గుండెనిండా గుడిగంటలు జూన్ 17 ఎపిసోడ్
బాలుకోసం కారుకొన్న మీనా సర్ ప్రైజ్ చేసేందుకు గుడి దగ్గరకు తీసుకెళుతుంది. రాజేష్ ని కారు తీసుకురమ్మని చెబుతుంది. ఈ కారేంటి ఇక్కడ ఉంది? రాజేష్ నువ్వుతెచ్చావేంటి?నీ ఫ్రెండ్ కోసం అన్నావ్ అని వరుస ప్రశ్నలు వేస్తుంటాడు. ఏమీ మాట్లాడకుండా మీనా , సుమతి కారుకి పూజ చేయిస్తుంటారు. పంతులు కూడా పెద్ద ఆర్డర్ వచ్చింది కదా మంచి జరిగిందని చెబుతాడు కానీ బాలుకి ఏమీ అర్థంకాదు. ఎవరో కారుకి నువ్వెందుకు పూజ చేస్తున్నావని అడుగుతాడు. పూజ పూర్తైన తర్వాత కారు తాళం బాలు చేతిలో పెడుతుంది మీనా. పూలదండలు కట్టగా వచ్చిన డబ్బుని డౌన్ పేమెంట్ కట్టి కారు కొన్నాను అని చెబుతుంది మీనా. ఎప్పుడూ కారులో తిరిగే మీరు ఆటోలో తిరగడం నచ్చలేదని అందుకే సర్ ప్రైజ్ ఇచ్చానంటుంది.
తనకోసం మీనా ఇంతలా ఆలోచిస్తుందా అని షాక్ అవుతాడు బాలు. మొదటి రైడ్ కి తనే బోణీ చేస్తానంటుంది మీనా. సరే అని సంతోషంగా కారు డ్రైవ్ చేస్తాడు బాలు. బాలు-మీనా కారులో ఇంటికి బయలుదేరుతారు. కారు ఎంతో నచ్చిందంటూ బాలు ఎమోషనల్ గా మాట్లాడుతాడు. నాకు పూలకొట్టు పెట్టించాలనే ఆలోచన మీకెందుకు వచ్చిందని మీనా అంటుంది. భర్త భార్య ఒకరి సంతోషమే మరొకరి సంతోషం అని మాట్లాడుకుంటారు. నిన్ను తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదు అందుకే పూలకొట్టు పెట్టించానని బాలు అంటే.. మీరు తక్కువగా ఉంటే నచ్చదు అందుకే కారు కొనిచ్చా అంటుంది మీనా. పూలు కొని మీనాకు పెడతాడు. ఆ తర్వాత కారు స్టాండ్ దగ్గరకు వెళ్లి అందరకీ కారు చూపిస్తే మాకు ముందే తెలుసు అని చెప్పడంతో మరింత సర్ ప్రైజ్ అవుతాడు.
టాక్సీ స్టాండ్ నుంచి ఇంటికి చేరుకుంటారు బాలు-మీనా. మనోజ్ ఇంట్లో ఖాళీగా తిరగడంతో సత్యం మందలిస్తాడు బాలుని చూసి నేర్చుకో అంటాడు. ఏం నేర్చుకోవాలి వాడిని చూసి అని నోరు పారేసుకుంటుంది ప్రభావతి. ఉన్న కారు అమ్మేసి ఆటో కొనుక్కున్నాడు ఫ్యూచర్లో ఆ ఆటో అమ్మేసి సైకిల్ కొనుక్కుంటాడు అంటుంది. ఇంతలో రోహిణి వచ్చి మలేషియా నుంచి మా మావయ్య, అత్తయ్య చీర పంపించరంటూ ప్రభావతికి ఇస్తుంది. ఆ చీర చూసి జరిగినదంతా మర్చిపోతుంది.
అప్పుడే బాలు మీనా సంతోషంగా ఇంట్లోకి వస్తారు. అందర్నీ బయటకు తీసుకెళ్లి కారుచూపిస్తారు. నువ్వు కొన్నావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ప్రభావతి. కొత్తదానిలానే ఉందే అంటుంది. అవును నా భార్య నాకు 10 లక్షలు పెట్టి కారు కొనిచ్చిందని చెబుతాడు బాలు. అందరూ మీనాను అభినందిస్తారు..ప్రభావతి తప్ప. పూలదండలు కట్టి, అప్పు చేసిన డబ్బులన్నీ ఈ కారుకోసమే వాడాను అని చెబుతుంది మీనా ఇకపై మీనాను డబ్బు విషయంలో ఒక్కమాట కూడా అనొద్దంటుంది శ్రుతి.
గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్ లో బాలు మౌనికకు కాల్ చేసి మీనా గురించి గొప్పగా చెబుతాడు. ఆ మాటలు విని మీనా ఎమోషనల్ అవుతుంది. నన్ను మీరు ఇంతబాగా అర్థం చేసుకున్నారని నాకు ఇప్పుడే తెలిసింది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.