Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవాలు బేబీ బామ్మ ఊరు వెళ్తూ మిథున ఆకలి అని ఓ దాబా దగ్గర ఆగుతారు. మిథున తన స్టోరీని టిఫెన్స్ తీసుకొచ్చే వ్యక్తికి చెప్తుంది. అతను దేవా మిథునను పెళ్లి చేసుకున్నందుకు అతను దేవాకి చపాతిలో ఆయిల్ క్యాన్సిల్.. కూర్మాలో అది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అని అంటాడు. మిథున తన స్టోరీ మొత్తం చెప్తుంది. ఇంట్లో కొంత మంది మనసు మారింది. ఈయన మనసు మారలేదు.
మిథున అతనితో అన్నయ్య ఈయన మారుతారేమో అని ఎదురు చూస్తున్నా.. ఈయన మనసులో భార్య స్థానం కోసం పోరాటం చేస్తున్నా అని చెప్తుంది. చెల్లమ్మా నువ్వు ఓడిపోవు చెల్లమ్మా నువ్వు కచ్చితంగా గెలుస్తావ్ అమ్మా నీ కన్న వాళ్లకి గర్వంగా చెప్తావమ్మా.. కండలు కాదు మనసు పెట్టి ఆలోచించు దేవత లాంటి భార్య మనసు అర్థమవుతుంది అని అంటాడు. దేవా మిథునతో ఏంటి నువ్వు జరిగింది అంతా నీ వైపు నుంచి చెప్పుకొని నన్ను విలన్‌ని చేస్తావ్ అంటాడు. నువ్వు ఇలాంటి దానివి అని తెలిస్తే అసలు ఆ తాడే కట్టేవాడిని కాదు అంటాడు. బలవంతంగా కట్టినా భరించాలి మిస్టర్ మొగుడ్స్ అంటుంది.
సూర్యకాంతం ప్రమోదిని దగ్గరకు వెళ్లి దోసె చేసి ఇవ్వమని అంటుంది. ఆకలి ఆకలి అంటూ కిచెన్‌కి వెళ్లి అన్ని వెతికి పైన ఉన్న పిండి డబ్బా లాగేస్తుంది. దాంతో పిండి మీద పడిపోతుంది. కాంతాన్ని ఆ అవతారంలో చూసి శారద దెయ్యం అని అరుస్తుంది. ప్రమోదిని కూడా భయపడుతుంది. ఇద్దరితో నేనే అని కాంతం చెప్తుంది. శారద రెండో కోడలికి రెండు చీవాట్లు పెట్టి పంపేస్తుంది. ప్రమోదిని అత్తతో బామ్మకి కాల్ చేసి చేరుకున్నారో లేదో అడగమని అంటుంది. బేబీకి కాల్ చేస్తే ఇంకా రాలేదు అంటుంది. శారద చాలా టెన్షన్ పడతుంది.
మిథున, దేవా రాత్రి వేళలో వెళ్తుంటారు. మిథున దేవా మీద చేయి వేస్తే దేవా చిరాకు పడతాడు. పెళ్లాం మీద చేయి వేస్తే చిరాకు పడుతున్నాడు వీడేం మొగుడురా బాబు అనుకుంటుంది. ఈ టైంలో టైర్ పంక్చర్ అయితే ఏంటి పరిస్థితి అని అనగానే బండి ఆగిపోతుంది. మిథున దేవాతో ఏమైంది మొగుడ్స్ అయితే వచ్చేయ్ కాసేపు మాట్లాడుకుందాం అంటుంది. దేవా ఓ చూపు చూసి ఏం మాట్లాడడు. ఇలా అన్నావో లేదో అలా బండీ ఆగిపోయింది ఏం నోరే నీది అని అంటాడు. నా నోటికి పవర్ ఉన్నంది కాబట్టి మనం కలిసి పోవాలని అంటుంది. ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన కోరికలు కోరకు అని దేవా అంటాడు.
రాత్రి పూట ఏం చేస్తాం అనుకుంటారు. మిథున దేవాని చూసి అసలేం గుర్తుకు రాదు అని పాట పాడితే టార్చర్ మొదలు పెట్టిందిరా అని దేవా తలబాదుకుంటాడు. శ్రీరంగం గదిలోకి వెళ్లి కాంతం కోసం వెతుకుతుంటే కాంతం రక్తం తాగుతున్న దెయ్యంలా చేతిలో బీట్‌రూట్ జ్యూస్ తాగుతూ గది అంతా పొగ పెట్టేస్తుంది. రంగం భార్యని చూసి భయపడతాడు. ఇక కాంతం భర్తతో మిథున, దేవా వెళ్లడం వెనక ఏదో కుట్ర ఉందని అంటుంది. మిథున, దేవా రాత్రి ఓ చోట కూర్చొని అగ్గి వెలిగిస్తారు. పోలీస్ అధికారి దేవా వాళ్లని వెతుక్కుంటూ వచ్చి బండీ చూసి సంబర పడిపోతాడు. వాళ్ల కోసం చూస్తాడు. మిథున దేవాని చూసి నువ్వు నువ్వు అని పాటలు పాడితే దేవా తిడతాడు. ఇక మిథున దేవాతో నువ్వు మిథున నేను దేవా రోల్స్ రివర్స్ అంటుంది. ఇక పోలీస్ దేవాకి ఇదే చివరి రాత్రి అని గన్ తీస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!