దూకుడు తగ్గించేది లేదంటున్నాడు డాక్టర్ బాబు. టీఆర్పీ రేటింగ్స్‌లో‌ ఈ వారం కూడా 'కార్తీకదీపం 2 నవ వసంతం' సీరియల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మూడు స్థానాల కోసం స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయ్యే సీరియల్స్ మధ్య భారీ పోటీ నెలకొంది. ఆ తర్వాతే జీ తెలుగు ఛానల్ సీరియల్స్ టీఆర్పీ మొదలైందంటే అతిశయోక్తి కాదు. 10 ప్లస్ టీఆర్పీ రేటింగ్ సాధించిన సీరియల్స్ 'స్టార్ మా'లో నాలుగు ఉన్నాయి. అవి ఏమిటి? ఈ వారం టాప్ 10 రేటింగ్స్ సాధించిన సీరియల్స్ ఏమిటి? స్టార్ మా, జీ తెలుగులో ఏయే సీరియల్స్ ఎంత రేటింగ్స్ సాధించాయి? అనేది చూడండి.

టాప్ 2 నుంచి 4 వరకు మ్యూజికల్ చైర్స్...'స్టార్ మా'లో ఆ మూడింటి మధ్య భారీ పోటీ!లాస్ట్ వీక్ (2025లో 23వ వారం)తో కంపేర్ చేస్తే ఈ వారం 'కార్తీక దీపం 2' టీఆర్పీ రేటింగ్ పెరిగింది. గత వారం 13.16 రాగా... ఈ వారం 13.87 సాధించింది. స్టార్ మా ఛానల్‌లో మాత్రమే కాకుండా తెలుగు సీరియల్స్ రేటింగ్ లిస్టులో నెంబర్ వన్ ప్లస్ కైవసం చేసుకుంది. 

'స్టార్ మా'లో మిగతా సీరియల్స్ విషయానికి వస్తే...‌ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ 12.68, 'ఇంటింటి రామాయణం' 12.35, 'గుండె నిండా గుడి గంటలు' 12.26 టీఆర్పీ సాధించాయి. ఈ మధ్య ఈ మూడు సీరియల్స్ మధ్య భారీ పోటీ నెలకొంటోంది. ఇక 5వ స్థానంలో 8.04 రేటింగ్ సాధించిన 'చిన్ని' సీరియల్ ఉంది. 

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఒకప్పటి ఫేవరెట్ సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ వారం ఆ సీరియల్ 7.52 టీఆర్పీ సాధించింది.‌ దాని కంటే 'నువ్వుంటే నా జతగా' కాస్త ముందు ఉంది. ఆ సీరియల్ రేటింగ్ 7.84. మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'పలుకే బంగారమాయెనా' (6.32 టీఆర్పీ), 'మామగారు' (5.96 టీఆర్పీ), 'నిన్ను కోరి' (5.84 టీఆర్పీ), 'వంటలక్క' (5.52 టీఆర్పీ), 'పాపే మా జీవన జ్యోతి (5.01 టీఆర్పీ), 'మగువా ఓ మగువా' (4.86 టీఆర్పీ) ఉన్నాయి. 'గీత ఎల్.ఎల్.బి' సీరియల్ 3.5 8 టీఆర్పీ సాధించింది. 

'జీ తెలుగు'లో టాప్ ప్లేస్ మళ్లీ మారింది...ఈసారి 'జగద్ధాత్రి' మొదటికి... మరి నెక్స్ట్?'జీ తెలుగు'లో టీఆర్పీ రేటింగ్స్ లిస్టు చూస్తే ప్రతి వారం మ్యూజికల్ చైర్ కింద ఉంటుంది. గతవారం 6.68 టీఆర్పీతో 'మేఘ సందేశం' మొదటి స్థానంలో నిలవగా... ఈ సారి ఆ సీరియల్ మూడో స్థానానికి పడింది.

Also Read: కన్నప్ప: టికెట్ రేట్స్, థియేటర్స్ కౌంట్ to సెన్సార్ కట్స్, బడ్జెట్ వరకు... మీకు ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసా? 'జీ తెలుగు'లో ఈ వారం 7.55 టీఆర్పీతో 'జగద్ధాత్రి' మొదటి స్థానంలో ఉండగా... 7.13 టీఆర్పీతో 'చామంతి' సెకండ్ ప్లేస్ సొంతం చేసుకుంది. 'మేఘ సందేశం' 6.66 టీఆర్పీతో మూడో స్థానంలో నిలిచింది. ఈ సీరియల్ టీఆర్పీ స్టడీగా ఉన్నప్పటికీ... మిగతా సీరియల్స్ పుంజుకోవడంతో కిందకు వచ్చింది. మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'లక్ష్మీ నివాసం' (5.74), 'అమ్మాయి గారు' (5.23), 'గుండమ్మ కథ' (4.40), 'ఉమ్మడి కుటుంబం' (4.23), 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' (4.09), 'దీర్ఘ సుమంగళీభవ' (4.04) టీఆర్పీ సాధించాయి.

ఈటీవీలో 3.92 టీఆర్పీతో 'మనసంతా నువ్వే' మరోసారి మొదటి స్థానంలో నిలవగా...  3.44 టీఆర్పీతో 'రంగుల రాట్నం', 3.17 టీఆర్పీతో 'బొమ్మరిల్లు', 2.86 టీఆర్పీతో 'ఝాన్సీ' తర్వాత మూడు స్థానాల్లో ఉన్నాయి. 'భైరవి' (1.47), 'సివంగి' (1.03), 'కొత్తగా రెక్కలొచ్చానా' (1.02)... జెమినీ టీవీలో ఈ వారం మూడు సీరియల్ ఒకటి కంటే ఎక్కువ టీఆర్పీ సాధించడం విశేషం. ఇదొక రికార్డు అని చెప్పాలి.

Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో