Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీని విహారి జైలులో కలిసి నిన్ను నేను బయటకు తీసుకొస్తా ఏం భయపడకు అని ధైర్యం చెప్తాడు. రాత్రి విహారికి ఆదికేశవ్, గౌరీలు కాల్ చేస్తారు. మమల్ని పంపేశారు మేం ఇక్కడ ఉండలేకపోతున్నాం వచ్చేస్తాం అంటారు. దాంతో విహారి నేనున్నా కదా మీరేం భయపడొద్దు ధైర్యంగా ఉండండి అని విహారి చెప్తాడు.
ఆదికేశవ్‌తో విహారి లక్ష్మీకి నేను తోడున్నాను మీరు ధైర్యంగా ఉండండి నన్ను నమ్మండి రేపు లక్ష్మీని తీసుకొస్తా అని అంటాడు. రాత్రి ఓ కానిస్టేబుల్ లక్ష్మీ దగ్గరకు వెళ్లి నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావ్ అమ్మా.. నువ్వు ఆ హత్య చేసుండవు అని నాకు అనిపిస్తుంది. అందుకే నీకు ఓ విషయం చెప్పాలి అని పిస్తుంది. మా ఎస్‌ఐని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఆమె నిన్ను ఈ లాక్‌అప్‌లోనే చంపేయాలి అనుకుంటుంది అని చెప్తారు. నన్ను చంపితే తానకి ఏం వస్తుంది అని లక్ష్మీ అంటుంది. కానిస్టేబుల్ లక్ష్మీతో నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ రాత్రి పారిపో రేపు పొద్దున్న కోర్టుకి వచ్చి లొంగిపో అమ్మా అని చెప్తుంది.
విహారి పోలీస్ స్టేషన బయటే ఉంటాడు. ఎస్ఐ వాలకం చూస్తే కనకానికి తిండి, నీరు ఏం ఇవ్వరు అని తీసుకురావడానికి వెళ్తాడు. కానిస్టేబుల్ మాటలు నమ్మిన లక్ష్మీ రేపు కోర్టుకి వచ్చి లొంగిపోతా అని ఇప్పుడు పారిపోతా అని అంటుంది. కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేసి లక్ష్మీని వేరే మార్గంలో బయటకు తీసుకెళ్తుంది. విహారి వచ్చి చూసే సరికి లక్ష్మీ ఉండకపోవడంతో కంగారు పడతాడు. కానిస్టేబుల్ లక్ష్మీతో ఎస్‌ఐ రాకముందు పారిపో అని చెప్తుంది. లక్ష్మీ ఆమెకు థ్యాంక్స్ చెప్పి పారిపోతుంది. అప్పుడే ఎస్‌ఐ వచ్చి తన గన్ తీసి లక్ష్మీని కాల్చడానికి ప్రయత్నిస్తుంది. బులెట్ పేల్చే టైంకి లక్ష్మీ రాయిని తన్ని కింద పడిపోతుంది. ఆ సౌండ్ విన్ని విహారి లక్ష్మీ అని అరుస్తూ బయటకు వెళ్తాడు.
కానిస్టేబుల్స్ లక్ష్మీని పట్టుకుంటారు. ఎస్‌ఐ లక్ష్మీని కొడుతుంది. విహారి వచ్చి ఫైరింగ్ సౌండ్ వచ్చింది అంటే మీరు ఏదో కుట్ర చేస్తున్నారు అని అంటాడు. మీరు తనని ఎన్కౌంటర్ చేయాలి అనుకున్నారా అందుకే సెల్‌లో ఉండాల్సిన తను ఇక్కడ ఎందుకు ఉంది అని అడుగుతాడు. ఆ అమ్మాయినే అడుగు అని ఎస్ఐ అంటే విహారి లక్ష్మీతో ఎందుకు పారిపోవాలి అనుకున్నావ్ అని అడుగుతాడు. భయం వేసి ఎవరూ లేని టైం చూసి తప్పించుకొని వెళ్లిపోయి రేపు కోర్టులో లొంగిపోదాం అని అనుకున్నా అని చెప్తుంది. ఒకమ్మాయి తప్పించుకొని పారిపోతుంటే మీరేం చేస్తున్నారు అని విహారి అంటాడు. దాంతో ఎస్‌ఐ మా డ్యూటీని ప్రశ్నించకు అని లక్ష్మీని తీసుకెళ్లి సెల్‌లో వేస్తాడు.
