Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ గదిలో అఖిల్‌ని చూసి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీనే పొడిచేసిందని అనుకుంటారు. లక్ష్మీ లేచి చూసి రాత్రి జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది. అఖిల్‌ని చూసిన చారుకేశవ చనిపోయాడు అని అంటాడు. ఇంతకు ముందు లక్ష్మీ వీడిని ఇంటికి పిలిపించింది వీడే కదా అని అంటుంది. పద్మాక్షి కోపంతో చంపేశావా అని అంటుంది.
లక్ష్మీ అందరితో నేను ఏం చేయలేదు రాత్రి వాడు నా గదిలోకి రావడంతో బాటిల్‌తో వాడి తల మీద కొట్టాను. వాడు ఎలా చనిపోయాడో నాకు తెలీదు అంటుంది. అంబిక పోలీసులకు కాల్ చేస్తాను అంటుంది. విహారి పోలీసులకు వద్దు పరువు పోతుంది అంటే అంబిక పద్మాక్షితో శవం ఇంట్లో ఉండి చెప్పకపోతే పోలీసులు తనతో పాటు మనల్ని అరెస్ట్ చేస్తారు అంటుంది. వసుధ, యమున లక్ష్మీ అలాంటిది కాదు అంటే దానికి పద్మాక్షి వాడే గదిలోకి దూరి పొడుచుకొని చనిపోయాడా అని అంబికకు పోలీసులకు ఫోన్ చేయమని చెప్తుంది. అంబిక పోలీసులకు ఫోన్ చేస్తుంది.
విహారి ఏం చేయలేక లక్ష్మీ ఏం జరిగింది ఇక్కడ అసలు అని అడుగుతాడు. లక్ష్మీ మొత్తం జరిగింది చెప్తుంది. నేను చంపలేదు నాకు ఏం తెలీదు అని లక్ష్మీ అంటుంది. పోలీసులు ఎంట్రీ ఇస్తారు. పోలీసు ఎస్‌ఐ అధికారిణి (అమ్మాయిగారు సీరియల్ విజయాంబిక)ని అంబిక లోపలికి తీసుకెళ్తుంది. లక్ష్మీ పోలీసులతో నాకేం తెలీదు నేనేం చేయలేదు అని అంటుంది. అందరూ ఎస్‌ఐతో లక్ష్మీ అలాంటిది కాదు అని చెప్తారు. ఎస్ ఐ లక్ష్మీని అరెస్ట్ చేస్తారు. లక్ష్మీ నీకు ఈ గతి పట్టింది ఏంటమ్మా అని ఏడుస్తుంది. విహారి ఎస్‌ఐతో నేను తనని పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తా అంటే ఎస్‌ఐ కోపంగా మా డ్యూటీ కూడా నువ్వే చేయ్ అంటుంది. ఇక బాడీని పోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించమని గదిని సీజ్ చేయమని చెప్పి లక్ష్మీని తీసుకెళ్తుంది.
లక్ష్మీ ఏడుస్తుంటే యమున, వసుధ, చారుకేశవలు లక్ష్మీకి ధైర్యం చెప్తారు. లక్ష్మీ కోసం విహారి వెళ్లబోతే సహస్ర, పద్మాక్షి వాళ్లు ఆపితే యమున వాళ్లతో లక్ష్మీ ఏ తప్పు చేయదు తనని కాపాడు అని విహారిని పంపిస్తుంది. ఇక ఆదికేశవ్, గౌరీలు తీర్థయాత్రలు పూర్తి చేసుకొని సిటీకి వస్తారు. సహస్ర ఇంటికి వెళ్తుంటారు. కనకం సిటీలో ఉన్నన్ని రోజులు ఉండాలి అనుకుంటారు. అప్పుడే పోలీసులు లక్ష్మీని తీసుకెళ్లడం చూసి పోలీసుల కారు వెనక కనకం కనకం అని పరుగులు తీస్తారు. లక్ష్మీ చూసి నాన్న అని ఏడుస్తుంది. ఎస్ ఐ చూసి కారు ఆపిస్తుంది. లక్ష్మీని చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. మీ అమ్మాయిని అరెస్ట్ చేశామని ఎస్‌ఐ చెప్తారు.
విహారి కూడా వెనకాలే అక్కడికి వస్తాడు. ఆదికేశవ్, గౌరీలు తన బిడ్డ అమాయకురాలు అని ఏ పాపం చేయదు అంటారు. దాంతో ఎస్‌ఐ అమాయకురాలు అయి ఓ మనిషిని దారుణంగా పొడిచి చంపేసిందా అని అంటుంది. నా కూతురికి అంత ధైర్యం లేదమ్మా తనని వదిలేయండి అని ఏడుస్తారు. నేనే తప్పు చేయలేదు నాన్న అని కనకం అంటుంది. పోలీసులు కనకాన్ని తీసుకెళ్తుంటే ఆదికేశవ్ వాళ్లు కారు వెనక పరుగులు తీస్తారు. విహారి వాళ్లని ఆపుతాడు. నా కూతుర్ని కాపాడండి అల్లుడు గారు అని ఆదికేశవ్ వేడుకుంటాడు. వాళ్లని తీసుకొని విహారి బయల్దేరుతాడు. ఇంట్లో వసుధ, యమున ఏడుస్తుంటే పద్మాక్షి వచ్చి వసుధ వదిన ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అంటుంది.
వసుధ వాళ్లతో లక్ష్మీ అలాంటిది కాదు ఎవరో కావాలనే ఇరికించారు అని అంటుంది. అంబిక వాళ్లతో పెళ్లి అయిన దానికి ఇవేం బుద్ధులు ఓ వ్యక్తిని ఇంటికి పిలిపించి చంపేస్తుందా అని అంటుంది. మనం లక్ష్మీ గురించి ఎంత డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు వాళ్లే అంతా చెప్తారు అంటుంది. పద్మాక్షి వాళ్లతో లక్ష్మీనే వచ్చి హత్య చేశాను అన్న వీళ్లు నమ్మరే అని అంటుంది. చారుకేశవ విహారికి కాల్ చేసి పరిస్థితి కనుక్కోమని అంటాడు. యమున కాల్ చేసిన తర్వాత విహారి ఏం బాధ పడొద్దు లక్ష్మీని విడిపిస్తా అంటాడు. చారుకేశవ మాట్లాడి నీ ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ వాడమని అంటే అలా కుదరదు అని ఏ కేసు పెడతారో చూసుకొని తర్వాత నేనే ఏం చేయాలో చూస్తా అంటాడు.
లక్ష్మీని పోలీసులు పోలీస్ స్టేషన్‌లోపలికి తీసుకెళ్తుంటే ఆదికేశవ్, గౌరీలు ఎస్‌ఐని బతిమాలుతారు. నేనే తప్పు చేయలేదు మీకు అర్థం కావడం లేదా అని లక్ష్మీ ఎస్‌ఐ మీద అరిస్తే ఎస్‌ఐ లక్ష్మీని కొడుతుంది. విహారి కోపంతో తనని కొట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని అంటే మళ్లీ ఎస్‌ఐ లక్ష్మీని కొడుతుంది. దాంతో విహారి ఎస్‌ఐ మీదకు చేయిఎత్తు తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?