Prema Entha Madhuram  Serial Today Episode: పెళ్లిళ్లు అయిపోయాక అందరూ కలిసి కార్లలో వెళ్తుంటారు. చిన్నొడు, పెద్దొడు శ్రావణి, సంధ్యలతో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లను చూసిన ఓనరు ఇరిటేటింగ్‌గా  ఈ కార్లన్నీ సడెన్‌గా ఆగిపోతే బాగుండు అనుకుంటాడు. అనుకున్నట్టుగానే కార్లు ఆగిపోతాయి. ఎదురుగా శివారెడ్డి తన మనుషులతో వచ్చి అడ్డంగా నిలబడతాడు. జెండేను తమ కార్లలోనే బందీగా చేసుకుని వస్తారు. శివారెడ్డి వాళ్లను చూసిన శంకర్‌, చిన్నొడు, పెద్దొడు షాక్‌ అవుతారు.

రాకేష్‌: రోడ్డుకు అడ్డంగా కారు నిలబెట్టాడు ఎవరితను..?

పెద్దొడు: శివారెడ్డి..

శంకర్‌: అను ఇక్కడ ఏం జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కారు దిగకూడదు.

గౌరి: ఏంటి సార్‌ ఇదంతా.. సార్‌..

రాకేష్‌: ఏయ్‌ మిస్టర్‌ రోడ్డుకు అడ్డంగా కార్లు పెట్టావేంటి..? ముందు తీయ్‌

ఓనరు: ఏయ్‌ రాకేష్‌ ఆగవయ్యా నువ్వు.. వీళ్లకు ఇలా చెప్తే అర్తం కాదు. రేయ్‌ మీసాలోడా..? ఎవడ్రా నువ్వు రోడ్డు ఏమైనా నీ బాబుది అనుకున్నావా..? వెహికిల్స్‌ అన్ని తీసుకొచ్చి అడ్డంగా పెట్టావు.. తీయ్‌ పక్కకు తీయ్‌.. లేకపోతే..

శివారెడ్డి: మర్యాద అప్పా.. చెడ్డొడైనా మంచోడైనా నీకు ఎదురొచ్చిన ప్రతోడికి మర్యాద ఇవ్వాలి.

ఓనరు: సారీ సారీ అండి మీ దగ్గర గన్‌ ఉందని తెలియక..

శివారెడ్డి: భయపడకు అప్పా.. నేను ఈడికి వచ్చింది నీకోసం కాదులే.. అదిగో నాకు కావాల్సిన మనిషి ఆడ ఉన్నాడు. మేము మేము తేల్చుకోవాల్సింది చాలా ఉంది. సీమకు దూరంగా ఉన్నా కూడా నీ కళ్లల్లో పౌరుషం తగ్గలేదని నీ కళ్లు చెప్తున్నాయి ఆదిశంకర్‌రెడ్డి.

యాదగిరి: ఆదిశంకర్‌ రెడ్డా..?

శివారెడ్డి: యాడికి పోయినా కూడా మీరు మీ అన్నతోనే ఉంటారని నాకు తెలుసులే అప్పా..పెద్దిరెడ్డి సాక్ష్యాలు ఎందుకు..? ఏం సింగిరెడ్డి అంతా క్షేమమేనా..?

శ్రావణి: పెద్దిరెడ్డా..?

సంధ్య: సింగిరెడ్డా..?

శంకర్‌: ఏంటి శివారెడ్డి నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చావా..?

శివారెడ్డి: నా శత్రువు పిలుపు ఎన్నాళ్లకు విన్నాను. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు వచ్చేసి ఉండావు ఆదిరెడ్డి. మరి నా మాట కూడా నేను నిలబెట్టుకోవాలి కదా..? అందుకే నిన్ను తీసుకుపోదామని వచ్చిన

పెద్దొడు: ఏంది మా అన్నను తీసుకెళ్లడానికి వచ్చినవా..? మా అన్నను టచ్‌ చేసే దమ్ముందా నీకు

చిన్నొడు: టచ్‌ చేసి చూడు నెక్స్ట్‌ మినిట్‌ నీ చావే..?

శివారెడ్డి: ఇటాంటి చానా విషయాలు చూసినలే అప్పా.. అయినా సొంత గడ్డను విడిచిపెట్టి ఎన్ని దినాలు ఇలా అజ్ఞాతవాసం చేస్తావు.

శంకర్: శివారెడ్డి నా సీమకు నేను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాను. నువ్వు రమ్మన్నప్పుడు కాదు.

శివారెడ్డి: నువ్వు అదే మాట అంటావని నాకు తెలుసప్పా..? అందుకే నా ఉపాయంతో నేను వచ్చుండా..?రేయ్‌ మన ఆదిశంకర్‌ రెడ్డి ప్రాన స్నేహితుడిని పట్టుకురండ్రా..

అని చెప్పగానే శివారెడ్డి మనుషులు తమ దగ్గర బందీగా ఉన్న జెండేను తీసుకొస్తారు. జెండేను చూసిన శంకర్‌ వాళ్లు షాక్‌ అవుతారు.

శంకర్‌: జెండే…

జెండే: శంకర్‌…

శంకర్: శంకర్‌ ను కాదు జెండే.. ఐ యామ్‌ యువర్‌ ఆర్యవర్దన్‌..

జెండే: ఆర్యా…?

శివారెడ్డి: ఆగప్పా నువ్వు ఇప్పుడు నా ఎర. ఎరేసి సింహాన్ని పట్టాలి. నువ్వే వెళ్లిపోతే ఎట్టా..?

శంకర్‌: శివారెడ్డి జెండేను వదులు.. మన పగ మధ్యలోకి సంబంధం లేని వాళ్లను తీసుకురాకు.

శివారెడ్డి: నాకు ఏ సంబంధం లేకపోవచ్చు. కానీ నీకు ఈ కుటుంబానికి ఉన్న బంధం, సంబంధం అంతా నాకు తెలుసు అందుకే కదా నీ ప్రాణస్నేహితుడిని తీసుకొచ్చాను.

అంటూ బాంబులు వేసి గౌరిని, జెండేను ఎత్తుకెళ్లిపోతాడు శివారెడ్డి. దీంతో శంకర్‌ కోపంగా రగిలిపోతుంటాడు. యాదగిరి, ఇంటి ఓనరు అసలు వాళ్లెవరు అని అడుగుతారు. దీంతో శంకర్‌ నిజం చెప్తాడు. మీరందరూ అనుకుంటున్నట్టు మేము అనాథలం కాదు. మాది రాయలసీమ.. అంటూ జరిగిన ప్లాష్‌బ్యాక్‌ చెప్తాడు.ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

   

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!