Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పండుని తీసుకొని రాత్రి వేళలో బయటకు వెళ్తుంది. అంబికమ్మను కలవడానికి నిన్న ఒకతను వచ్చాడు అతని మీద నాకు అనుమానం ఉందని లక్ష్మీ పండుతో చెప్తుంది. దగ్గర్లో ఉన్న సీసీ కెమెరా ఉన్న షాప్ అతనికి సీసీ టీవీ ఫుటేజ్ అడిగితే అతని గురించి తెలుస్తుందని లక్ష్మీ అంటుంది. పండు వెళ్లి షాప్ అతనికి చెప్పడంతో అతను ఫుటేజ్‌ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.

Continues below advertisement

లక్ష్మీ, పండు ఇద్దరూ ఫుటేజ్ చూస్తారు. సిద్దార్థ్ బైక్ మీద రావడం బైక్ నెంబరు చూసి లక్ష్మీ బైక్ నెంబరు దొరికింది అడ్రస్ ఎలా తెలుసుకోవడం అని అంటే పండు తనకు ఆర్టీఓ ఏజెంట్ తెలుసు అని అతనికి నెంబరు పంపిస్తే వెంటనే అడ్రస్ చెప్తాడని చెప్పి అతనికి కాల్ చేస్తాడు. బండి నెంబరు చెప్పడంతో అతను అడ్రస్ పంపిస్తాడు. లక్ష్మీ, పండు ఇద్దరూ ఆ ఇంటి అడ్రస్‌కి వెళ్తారు. సిద్దార్థ్‌ ఫుల్లుగా తాగుతూ ఆ గాజులు, చైన్ అమ్ముకొని డబ్బు తెచ్చుకోవాలని అనుకుంటాడు. హాల్‌లోనే సిద్దార్థ్ తాగుతుంటే లక్ష్మీ, పండు ఇద్దరూ వెళ్తారు. లక్ష్మీకి పండు సౌండ్ చేయొద్దని అంటాడు కానీ లక్ష్మీ ప్లవర్ వాజ్ తోసేస్తుంది. ఇద్దరూ దాక్కుంటారు. 

సిద్దార్థ్ మత్తులోనే మొత్తం వెతుకుతాడు. పండు ఇంట్లో మెయిన్ ఆపేస్తాడు. తర్వాత లక్ష్మీ, పండు ఇద్దరూ సిద్దార్ధ్ పక్కనే ఉన్న నగలు చూస్తారు.  పండు మెల్లగా నగలు తీసుకుంటుండగా సిద్దార్థ్ చూసేస్తాడు. లక్ష్మీ సిద్దార్థ్‌ని ఫ్లవర్‌ వాజ్‌తో కొడుతుంది. సిద్దార్ధ్ ఇద్దరినీ పట్టుకొని కొడతాడు. తర్వాత లక్ష్మీ, పండు ఇద్దరూ దెబ్బలు తింటూనే     పోరాడుతారు. సిద్దార్థ్ పండు గొంతు నులిపేస్తుంటే లక్ష్మీ సిద్దార్థ్ తల మీద కొట్టి ఇద్దరూ యమున నగలు తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లి సాధించాం పండు యమునమ్మ నగలు తీసుకొచ్చాం అనుకొని పండుకి నగల బాక్స్ తీసుకురమ్మని అందులో పెట్టి యమున గదిలో లక్ష్మీ సైలెంట్‌గా పెట్టేస్తుంది. 

Continues below advertisement

అంబిక అది చూసి నేను చేసిన ప్రతీ పనికి అడ్డు వస్తున్నావే నిన్ను వదలను అనుకుంటుంది. వదిన నగలు తెచ్చింది అంటే మామూలుది కాదు. ఇది సామాన్యురాలు కాదు దీన్నివెంటనే ఇక్కడ నుంచి పంపేయాలి అని తన అఖిల్  అనే ఓ వ్యక్తికి ఇంటికి పిలిచి ఓ ప్లాన్ చెప్తుంది. లక్ష్మీ పని అయిపోయిందని అఖిల్ అంటాడు. మరోవైపు పండు బయట వెయిట్ చేస్తుంటే విహారి వచ్చి పండుని ఇక్కడ ఎందుకు ఉన్నావ్ అని అడుగుతాడు. నేను లక్ష్మీమ్మ  యమునమ్మ నగల కోసం వెళ్లామని చెప్పబోతే లక్ష్మీ ఆపుతుంది. లక్ష్మీ చేతికి గాయం అవడం విహారి చూసి ఏమైందని అడుగుతాడు. లక్ష్మీ అంబిక గురించి చెప్పకుండా దొంగని పట్టుకోవడానికి షాప్ సీసీ కెమెరాలో చూసి వాడి అడ్రస్‌కి వెళ్లాం అని మొత్తం చెప్తుంది. 

అమ్మకి ఇంత ముఖ్యమైన నగలు తీసుకొచ్చావ్ థ్యాంక్స్ లక్ష్మీ, థ్యాంక్స్ పండు అని చెప్తాడు. నీ చేతికి చిన్న గాయం అయింది కాబట్టి సరిపోయింది ఇంకేమైనా అయింటే ఏంటి పరిస్థితి అని విహారి అనగానే పండు నేను ఉండగా నా చెల్లికి ఏం అవ్వనిస్తానా బాబు అంటాడు. పండు వెళ్లిపోగానే విహారి లక్ష్మీని హగ్ చేసుకుంటాడు. చాలా థ్యాంక్స్ కనకం అని అంటాడు. ఇంకోసారి చెప్పకుండా వెళ్లొద్దు అని చెప్తాడు. లక్ష్మీ గదికి వెళ్లి తలుపు వేస్తుంది. అక్కడ అఖిల్ ఉంటాడు. అఖిల్ లక్ష్మీ అరవకుండా నోరు నొక్కేస్తాడు. అక్కడే ఉన్న గ్లాస్ బాటిల్‌తో లక్ష్మీ అఖిల్ తల మీద కొట్టేస్తుంది. అఖిల్‌ లక్ష్మీని నెట్టేయడంతో లక్ష్మీ మంచం కోడుకి తల తగిలి కళ్లు తిరిగి పడిపోతుంది. ఇద్దరూ చెరో వైపు పడిపోయిన తర్వాత మరో రౌడీ వచ్చి అఖిల్‌ని పొడిచి చంపేస్తాడు. లక్ష్మీ చేతిలో గాజు బాటిల్ పెంకులు పెట్టేస్తాడు. నువ్వే వాడిని చంపిన ముద్దాయిగా జైలుకి వెళ్తావని అనుకుంటాడు. ఉదయం పని మనిషి అదంతా చూసి పెద్దగా అరుస్తుంది. అందరూఅక్కడికి చేరుకుంటారు. లక్ష్మీకి మెలకువ వస్తుంది. అఖిల్ రక్తపు మడుగులో ఉండటం చూసి షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?