Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున తులసి కోటకి పూజ చేస్తుంది. దేవాతో తనకు జరిగిన పెళ్లి గుర్తు చేసుకొని నల్లపూసలు పట్టుకొని దండం పెట్టుకొని ఇవి కేవలం నల్లపూసలు కాదు నా జీవితం. ఈ తాళి నా మెడకు చేరుతుందా లేదా ఈ అదృష్టం నాకు రాసి పెట్టి ఉందా లేదా అని చాలా భయపడిపోయాను అమ్మా.. ఆయనతో మీరు నాకు ముడి పెట్టిన ఈ బంధం ఎప్పటికీ పదిలంగా ఉండేలా చూడమని కోరుకుంటుంది.
పూజ తర్వాతా దేవా దగ్గరకు వెళ్లి మొగుడ్స్ మొగుడ్స్ అని నిద్ర లేపుతుంది. పొద్దు పొద్దున్నే నీ ముఖం చూశా ఈ రోజు నా జీవితంలో ఏం జరుగుతుందో అని అంటాడు. దానికి మిథున అద్భుతాలు జరుగుతాయి ఈ రోజు నీకు ఎంత బాగా కలిసి వస్తుందో నువ్వే చూస్తావు కదా అని మిథున అంటుంది. దేవుడా ఏంట్రా నాకు ఈ టార్చర్ అంటే నేను ఇప్పుడు అఫిషియల్‌గా మీ భార్యని నాకు సర్వ హక్కులు వచ్చేశాయి మొగుడ్స్ అంటుంది. ఇంకోసారి మొగుడ్స్ అంటే మూతి పగులుతుంది అంటాడు. దేవా వెళ్లిపోతుంటే మొగుడ్స్ మొగుడ్స్ అని వెంట పడుతుంది. భార్యగా నా బాధ్యతగా మీరు లేవగానే బ్రష్ స్నానానికి టవల్, తర్వాత వేసుకోవడానికి డ్రస్ ఐరన్ చేసి పెట్టానని చెప్తుంది.
ఫైవ్ స్టార్ హోటల్‌లో చేసినట్లు ఎలా సర్వీస్ చేస్తున్నానో చూశారా అని దేవాని వాయించేస్తుంది. దాంతో దేవా మిథునకు డబ్బు తీసుకొచ్చి ఇస్తూ ఫైవ్ స్టార్ హోటల్‌లో సర్వీస్ చేస్తే టిప్ ఇస్తారు కదా తీసుకో అంటాడు. మిథున హర్ట్ అయిపోతుంది. మిథున కోపంతో దేవా చేతిలో పెట్టబోతే తీసుకోదు. తర్వాత నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు చెప్పు నీకు లక్ష వేస్తా అంటుంది. నాకు ఎందుకు అని దేవా అంటే నా మెడలో తాళి కట్టావ్ కదా కూలీగా లక్ష ఇస్తా అంటాడు. నేనే కూలీ కోసం తాళి కట్టా అంటావా ముఖం పచ్చడి అయిపోతుందని అంటాడు. మరి నేను నీకు కూలీ దానిలా చూస్తావా నీ ముఖం పచ్చడి అయిపోతుందని అంటుంది. టిప్ ఇస్తాడంట టిప్ పెద్ద బయల్దేరాడు మొనగాడు. చూడు నువ్వు నీ డబ్బు బలుపు నా దగ్గర చూపించావు అనుకో నువ్వు జీవితంలో చూడలేనంత డబ్బు తీసుకొచ్చి నీ ముందు పెట్టగలను.. ఇంకోసారి ఇలాంటి ఆటిట్యూడ్ నా దగ్గర చూపించకు అని అంటుంది. అంత రోషం ఉంటే మీ ఇంటికి వెళ్లిపోవచ్చు కదా అని దేవా అంటాడు.
మిథున దేవాతో నాకు టిప్ ఇచ్చావు కదా అలాగే మీ అమ్మకి కూడా టిప్ ఇవ్వు చెప్పులు తీస్తుందో చీపురు తీస్తుందో చూద్దువు అంటుంది. కోపంగా వెళ్తూ మళ్లీ వచ్చి రాత్రి తినలేదు కదా రా టిఫెన్ చేద్దువు అని అంటుంది. మరోవైపు రాహుల్ దేవా వార్నింగ్ గుర్తు చేసుకొని రగిలిపోతూ ఉంటాడు. రౌడీ అని రెచ్చిపోతున్నావ్ కదా నేను పెట్టబోయే బాంబ్ పేలబోతుంది రెడీగా ఉండు అనుకుంటాడు. ఇక రంగం వేప పుల్ల నములుతూ జీవితం బోర్ అయిపోతుంది అనుకుంటాడు. అప్పుడే అక్కడ ఓ అందమైన అమ్మాయి ఆటోలో దిగుతుంది. చీరలో మోడ్రన్‌గా ఉన్న ఆ అమ్మాయిని చూసి అక్కడున్న అబ్బాయిలతో పాటు రంగం కూడా చొంగ కార్చుకుంటాడు.
కాంతం నీటి బిందె పట్టుకొని నేను వెళ్లాల్సి వస్తుంది. నా మొగుడితో తీప్పిస్తా అనుకుంటూ తన భర్త ఆ అమ్మాయిని చూడటం చూసి షాక్ అయిపోతుంది. నా మొగుడికి ఇదేం మాయరోగం అని అనుకొని అంద బాగుందా అని అడుగుతుంది. దేవా కన్య ఆటోలో తిరుగుతుందని ఈ రోజే అర్థమైందని అంటాడు. పిచ్చి పిచ్చగా నచ్చిందని అంటాడు. ఆ అమ్మాయి అందం పొగుడుతూ తన భార్య రాక్షసి అని తిట్టేస్తాడు. మూతి తిప్పుకుంటూ ఎవరి కాపురమో కూల్చడానికి వచ్చింది అని అంటుంది. బిందెతో రంగాన్ని కొడుతుంది.
లలిత మిథున జీవితం గురించి మొక్కుకుంటూ పూజ చేస్తుంది. అలంకృత ఆలోచిస్తూ ఉంటే ఏమైంది అని అడుగుతుంది. అక్క జీవితం ఏంటా అని నాకు భయంగా ఉందని అక్క మెడలో బలవంతంగా బావ తాళి కట్టినప్పటి నుంచి అక్కని బాధ పెడుతున్నాడని అంటుంది. దానికి లలిత దేవా చాలా మంచోడు అని దేవా వెనక మిథున ఉంది మిథున వెనక కోట్ల ఆస్తి ఉండి కూడా తన బుద్ధి మారలేదు అంటే దేవా మంచోడు కాదని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి అంటుంది. తనకు భార్య ఆ బంధం వద్దు అనుకుంటున్నాడు కాబట్టి మిథునని అంగీకరించలేకపోతున్నాడని అంటుంది. మిథున దేవా కోసం టీ చేస్తుంది. దేవా టీ తీసుకురమ్మని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?