Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర కండీషన్‌లో ఏ మార్పు లేదని చివరి చూపు చూసుకునే వాళ్లకి కబురు పెట్టుకోండి అని డాక్టర్ విహారి వాళ్లకి చెప్తుంది. పద్మాక్షి వాళ్లు ఏడుస్తూ వస్తుంటారు. డాక్టర్ సహస్రని లేపి కాసేపట్లో మీ వాళ్లు అందరూ వస్తున్నారని అంటుంది. వాళ్లు వస్తే నా నటన పండుతుందని సహస్ర అంటుంది. విహారి ఒక సారి సహస్రతో మాట్లాడుతా అని అనుకొని ఐసూయూ వైపు వెళ్తాడు. విహారి లోపలికి వెళ్లే సరికి సహస్ర బెడ్ మీద పడుకొని ఉంటుంది.
విహారి: సహస్రని చూసి సహస్ర ఎందుకు ఈ పని చేశావ్ అత్తయ్య వస్తున్నారు అందరూ వస్తున్నారు. వాళ్లని ఎలా ఫేస్ చేయాలి. సహస్ర నీకు నా మాట వినిపిస్తుందో లేదో నాకు తెలీదు కానీ నువ్వు లే సహస్ర. కానీ త్వరగా లే సహస్ర. లక్ష్మీ: సహస్రమ్మకి ఎలా ఉందో ఏంటో అక్కడ సహస్రమ్మ కండీషన్ ఏంటో. పద్మాక్షి ఏమంటారో ఏంటో. ఎవరు ఏమన్నా ఒకసారి వెళ్లి చూడటం ధర్మం. పద్మాక్షి: ఏడుస్తూ.. విహారి, అంబిక సహస్ర ఎక్కడుందే.అంబిక: ఐసీయూలో అక్క.పద్మాక్షి: చిన్న యాక్సిడెంట్ అయితే ఐసీయూలో ఎందుకు ఉంటారే. రేయ్ నువ్వు అయినా నిజం చెప్పురా నా కూతురికి ఏమైంది తన కండీషన్ ఎలా ఉంది. సహస్ర: డాక్టర్ ఇప్పటి నుంచి మనం అనుకున్నది అనుకున్నట్లు జరగాలి. డాక్టర్: సహస్ర కండీషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ హెల్ప్ లెస్. పద్మాక్షి: డాక్టర్ దయచేసి నా కూతురుని కాపాడండి డాక్టర్ తను లేకపోతే మేం బతకలేం.డాక్టర్: మా ప్రయత్నం చేస్తున్నాం కానీ కష్టం అండీ.పద్మాక్షి: కుప్పకూలిపోయి తల్లిని పట్టుకొని చాలా ఏడుస్తుంది. అమ్మ నా కూతురికి ఏ పరిస్థితి తీసుకొచ్చారో చూశావా. ఇలాంటి రోజు రాకూడదు అని భయపడ్డాను. కానీ వీళ్ల వల్ల వచ్చేసింది. నాకు అసలు మన ఇంటికి రావడం ఇష్టం లేదు కానీ కేవలం అది వీడిని ఇష్టపడింది అని వచ్చాను. అమ్మా ఇప్పుడు నా కూతుర్ని ఎవరు కాపాడుతారు. విహారి నా కూతురిని బతికించి తీసుకురా. మీరు ఆటలు ఆడుకోవడానికి నేను నా కూతురే దొరికామా. అది నా బావ నా బావ అని నీ చుట్టూ పిచ్చి దానిలా తిరుగుతుంటే నిజంగానే దాన్ని పిచ్చిదాన్ని చేసేశావ్. నువ్వు మీ నాన్న లాగే. ఒకప్పుడు మీ నాన్న నా జీవితం నాశనం చేస్తే ఇప్పుడు నువ్వు నా కూతురి జీవితం నాశనం చేశావ్. కానీ నువ్వు మీ నాన్నని మించిన మోసగాడివి. నీ వల్ల నా కూతురిజీవితమే కాదు ప్రాణం కూడా పోతుంది. దానికి ఏమైనా అయితే ఎవరినీ వదలను. లక్ష్మీ: దేవుడా సహస్రమ్మకు ఏం కాకూడదు. అంబిక: ఏంటి వచ్చావ్ మా సహస్ర బతికిందా చచ్చిపోయిందా చూడటానికి వచ్చావా.లక్ష్మీ: అమ్మ సహస్రమ్మకి ఎలా ఉంది. అంబిక: నీ వల్లే కదా సహస్ర బతకడానికి పోరాడుతుంది. నీ వల్లే సహస్రకు ఈ గతి పట్టింది. నిన్ను చంపేస్తే కానీ మా ఇంటికి పట్టిన దరిద్రం వదలదే అని గొంతు పడుతుంది. పద్మాక్షి వచ్చి చూస్తుంది. ఇంతలో వసుధ వచ్చి విడిపిస్తుంది. నువ్వు అక్కడికి రాకు. మాకు వచ్చే కోపానికి నిన్ను చంపినా చంపేస్తాం.
