Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, అంబిక, సహస్రలతో పాటు మిగతా అందరూ కాన్ఫిరెన్స్ గదిలో ఉంటారు. చారుకేశవ ఆఫీసర్స్‌ని తీసుకొస్తాడు. ఎండీ లక్ష్మీ కూడా వస్తుంది. లోన్ ప్రపోజల్‌కి సంబంధించిన అన్ని విషయాలు బడ్జెట్ ప్రజంటేషన్ చేయమని అడుగుతారు. లక్ష్మీ సరే అని బ్యాగ్ మొత్తం వెతుకుతుంది.
లక్ష్మీ బ్యాగ్‌లో పెట్టిన పెన్‌డ్రైవ్ రాత్రి సహస్ర కొట్టేసి సుభాష్‌కి ఇచ్చేయడంతో లక్ష్మీ విహారికి విషయం చెప్తుంది. వందల కోట్ల కోసం మూడు బ్యాంక్‌లు కలిసి ఇంత టైం ఇస్తే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని ఆ బ్యాంక్ ఆఫీసర్లు విహారి వాళ్లని కోప్పడతారు. మీ లాంటి వాళ్లకి లోన్స్ ఇస్తే రేపు సరిగా కట్టరు.. గ్లోబల్ కంపెనీ అని వచ్చాం చూస్తే మీది గల్లీ కంపెనీలా ఉందే మీ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెడతాం అని విహారిని అవమానించి వెళ్లిపోతారు. అన్నీ చూసుకోవాలి కదా లక్ష్మీ అని విహారి అంటాడు. ఇదే ఛాన్స్ అని అంబిక రెచ్చిపోతుంది. గాడిద ఎంత పని చేసిన గాడిద పనే చేయించాలి కానీ సింహాసనం ఎక్కించుకూడదు అని తిడుతుంది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరును గాలి తీసేసిందని అంటుంది.
సహస్ర కూడా లక్ష్మీతో మా బావ రాత్రి పగలు కష్టపడి కట్టిన సామాజ్రాన్ని ఒక్క దెబ్బతో కూల్చేశావ్ అని అంటుంది. లక్ష్మీ ఏడుస్తుంటే చారుకేశవ బాధ పడొద్దని అంటాడు. సహస్ర మనసులో ఇదంతా నా వల్లే జరిగిందని బావకి తెలిస్తే ఎం అంటాడో అని బాధ పడుతుంది. అంబిక చూసి నిన్ను ఇలాగే వాడుకొని విహారి బిజినెస్‌కి పనికి రాడు అని నిరూపించి నా సామ్రాజ్యం నేను దక్కించుకుంటా అనుకుంటుంది. సుభాష్ దగ్గరకు వెళ్లి తన సంతోషం పంచుకొని సహస్రని వాడుకొని మన డబ్బు రికవరీ చేసి విహారిని దెబ్బ మీద దెబ్బ కొట్టాలని అనుకుంటారు. నువ్వు స్కెచ్ వేయ్ నేను అమలు చేస్తానని సుభాష్ చెప్తాడు. ఇక అంబిక సుభాష్‌తో మూడు బ్యాంక్‌లు విహారి కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాయని బ్రేకింగ్ న్యూస్ వేయించమని చెప్తుంది.
విహారి గ్రూప్ ఆఫ్ కంపెనీలు దివాలా తీస్తున్నాయా.. వీ క్రాఫ్ ఫెయిల్యూరా.. మూడు బ్యాంక్‌లు బ్లాక్ లిస్ట్‌లో పెట్టాయని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. విహారి వాళ్లు ఆఫీస్‌లో న్యూస్ చూస్తారు. అనుభవం అర్హత ఉన్న వాళ్లకే పోస్ట్‌లో కూర్చొపెట్టాలని అంబిక అంటుంది. విహారి కంపెనీల షేర్ వ్యాల్యూలు 30 శాతం పడిపోతాయి. మేనేజర్ విహారికి విషయం చెప్తే విహారి షాక్ అయిపోతాడు. లక్ష్మీ అంత పెద్ద తప్పునకు బాధ్యత వహించి ఎండీ పోస్ట్‌కి రిజైన్ చేస్తుంది. నేను ఉంటే మీకు నష్టాలు తప్ప లాభాలు రావు.. ఇంత పెద్ద అవమానం నష్టం నా వల్ల జరిగిందని అంటుంది. దాంతో విహారి లక్ష్మీని నచ్చచెప్తాడు. 3 బ్యాంక్‌లు కాదంటే ప్రపంచంలో 3 బ్యాంక్‌లే ఉన్నాయా.. దీంతో ఓడిపోయినట్లేనా మళ్లీ ప్రయత్నించు ఈ సారి మొదటి నుంచి ప్రయత్నించు మళ్లీ ఇది జరిగితే నేనే నిన్ను తీసేస్తా అని చెప్పి లెటర్ చింపేస్తాడు.
విహారి ఇచ్చిన మోటివేషన్‌కి లక్ష్మీ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. అంబిక మాటలు తలచుకొని రాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్తుంది. ఓ బస్‌స్టాండ్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. నా వల్లి విహారి గారు తల దించుకోకూడదు అనుకున్నా కానీ బ్యాంక్ అధికారుల ముందు తల దించుకోవాల్సి వచ్చిందని ఏడుస్తుంది. నా వల్ల విహారి గారికి నేను అడ్డు కాకూడదు. నా వల్ల ఆయన కంపెనీ పెరగాలే కానీ తక్కువ కాకూడదు ఇంకా జాగ్రత్తగా ఉంటాను అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: కీర్తి, చైతన్యల్ని బతిమాలిన రాజు, రుక్మిణిలు.. రాజు, రూపల జీవితాల్లో ఏం జరగనుంది?ల