తెలుగు సీరియల్స్ చూసే వీక్షకులకు, మరి ముఖ్యంగా 'స్టార్ మా'లో బ్రహ్మముడి సీరియల్ (Brahmamudi Serial) చూసే జనాలకు అందులో కథానాయకుడు మానస్ నాగులపల్లి (Manas Nagulapalli) బాగా తెలుసు. రాజ్ క్యారెక్టర్‌లో ఆయన నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోలలో కూడా మానస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోతో పాటు కొన్ని షోలు, సినిమాలు కూడా చేశారు మానస్. ఇప్పుడు ఈ బుల్లితెర స్టార్ ఈటీవీలో అడుగు పెట్టారు.
రష్మీతో పాటు మానస్ నాగులపల్లి కూడా...షో ఫార్మాట్ మారింది... యాంకర్ వచ్చాడు!ETV Jabardasth Anchor Name List: ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'ఈటీవీ'లో ప్రసారం అయ్యే 'జబర్దస్త్' షో యాంకర్ ఎవరు అని అడిగితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తడుముకోకుండా చెప్పే పేరు రష్మీ గౌతమ్. రష్మి కంటే ముందు అనసూయ కూడా జబర్దస్త్ యాంకర్ కింద పాపులర్ అయ్యారు. అయితే ఆవిడ షో వదిలేసి చాలా రోజులు అవుతోంది. ఇప్పుడు వేరే షో 'కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్'లో న్యాయ నిర్ణేతగా చేస్తున్నారు.
అనసూయ ఉన్నప్పుడు 'జబర్దస్త్'కు ఆవిడ, 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేసేవారు. అయితే అనసూయ వెళ్లిన తర్వాత గురువారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ కోసం ఇద్దరు ముగ్గురు యాంకర్లు వచ్చారు. అయితే ఎవరు ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు. గురు, శుక్ర వారాలలో ప్రసారం అయ్యే 'జబర్దస్త్' షో కాస్త శుక్ర, శని వారాలకు మార్చిన తర్వాత నుంచి రెండు రోజులూ రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్నారు. ఇక నుంచి ఆవిడతో పాటు మరొక యాంకర్ కూడా ఉంటారని స్పష్టమైంది.
'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో చూస్తే అందులో మానస్ నాగులపల్లి కూడా ఉన్నారు. అతడిని యాంకర్ కింద పరిచయం చేశారు. ఇద్దరు యాంకర్స్ అని క్లారిటీ ఇచ్చారు రష్మీ గౌతమ్ కూర్చునే పక్కన మరొక సోఫా వేసి మనసు నాగులపల్లి ని కూర్చోబెట్టారు. మరి ఇద్దరు యాంకర్స్ ఎలా చేస్తారు అనేది త్వరలో ప్రసారం అయ్యే ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.
Also Read: పవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?
'జబర్దస్త్' షో ఫార్మాట్ మార్చినట్టు ఈటీవీ యాజమాన్యంతో పాటు మల్లెమాల సంస్థ కూడా పేర్కొంది. లేటెస్ట్ ప్రోమో చూస్తే రాకింగ్ రాకేష్, అతని భార్య జోర్దార్ సుజాత రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే, చలాకి చంటి కూడా కనిపించారు. జడ్జ్ సిటీలో శివాజీ బదులు కృష్ణ భగవాన్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. టీఆర్పీ రేటింగ్స్ పెంచడం కోసం ఈటీవీ చేస్తున్న కృషి ఫలిస్తుందో లేదో తెలియాలంటే నాలుగైదు వారాలు అయినా సరే వెయిట్ చేసి చూడాలి. షోలో మానస్ ఎటువంటి మార్పులు తీసుకు వస్తాడో? వెయిట్ అండ్ సీ.