సహస్ర ఇంకా కొద్ది గంటలే బతుకుతుందని వసుధ లక్ష్మీతో చెప్తుంది. లక్ష్మీ షాక్ అయిపోతుంది. పద్మాక్షి తల్లి ఒడిలో పడుకొని చాలా ఏడుస్తుంది. సహస్ర వాళ్లు తమ యాక్షన్ రెండో స్టేజ్ మొదలు పెడతారు. పేషెంట్ పల్స్ డౌన్ అవుతుందని నర్స్‌కు చెప్పి పంపిస్తుంది. నర్స్‌లు హడావుడిగా బయటకు వెళ్తారు. విహారి వాళ్లు నర్స్‌ని ఏమైందని అడిగితే పేషెంట్ పల్స్ డౌన్ అయిపోతుంది. హార్ట్ కొట్టుకోవడం తగ్గిపోతుందని చెప్తారు. అందరూ షాక్ అవుతారు. పద్మాక్షి చాలా ఏడుస్తుంది. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ చేస్తుంది. తర్వాత బయటకు వచ్చి గంటల మనిషి నిమిషాలు మాత్రమే బతికే స్టేజ్‌కి వచ్చిందని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. ఫైనల్ స్టేజ్ అని 99 శాతం బతకదు కానీ ఒక్క శాతం ఆ దేవుడు కరుణిస్తే చెప్పలేం అని అంటుంది. సహస్ర సహస్ర అని పద్మాక్షి కుప్పకూలిపోతుంది.
పద్మాక్షి ముఖం మీద నీళ్లు కొట్టి విహారి మంచినీరు తాగడానికి ఇస్తే పద్మాక్షి విసిరి కొడుతుంది. అందర్నీ నెట్టేస్తుంది. విహారి కాలర్ పట్టుకొని మీ వల్లే అది చచ్చిపోయింది. నువ్వు మీ అమ్మ మీ అమ్మ తెచ్చిన లక్ష్మీ వల్ల నా కూతురిని చంపేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నా కదరా. ప్రేమ అని దాన్ని చంపేశారు. నా ఉసురు దాని ఉసురు తగిలి మీరంతా నాశనం అయిపోతారురా నాశనం అయిపోతారు అని గుండె పగిలేలా ఏడుస్తుంది. వసుధ ఓదార్చాలి అని వెళ్తే నా బిడ్డ వసుధ అని ఏడుస్తుంది.
యమున ఏడుస్తూ పక్కకు వెళ్తుంది. విహారి వెళ్లి కాళ్లు పట్టుకొని ఏడుస్తాడు. యమున విహారిని నెట్టేసి చీదరించుకుంటుంది. విహారి షాక్ అయిపోతాడు. అమ్మా ఏమైంది అని అడిగితే నువ్వు నాతో మాట్లాడకు. సహస్ర అలా ఉండటానికి కారణం నువ్వేరా. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. తాళి కట్టి చివరి నిమిషంలో ఇలా చేశావేంట్రా. నువ్వే కదా వాళ్ల ఇంటికి వెళ్లి మరీ మాట ఇచ్చావ్. రేయ్ నీ అత్తయ్య మనోవేధన నీకు తెలుస్తుందో లేదో తెలీదు కానీ నాకు తన కడుపుకోత తెలుస్తుందిరా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.