Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీ మీద హత్య నింద పడటం లక్ష్మీని చంపాలని రౌడీలు ప్రయత్నించడం గురించి ఆలోస్తాడు. లక్ష్మీ కాఫీ తీసుకొని గార్డెన్‌లో ఉన్న విహారి దగ్గరకు వస్తుంది. విహారి లక్ష్మీతో కేసు తన ఫ్రెండ్‌కి చెప్పి ఎంక్వైరీ చేయిస్తున్నానని అంటాడు. ఇంతలో ఆఫీసర్ సంధ్య వస్తుంది. లక్ష్మీ విషయంలో జరిగిన హత్య కేసు గురించి మొత్తం చెప్తాడు.

అంబిక చాటుగా విని ఈ హత్య కేసు వెనక నేను ఉన్నానని తెలిస్తే నా పని అయిపోతుందని అనుకుంటుంది. సంధ్య మొత్తం విని ఈ కేసు ఎవరో కావాలనే చేసినట్లు ఉన్నారు. ఇందుకోసం మీ ఇంటి వాళ్లని కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుందని చెప్తుంది. విహారి సరే అంటాడు. అంబిక మనసులో వీళ్లని ఏదో ఒకటి చేయి వీళ్లని డైవర్ట్ చేయాలి అనుకుంటాడు. ఇక లక్ష్మీ ఆఫీస్‌లో అందరికీ బోనస్ ఇస్తానని చెప్పాలని లోన్ ప్రాసెస్లో ఉందని చెప్తుంది. ఇద్దరూ కంపెనీ గురించి మాట్లాడుకుంటారు. అంబిక మనసులో మీరు బోనస్ ఇవ్వకుండా నేను అడ్డుకుంటా.. నీ నుంచి కంపెనీ పగ్గాలు నేను తీసుకుంటా అనుకుంటుంది.

అంబిక వెళ్లిపోతుంది. లక్ష్మీ కూడా వెళ్లిపోతూ పడిపోబోతే విహారి పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు అలాగే చూస్తూ ఉండిపోతారు. విహారి, లక్ష్మీ అలా ఒకర్ని ఒకరు పట్టుకొని ఉండిపోవడం మేడ మీద నుంచి యమున చూస్తుంది. షాక్ అయిపోతుంది. విహారి లక్ష్మీని పట్టుకొని కూర్చొపెట్టి లక్ష్మీ కాళ్లు పట్టుకొని మర్దన చేయడం లక్ష్మీ విహారిని అలా చూస్తూ మురిసి పోవడం చూసి యమున చాలా ఇబ్బందిగా ఫీలై అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లోపలికి వెళ్లి నేను ఎప్పుడైనా తప్పుగా ఆలోచిస్తున్నానా.. పద్మాక్షి వదిన.. అంబిక, సహస్ర వాళ్లు ఈ విషయం గురించి లక్ష్మీని తిడుతుంటారు. అది నిజమేనా.. నాలో అనుమానం ఒకటి చెప్తుంది. ఆత్మ మరొకటి చెప్తుంది. ఏది నిజం అని ఆలోచిస్తూ బాధ పడుతుంది.

యమున దగ్గరకు వసుధ వస్తుంది. ఏమైందని అడుగుతుంది. వసుధ వచ్చిఎన్ని మాట్లాడినా యమున అలా చూస్తూ ఉండిపోతుంది. వదిన నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావ్ నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతుంది. ఏం దాయడం లేదని యమున కంగారుగా చెప్పడంతో వసుధ వెళ్లిపోతుంది. పద్మాక్షి లక్ష్మీ గురించి మాట్లాడిన మాటలు తలచుకొని నిజమేనా అని ఆలోచిస్తుంది. ఇక చారుకేశవ వచ్చి లక్ష్మీని పిలిచి ల్యాప్ ట్యాప్ ఇస్తాడు. లక్ష్మీ సార్ అని పిలిస్తే చారుకేశవ సార్ ఏంటి బాబాయ్ అని పిలవమని అంటాడు. లక్ష్మీ పిలుస్తుంది. చారుకేశవ పెన్‌డ్రైవ్ ఎలా మిస్ అయిందని అడిగి తనకు అంబిక, సహస్రల మీద అనుమానం ఉందని అంటాడు.

లక్ష్మీ వాళ్లు అలా చేయరు అంటుంది. నా మీద కోపం ఉన్నా వాళ్ల కంపెనీకి వాళ్లు నష్టం చేయరు కదా అంటుంది. సహస్ర చాటుగా మాటలు విని బాబాయ్‌కి నా మీద అనుమానం వచ్చేసిందని అనుకుంటుంది. ఇక అప్పుడే లక్ష్మీకి మెయిల్ వస్తుంది. ఫండ్స్ ఇవ్వడానికి 8 బ్యాంక్‌లు ఒప్పుకున్నాయని అంటుంది. ఇద్దరూ సంతోషపడతారు. సహస్ర చాలా కోపంగా చూస్తుంది. విహారి గదిలో ఉంటే సహస్ర వెళ్లి వెనక నుంచి హగ్ చేసుకుంటుంది. విహారి సహస్ర అని అరుస్తూ చిరాకుగా సహస్రని నెట్టేస్తాడు. సహస్రని తిడతాడు. అదంతా యమున చూస్తుంది. నేనే హగ్ చేసుకున్నా కదా బావ అని సహస్ర అంటుంది. అయితే ఏంటి అని విహారి అంటాడు.

యమున చాలా కంగారు పడి కిందకి వెళ్లిపోతుంది. సహస్ర బావతో మనం భార్యాభర్తలం బావ అని అంటుంది. నేను ఆఫీస్ టెన్షన్‌లో ఉన్నాను అని అంటాడు. సహస్ర బావతో మనం హనీమూన్‌కి వెళ్దాం బావ ఇంట్లో అందరూ మామయ్యని మనకి ఇవ్వమని అంటున్నారు అని అంటుంది. విహారి మనసులో నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు అని అనుకుంటాడు. సహస్ర ఇక వెళ్లిపోతుంది. యమున విహారి లక్ష్మీతో చనువుగా ఉంటూ సహస్రని దూరం పెట్టడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో లక్ష్మీ యమున దగ్గరకు వచ్చి కాఫీ, జ్యూస్ అని అడిగితే నాకు ఏం వద్దని యమున కోపంగా అంటుంది. లక్ష్మీతో నీ పెళ్లి ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది. రాజమండ్రిలో జరిగిందని లక్ష్మీ చెప్తుంది. డేట్ కూడా అడుగుతుంది. విహారి గతంలో రాజమండ్రి వెళ్లడం గుర్తు చేసుకుంటుంది.

లక్ష్మీ గుడికి వెళ్తానని అంటే మధ్యాహ్నం గుడికి ఎందుకు అని అంటుంది యమున. మనసు బాలేదు ప్రశాంతత కోసం వెళ్తున్నా అని చెప్పి లక్ష్మీ వెళ్తుంది. సహస్ర విని గుడికి వెళ్తున్నావా నా జీవితం నాశనం చేసి నువ్వు ప్రశాంత కోసం వెళ్తున్నావా అనుకుంటుంది. ఇక విహారి యమున దగ్గరకు వస్తే పోయిన జులై రెండో వారం ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. ప్రకాశ్ పెళ్లికి రాజమండ్రి వెళ్లానని విహారి చెప్తాడు. ప్రకాశ్మన ఇంటికి రావడమే లేదు అతన్ని తన భార్యతో రమ్మని చెప్పు అంటుంది. విహారి బయటకు వెళ్తానని అంటే ఇప్పుడు ఎందుకు అని అనుమానంగా అడుగుతుంది. ఇక అంబిక విహరి వెళ్లడం చూసి వెళ్లు విహారి ఇక నువ్వు తిరిగి రావు అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!