Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీని సహస్ర దగ్గరుండి పెళ్లి కూతురిలా రెడీ చేస్తుంది. వసుధ లక్ష్మీని ఆశీర్వదిస్తుంది. తర్వాత సహస్ర విహారికి అక్షింతలు ఇచ్చి లక్ష్మీని దీవించమని అంటుంది. లక్ష్మీ కన్నీరు విహారి కాళ్ల మీద పడుతుంది. విహారి దీర్ఘ సుమంగళి భవ అని దీవించి కనకం ఎందుకు బాధ పడుతుంది అని అనుకుంటాడు. తర్వాత వసుధ, సహస్రలు లక్ష్మీని తీసుకెళ్తారు. 

విహారి: నేను తనని మదన్‌ని పెళ్లి చేసుకోమని చెప్పాను. సమస్యకి అదే పరిష్కారం అని కూడా చెప్పాను కానీ తనకు మదన్ అంటే ఇష్టమేనా మదన్‌ని పెళ్లి చేసుకోవడానికి తనకి మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని ఒక్క మాట అడగలేదు. నా బలవంతం వల్ల తను ఈ పెళ్లికి ఒప్పుకుందా. అందుకే ఈ కన్నీళ్లా ఇష్టం లేని పెళ్లికి ఒప్పుకుందా. తనకు ఈ పరిస్థితి ఇప్పుడు కష్టంగా ఉన్నా రేపటి రోజున సుఖపడుతుంది.యమున: ఎంత బాగున్నావ్ మదన్ నీకు నా దిష్టే తగిలేలా ఉంది.పద్మాక్షి: వాడికి దిష్టి పెట్టింది చాలు నువ్వు ఎక్కడ పాదం పెడితే అక్కడ అపశకునం నీ నోటి మాట అశుభం.మదన్: ఆంటీ అలా అనొద్దు పెద్ద నాకు అమ్మ లాంటిది. ఇప్పుడు తానే అన్నీ అయి నాకు పెళ్లి చేస్తుంది. పెద్దమ్మా ఆశీర్వదించు.యమున: శీఘ్రమే సుపుత్రా ప్రాప్తిరస్తు.అంబిక: వదిన నీ దీవెన ఫలిస్తుందా. అంటే దగ్గరుండీ అంతా నువ్వే చూసుకుంటున్నావ్ కదా. పద్మాక్షి: జరగాలి లేకపోతే జరిగేదే వేరు.మదన్: వేరే ఏముంటుంది ఆంటీ జరిగేది నా చావేయమున: అలా మాట్లాడుతావేంటి నాన్న ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నేను దగ్గరుండి జరిపిస్తాను. ఆ బాధ్యత నాది. అంబిక: మనసులో నీ నుంచి ఈ మాట రావాలి అనే నేను మాట్లాడాను.

మరోవైపు విహారి తన ఫ్రెండ్‌ సత్యతో మాట్లాడుతాడు. పెళ్లి టైంకి కనకం తల్లిదండ్రుల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఏర్పాటు చేస్తాడు. ఇక విహారి తాను వెళ్లను అని సత్యని వెళ్లి తీసుకురమ్మని చెప్తాడు. ఇక్కడ తాను లక్ష్మీని, మదన్ అందరినీ చూసుకోవాలి అని అంటాడు. ఇప్పుడు వాళ్లని తెస్తే ప్రాబ్లమ్ కదా అని అంటే జాగ్రత్తగా నేను నిజం చెప్తాను అని కనకం కూడా తన తల్లిదండ్రులకు మోసం చేస్తున్నట్లు ఫీలవుతుందని అందరినీ సరిగ్గా కన్విన్స్ చేస్తేనే సంతోషంగా ఉంటారని అంటాడు. సత్య కనకం పుట్టింటికి బయల్దేరుతాడు.

లక్ష్మీని తీసుకొని దేవుడికి దండం పెట్టిస్తారు. తనకు ఈ జీవితమే వద్దని అనుకుంటుంది. లక్ష్మీని చూసి యమున కన్నీరు పెట్టుకుంటుంది. నిన్ను ఇలా చూస్తూ ఓ వైపు సంతోషం మరోవైపు బాధ కలుగుతున్నాయని అంటుంది. నీకు మదన్‌కి అమ్మానాన్న నేనే అయ్యానని సంతోషపడుతుంది. నువ్వు నా ఫ్యామిలీ అయిపోయావని నీ అప్పగింతల్లో ఉండాల్సిన కన్నీరు పెళ్లి కూతురిగా చూస్తుంటేనే వస్తున్నాయని లక్ష్మీని హగ్ చేసుకొని ఏడుస్తుంది. వసుధ కూడా లక్ష్మీని హగ్ చేసుకుంటుంది. మదన్‌ని కూడా దేవుడికి దండం పెట్టుకోమని యమున చెప్తుంది. మదన్ విహారి కాళ్ల మీద పడబోతాడు. నువ్వే నా దేవుడు అని అంటాడు. నువ్వు లేకపోతే నేను ప్రేమించిన లక్ష్మీ నాతో ప్రేమకు ఒప్పుకునేది కాదని అంటాడు. లక్ష్మీ చేయి పట్టుకొని ఇద్దరూ విహారి కాళ్లకి దండం పెడతారు. ఇద్దరినీ విహారి దీవిస్తాడు. ఇద్దరినీ తీసుకొని కల్యాణ మండపానికి బయల్దేరుతారు. లక్ష్మీ ఎమోషనల్ అవుతూ బయటక  కాలు పెడుతుంది. 

సత్య ఆదికేశవ్ ఇంటికి వెళ్తాడు. విహారి వాళ్లు హైదరాబాద్ వచ్చాడని మిమల్ని దగ్గరుండి తీసుకురమ్మని నాతో చెప్పాడని అంటాడు. ఇక విహారికి కాల్ చేస్తాడు. విహారి ఈరోజే హైదరాబాద్ వచ్చానని మాట్లాడుతాడు. గుడిలో చిన్న పూజ ఉందని రమ్మని చెప్తాడు. ఇక అందరూ గుడికి చేరుకుంటారు. లక్ష్మీ తాళి బొట్టు తీయకపోవడంతో ఇంకా ఎందుకు తీయలేదు అని యమున అడిగి ఎవరూ చూడక ముందు తాళి తీసేయ్ అని చెప్తుంది. లక్ష్మీ తాళి పట్టుకొని దీని విలువ నా భర్త ఆయుష్షు అని అది గుండెల మీద ఉంటేనే విలువ అని అంటుంది. లక్ష్మీ మీద అనుమానం వచ్చిన వసుధ నువ్వేం పిచ్చి పని చేయవు కదా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!