Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం తన వల్ల విహారికి జరిగిన నష్టం తలచుకొని బాధ పడుతుంది. ఇకపై విహారికి తన వల్ల ఏ నష్టం జరగకూడదు అని తల వంపులు రాకూడదు అని ఫిక్స్ అయి ప్రాజెక్ట్‌ కోసం మళ్లీ పని చేయాలని అనుకుంటుంది. విహారి ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరుతాడు. చారుకేశవ వసుధకి కాల్ చేసి ఇంకో అరగంట పడుతుంది. నువ్వు తినేసి పడుకో నేను తర్వాత వస్తా అంటాడు.

విహారి ఆ మాటలు విని షాక్ అవుతాడు. ఏంటి మామయ్య నువ్వు ఇలా మారిపోయావ్.. అత్తయ్యని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నావ్ అన్నీ చెప్తున్నావ్ నాకు చాలా షాకింగ్‌గా ఉంది అంటాడు. తను పూర్తిగా మారిపోయా అని దీని అంతటికి లక్ష్మీ కారణం అని అప్పటి నుంచి లక్ష్మీని తన కూతురిలా చూసుకుంటున్నా అని చెప్తాడు. లక్ష్మీకి  నీకు పెళ్లి అయింది అని కూడా నాకు తెలుసు అని అంటాడు. విహారి షాక్ అయిపోతాడు. ఓ ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. లక్ష్మీకి న్యాయం చేస్తే సహస్ర అన్యాయం అయిపోతుంది. సహస్రకు అన్యాయం చేయకుండా లక్ష్మీకి న్యాయం చేయమని చారుకేశవ చెప్తాడు. 

విహారి వెళ్తూ వెళ్తూ లక్ష్మీతోనే తనకు నిజమైన పెళ్లి జరిగింది అని సహస్రతో జరిగింది పెళ్లి అని తాను అనుకోవడం లేదని.. లక్ష్మీకి తన మనసులో మాట ఈ రోజు చెప్తా అని రాత్రి వెళ్తాడు. లక్ష్మీకి కాల్ చేస్తాడు. లక్ష్మీ ఎక్కడుందో చెప్పగానే విహారి అక్కడికి వెళ్తాడు. సహస్ర కూడా విహారిని ఫాలో అవుతుంది. విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఇంకా అదే ఆలోచిస్తున్నావా నేను నీ మీద ఉంచిన నమ్మకం కూడా నువ్వు నా మీద ఉంచడం లేదా.. ఒక చిన్న విషయానికి ఇంతలా ఫీలవుతాయా.. మళ్లీ స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్ ఇవ్వు అని అంటాడు. లక్ష్మీ కోసం పానీ పూరీ తీసుకొస్తానని వెళ్తాడు. లక్ష్మీకి తన ప్రేమ చెప్పాలని అనుకుంటాడు. 

విహారి పానీపూరీ తీసుకెళ్లి లక్ష్మీకి ఇస్తాడు. ఇద్దరూ కలిసి తింటుంటారు. లక్ష్మీ ప్లేట్ కింద పడిపోవడంతో విహారి తన ప్లేట్‌ నుంచి పానీ పూరీ తీసి తినిపించే టైంకి సహస్ర వచ్చి విహారి చేయి లాక్కొని తాను తినేస్తుంది. లక్ష్మీ, విహారి డిసప్పాయింట్ అయిపోతారు. సహస్ర విహారితో బావ పానీ పూరీ సూపర్‌గా ఉంది నీ చేతితో తినిపిస్తుంటే ఇంకా బాగుంది అంటుంది. మీ ఇద్దరూ వచ్చినప్పుడు నన్ను పిలవాల్సింది అంటుంది. విహారి ఆ ప్లేట్ సహస్ర చేతిలో పెట్టి నువ్వు తిను అంటాడు. సహస్ర విహారితో నువ్వు తినకపోతే నేను ఎలా తింటాను నువ్వు తిను అని విహారికి తినిపిస్తుంది. లక్ష్మీని కూడా తినమంటుంది. లక్ష్మీ వద్దని అంటుంది. ఇక విహారి వెళ్దాం అని అంటే సహస్ర విహారితో నేను లక్ష్మీని తీసుకెళ్తా నువ్వు వెనకాలే వచ్చేయ్ అని లక్ష్మీ చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. 

యమున ఉదయం భర్త ఫొటో చూసి దండ వేసి ఉండటం చూసి ఎవరు డెకరేషన్ చేశారని సంతోషపడుతుంది. వసుధకి అడుగుతుంది. ఈ రోజు అన్నయ్య పుట్టిన రోజు కదా వదిన అంటుంది. పండుని పిలిచి యమున అడిగితే లక్ష్మీ డెకరేషన్ చేసిందని అంటాడు. లక్ష్మీ రావడంతో యమున నీకు ఎలా నా భర్త పుట్టిన రోజు తెలుసు అని అడుగుతుంది. దాంతో లక్ష్మీఫొటోలో ఉందని అంటుంది. యమున లక్ష్మీకి కృతజ్ఞతలు చెప్తుంది. లక్ష్మీ బయట ఉంటే వసుధ వెళ్లి యమున వదినకు విషయం తెలిస్తే ఎలా నిజం తెలిసిన రోజు వదిన ఎలా తీసుకుంటుందో తెలీదు అంటే లక్ష్మీ ఎప్పటికీ యమునమ్మకి నిజం తెలియనివ్వను అని అంటుంది. 

లక్ష్మీ విహారి దగ్గరకు వెళ్లి పాయసం ఇస్తుంది. ఏంటి స్పెషల్ అని విహారి అడిగితే మీ నాన్నగారి పుట్టిన రోజు అని చెప్తుంది. విహారి గతంలోకి వెళ్లిపోతాడు. నాన్న గుర్తొస్తున్నారని ఏడుస్తాడు. మా నాన్నని నాకు దూరం చేసిన వాళ్లని పట్టుకుంటా వాళ్లని శిక్షించేవరకు ఊరుకోను అని అంటాడు. ఇక విహారికి మేనేజర్ కాల్ చేసి లక్ష్మీ బ్యాంక్‌లకు లోన్ గురించి పంపిందని 100 కోట్లు ఓకే అయ్యాయని అంటాడు. విహారి చాలా సంతోషపడతాడు. 60 కోట్లు ప్రాజెక్ట్‌కి వాడి 40 కోట్లు బోనస్ ఇవ్వమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!