అనుకుంటా అని అమ్మవారిని ఉద్దేశించి అంబిక పద్మాక్షితో చెప్తుంది. అందరూ వ్రతం దగ్గరకు చేరుకుంటారు. విహారి వచ్చి అమ్మ ఎండలో వ్రతం ఎందుకు పెట్టారు ఇంటిలో చేసుకోవచ్చు కదా అంటాడు. దానిని పద్మాక్షి ఇంట్లో వ్రతం చేసుకోవడానికి తను ఏమైనా ఇంటి మనిషా అని అంటుంది. బయట మనిషి కాబట్టి బయటే చేసుకుంటుందని అంబిక అంటుంది. మీ అమ్మ ఇంట్లోనే ఏర్పాటు చేసింది కానీ దానికి అంత స్థాయి లేదని మేం బయటకు పంపామని పద్మాక్షి అంటుంది. దాంతో విహారి తనకు అంత స్థాయి లేదు అని మీరు అనుకుంటే మీ స్థాయి తగ్గించుకొని తన వ్రతానికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. 


విహారి అలా అనగానే పద్మాక్షి, అంబిక, సహస్రలు షాక్ అయిపోతారు. నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తున్నావా అని అంటుంది. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటాడు. అంత మాట అనిపించుకొని ఇక్కడ ఉండటం ఎందుకు అక్క అని అంబిక అంటుంది. పద్మాక్షి విహారితో రేపు ఏమైనా అయితే నీకు అండగా ఉండేది బ్లడ్ రిలేషన్ అని మర్చిపోవద్దు అని చెప్పి వెళ్లిపోతుంది. సహస్ర విహారి దగ్గరకు వెళ్లి బావ నువ్వు ఏ స్థాయి వాళ్లకి అయినా సపోర్ట్‌గా ఉంటావా లేక కేవలం లక్ష్మీ లాంటి వాళ్లకే అండగా ఉంటావా అని అడుగుతుంది. విహారి తల దించుకుంటాడు. నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా పర్లేదు నీ అంతరాత్మకి సమాధానం చెప్పుకో చాలు అని సహస్ర వెళ్లిపోతుంది. ఇంతలో పంతులు వస్తారు. 


పంతులు లక్ష్మీతో ఈ సుమంగళి వ్రతంలో ముత్తయిదువులు ఇచ్చిన భిక్షతో వ్రతం చేయడం ఎంత ముఖ్యమో ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని అంటారు. ముత్తయిదువులు వస్తారు అని లక్ష్మీ పూజ ప్రారంభించమని అంటుంది. సహస్ర చాలా చిరాకు పడుతుంది. అది ఏదో ఒకటి చేస్తుందని అనుకుంటుంది. పద్మాక్షి సహస్రతో అది వ్రతం చేసుకుంటే మనకు ఎందుకు అని అంటుంది. దాంతో సహస్ర వ్రతం పూర్తి అయితే అది దాని మొగుడితో సంతోషంగా ఉంటుందని అంటుంది. వాడు వస్తే అది వెళ్లిపోతుంది కదా మనకి దాని అడ్డు పోతుంది కదా అని అంటారు. దానికి సహస్ర మనసులో దాని భర్త బావ మీకు అది ఎలా చెప్పాలి అనుకుంటుంది. పద్మాక్షి కూతురితో దాని గురించి వదిలేయ్ రేపు నీ పెళ్లి అది మాత్రమే ఆలోచించు అని అంటుంది. సహస్ర చిరాకుగా వెళ్లిపోతుంది. 


సహస్ర అద్దం ముందుకు వెళ్లి బావ దగ్గరుండి దానితో వ్రతం చేయిస్తున్నావ్ కదా నువ్వు ఎన్ని చేసినా రేపు నా మెడలో తాళి కట్టేది నువ్వే అని అనుకుంటుంది. ఇక పంతులు ముత్తయిదువుల్ని పిలమని అంటారు. పండు ముత్తయిదువులకు పిలుస్తాడు. అందరూ పని ఉంది రావడం కుదరదు అని అంటారు. ఎవరూ రామని చెప్పారని యమున వాళ్లతో చెప్తాడు. అమ్మవారు వాళ్లతో అమ్మవారి పూజ అంటే ఎందుకు రానని అంటారు. ముత్తుయిదువులుగా తాంబూలం తీసుకోవడం శుభం కదా అని అంటుంది. ఇక పంతులు ముత్తయిదువులకు తాంబూలం ఇస్తేనే వ్రతం పూర్తయినట్లని లేదంటే నీ పసుపు కుంకుమలకే ప్రమాదం అంటారు. 


లక్ష్మీ వెళ్లి పిలుస్తా అంటే పంతులు మధ్యలో లేవొద్దని అంటారు. యమున వసుధతో నేను పద్మాక్షి వదినకు బతిమాలుతా నువ్వు వెళ్లి కాలనీ వాళ్లని పిలవమని అంటుంది. వసుధ పిలుస్తుంది. కానీ ఎవరూ రానని అంటారు. వసుధ వచ్చి ఎవరూ రావడం లేదని చెప్తుంది. ఇప్పుడేం చేద్దామని అందరూ అనుకుంటారు. దేవుడి మీద భారం వేసి అమ్మవారికి దండం పెట్టుకుంటారు. వ్రతం పూర్తయిపోతుంది. అమ్మవారికి లక్ష్మీ మొదటి తాంబూలం ఇస్తుంది. ఇక వసుధకు రెండో తాంబూలం ఇస్తుంది. పద్మాక్షికి తాంబూలం ఇవ్వడానికి వెళ్తుంది. నాకు తాంబూలం దాని దగ్గర తీసుకోను అని పద్మాక్షి అంటుంది. అందరూ పద్మాక్షిని తీసుకోమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!