విహారిని ఎస్ఐ వెళ్లమంటే నేను వెళ్లను మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారు రేపు మీరు కోర్టుకి తనని తీసుకెళ్లే వరకు ఇక్కడే ఉంటానని అక్కడే కూర్చొంటాడు. ఎస్‌ఐ వెళ్లమని అంటే నన్ను ఫోర్స్ చేస్తే మీడియాని మీ పై అధికారులను పిలుస్తాను అంటాడు. దాంతో ఎస్ ఐ తన క్యాబిన్‌కి వెళ్లిపోతుంది. అప్పుడే అంబిక కాల్ చేస్తుంది. దాన్ని లేపేసే టైంకి విహారి వచ్చాడు.. దాని మొగుడిలా ఒక్క దెబ్బ పడకుండా కాచుకు కూచున్నాడు. సెల్ ముందే ఉన్నాడు అని అంటుంది. రేపటి వరకు టైం ఉంది కదా అవకాశం ఉంటే దాన్ని లేపేయండి అని అంబిక చెప్తుంది. అక్కడే ఉన్న విహారిని చూస్తూ లక్ష్మీ ఏడుస్తుంది. విహారి కూడా కన్నీరు పెట్టుకుంటాడు.
సహస్ర రాత్రంతా బయట తిరుగుతూ విహారి కోసం ఎదురు చూస్తుంటుంది. అంబిక సహస్ర దగ్గరకు వచ్చి విహారి ఆ లక్ష్మీ దగ్గర ఉన్నాడు. ముందు వాళ్లని కంట్రోల్‌లో ఉంచు లేదంటే నీ లైఫ్ నాశనమే అంటుంది. ఉదయం యమున, వసుధ, చారుకేశవలు కోర్టు దగ్గరకు బయల్దేరుతారు. పండు కూడా వస్తాను అంటాడు. అందరూ బయల్దేరుతుంటే ఎక్కడికి అని పద్మాక్షి అడుగుతుంది. మేం వెళ్తాం మమల్ని ఆపొద్దు అని చారుకేశవ చెప్పి వెళ్లిపోతారు. ఇక అంబిక వెళ్తుంటే పద్మాక్షి నువ్వు ఎందుకే అని అంటుంది. లక్ష్మీకి శిక్ష పడటం చూడాలి అని అంబిక అంటే నేను వస్తాను అని పద్మాక్షి వెళ్తుంది.
విహారి రాత్రంతా జైలులోనే ఉంటాడు. ఉదయం కనకం తల్లిదండ్రులు వస్తారు. మీరు ఏడ్వొద్దు నాన్న అని లక్ష్మీ అంటే నిన్ను ఇలా చూసి నేను ఉంటే ఏంటి పోతే ఏంటి అని ఏడుస్తాడు. అల్లుడు గారు నా కూతుర్ని మీరే కాపాడండి అని ఏడుస్తాడు. సహస్ర పోలీస్ స్టేషన్‌కి వచ్చి చాటుగా వింటుంది. ఎస్ఐ వచ్చి మీరు ఏడ్వండి మీ కూతురు చేసిన పనికి యావజ్జీవ శిక్ష పడుతుంది అని అంటుంది. లక్ష్మీని కోర్టుకి తీసుకెళ్లడానికి బయటకు తీసుకొస్తారు. లక్ష్మీని పట్టుకొని తల్లిదండ్రులు ఏడుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి జైలులో చిత్రహింసలు.. సూపర్ ఉమెన్‌తో అంబిక 60 లక్షల డీల్!