Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవా ఇద్దరూ బండి పాడవటంతో రాత్రి ఓ చోట మంట పెట్టుకొని కూర్చొంటారు. మిథున దేవాతో కాసేపు సరదాగా క్యారెక్టర్లు మార్చుకుందాం అని అంటుంది. కాసేపు తను దేవాలా మాట్లాడుతానని నువ్వు మిథునలా మాట్లాడు అని చెప్తుంది. దేవా మిథునతో నీ పాటల కంటే ఈ ఆటే బెటర్ అని ఒకే చెప్తాడు. మరోవైపు ఎస్ఐ మిథున కోసం రాత్రంతా తన కానిస్టేబుల్‌ని వెంట పెట్టుకొని తిరుగుతాడు. 

కానిస్టేబుల్ దాసుతో మీరు ఓ గౌరవమైన పోలీస్ వృత్తిలో ఉండి ఈ అమ్మాయిల గోల ఏంటి సార్ అంటాడు. దాంతో ఎస్‌ఐ నేను కళాకారున్ని నన్ను ప్రోత్సహించాలి అంటాడు. మిథున దేవాలా మారి దేవాతో ఏయ్ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావ్ అంటుంది. నువ్వు నా మెడలో తాళి కట్టావ్ కాబట్టి అని దేవా మిథునలా మిథునతో అంటాడు. మీరే నా భర్త ఇదే నా అత్తారిల్లు అని మిథునా దేవా అంటే దేవా తనని తిట్టినట్లు మిథున తిడుతుంది. ఇక ఎస్‌ఐ మిథున వాళ్ల జీపు చూసి వాళ్ల కోసం వెతుకుతాడు. మిథునలా దేవా తన తాళి బంధం గురించి చెప్తే మిథున దేవాలా చీదరించుకుంటుంది. 

ఎస్‌ఐ గన్ తీసి ఈ రోజు దేవా అంతు చూసి మిథునని నా సొంతం చేసుకుంటా అంటాడు. దేవా మిథునలా మీరు ఎన్ని అన్నా నేను నీ భార్యనే నీతోనే ఉంటా.. మిమల్ని వదలను అని అంటాడు. మిథున ఏడుస్తూనే దేవాలా నటిస్తూ నువ్వు ఎన్ని చేసినా ఈ జీవితంలో నువ్వు నాకు భార్యవి కాదు అని అంటుంది. దేవా మిథునలా నువ్వు నన్ను ద్వేషించినా అసహ్యించుకున్నా నేను దేవా భార్యలానే ఉంటాను. ఈ గుమ్మం దాటిలి అంతే అది నా శవమే దాటుతుంది కానీ నేను కాదు అని దేవా అని ఆలోచనలో పడతాడు. మిథున వైపు చూస్తాడు. అప్పటికే మిథున ఏడుస్తూ దేవాని చూస్తుంది. దేవా కూడా కన్నీరు పెట్టుకుంటుంది.

మిథున దేవాతో నా స్థానంలో ఉంటే అర్థమైందా నా బాధ.. నేను ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో ఇప్పటికైనా తెలిసొచ్చిందా అని ఏడుస్తూ అడుగుతుంది. దేవా ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు హరివర్దన్ క్యాలెండర్ చూస్తూ వారం రోజుల గడువుకు మొదటి రోజుని మార్క్ చేస్తారు. మిథునతో తాను పెట్టుకున్న ఛాలెంజ్ గుర్తు చేసుకుంటారు. అలంకృత వచ్చి ఏంటి నాన్న క్యాలెండర్‌లో అలా డేట్స్ కొట్టేస్తున్నారు అని అడిగితే ఇది నా పెద్ద కూతురు నా దగ్గరకు రావడానికి గడువు అని అంటారు. వారం రోజుల్లో మొదటి రోజు అయిపోయింది మీ అక్క ఛాలెంజ్‌లో గెలవలేదు. ఓడిపోయి ఇక్కడికి రావడం తప్ప మిథునకు మరో మార్గం లేదు అని అంటారు. త్రిపుర  మామయ్యతో ఇప్పటి వరకు రాని మిథున ఆ ఛాలెంజ్ వదిలేసి రేపటి రోజున వస్తుందా అని అడుగుతుంది. 

మిథున కచ్చితంగా వస్తుందని హరివర్దన్ అంటారు. తనలాగే తన కూతురు ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటుందని ఛాలెంజ్‌లో తను ఓడిపోవడం ఇంటికి రావడం కచ్చితంగా జరుగుతుంది అని అంటాడు. బామ్మ మిథున కచ్చితంగా గెలుస్తుందని తన భర్తకి తన మీద ప్రేమని నిరూపిస్తుందని అంటుంది. లలిత, అలంకృతలకు ధైర్యం చెప్తుంది. ఉదయం దేవా నిద్ర లేస్తాడు. మిథున కనిపించకపోవడంతో మిథునని పిలుస్తూ మొత్తం వెతుకుతాడు. మిథున బయట నుంచి రావడం చూసి ఏయ్ పిచ్చా నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లావ్ అని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ఏయ్ ఎందుకు కొట్టడానికి చేయి ఎత్తావ్ అని అడుగుతుంది. దాంతో దేవా నువ్వు కనిపించకపోయే సరికి మొత్తం పిచ్చోడిలా ఎంత వెతికానో తెలుసా అని అంటాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!