Ammayi garu Serial Today Episode విజయాంబిక, దీపక్‌లు జీవన్‌ని కలుస్తారు. రేపటి నుంచే పెళ్లి పనులు మొదలవుతాయి. ఈ లోపు ఆనంద్‌కి రాఘవని చూపించకపోతే వాడు పెళ్లి వద్దని వెళ్లిపోతాడని ఈ లోపు రాఘవని చూపించకపోతే మన ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయిపోతాయి ఎన్ని చేసినా వేస్ట్ అని తల్లీకొడుకులు అంటారు.
జీవన్ తల్లీకొడుకులతో వాడిని తీసుకెళ్లి రాఘవని అప్పగించకుండా కేవలం చూపించి మాట్లాడించి తీసుకొచ్చేయండి అంటాడు. రాఘవని అప్పగించకపోతే పెళ్లి చేసుకోనని అన్నాడు కదా అని విజయాంబిక అంటే మీ మట్టి బుర్రతో కాకుండా నా బుర్రతో ఆలోచించండి.. రూపని పెళ్లి చేసుకోకపోతే మీ నాన్నని మీకు అప్పగించమని బెదిరించండి ఆస్తి మొత్తం మీ పేరున రాస్తేనే రాఘవని అప్పగిస్తామని చెప్పండి అని జీవన్ చెప్తాడు. జీవన్ చెప్పినట్లే చేస్తామని ఒప్పుకుంటారు. రాఘవ ఎక్కడున్నాడో చెప్పమని అడిగితే జీవన్ చెప్తాడు. రాఘవని వాడి కొడుకుకి చూపించిన తర్వాత ప్లేస్ మార్పించి మీకు అవసరం అయితే మళ్లీ ఎక్కడ దాచానో చెప్తానని అంటాడు.
సూర్యప్రతాప్ పతనానికి శంకుస్థాపన జరిగిందని జీవన్ అనుకుంటాడు. సూర్యప్రతాప్ కీర్తి గురించి అడుగుతాడు. సుమ తినేసి పడుకుందని చెప్తుంది. కీర్తి కండీషన్ మామూలు అయినవరకు అలా వదిలేయండి మనతో తను కలిసే వరకు మనమే జాగ్రత్తగా చూసుకోవాలని అంటాడు. రాజుకి కాబోయే భార్య అంటే నాకు కూతురు లాంటి అమ్మలా చూసుకుంటా అని సుమ అంటుంది. రాత్రి దీపక్ వాళ్లు రావడం సూర్యప్రతాప్ చూస్తాడు. చంద్ర దీపక్‌తో ఎక్కడికి వెళ్లారు అంటే గుడికి అని దీపక్ చెప్తాడు. ఈ టైంలో ఏం గుడి అంటే ముందే వెళ్లాం వచ్చే సరికి లేటు అయింది అంటాడు.
రాజు ఆనంద్‌ని వెళ్లమని సైగ చేస్తాడు. ఆనంద్ తల్లీకొడుకుల దగ్గరకు వెళ్లి మా నాన్నని చూపించండి అంటే రేపు ఉదయమే చూపిస్తామని చెప్తారు. ఆనంద్ రాజు వాళ్లకి విషయం చెప్తారు. నా ఒక్కడినే పంపిస్తారు కదా రాజు నాన్నని ఎలా కాపాడాలి అని ఆనంద్ అంటాడు. రాఘవని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని రాజు అంటాడు. ఇదే చివరి అవకాశం అని ప్రయత్నించమని విరూపాక్షి రాజుతో చెప్తుంది. రాజు ఆనంద్‌తో మీ నాన్నని క్షేమంగా నీకు అప్పగించే బాధ్యత నాది అని అంటాడు.
విజయాంబిక, దీపక్‌లు ఉదయం రెడీ అవుతారు. రాజు వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు. రాజు ఆనంద్ చేతికి స్మార్ట్ వాచ్ కడతాడు. దానిలో జీపీఎస్ ఆన్ చేశానని మీరు ఎక్కడికి వెళ్లినా నా ఫోన్‌కి తెలుస్తుందని.. నేను అమ్మాయిగారు మిమల్ని ఫాలో అవుతాం మేం కనిపించకపోయినా నువ్వు భయపడకు ఎలాంటి పరిస్థితిలో ఈ వాచ్ తీయొద్దని అంటాడు. ఇక దీపక్‌ని పిలవడానికి దీపక్ వచ్చే టైంకి అందరూ దాక్కుండి పోతారు. దీపక్ ఆనంద్‌ని తీసుకెళ్తాడు. మీ నాన్న దగ్గరకు మేం నిన్ను తీసుకెళ్తున్నాం అని ఎవరికీ చెప్పలేదు కదా అంటే లేదు అని ఆనంద్ చెప్తాడు. విరూపాక్షి రాజుకి జాగ్రత్తలు చెప్తుంది.
దీపక్ వాళ్లు వెళ్తూ రాజు వాళ్లు ఫాలో అవుతున్నారేమో అని కంగారు పడి చూస్తారు. రాజు వాళ్లు కనిపించరు. కానీ రాజు, రూపలు ఫాలో అవుతూ ఉంటారు. ఆనంద్ కంగారుగా ఉండటం విజయాంబిక చూసి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. మీరు నిజంగా మా నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నారా అని అడుగుతాడు. తీసుకెళ్తున్నాం అని విజయాంబిక అంటుంది. మరోవైపు రాఘవ తన కొడుకుకి ఫోన్ చేయమని రౌడీలను బతిమాలుతాడు. విజయాంబిక ఆనంద్‌ని అనుమానంగా చూస్తుంది. చాలా రోజుల తర్వాత మా నాన్నని చూస్తున్నా కదా కొంచెం టెన్షన్‌గా ఉంది అని ఆనంద్ అంటాడు.
దీపక్ ఆనంద్ వాచ్ చూసి వాచ్ బాగుంది అని అంటాడు. రుక్మిణి ఇచ్చిందా అని అంటే అవును పెళ్లికి పెట్టుకోమని ఇచ్చిందని అంటాడు. ఆనంద్‌ని విజయాంబిక వాళ్లు తీసుకెళ్తారు. రెండు నిమిషాలు మాత్రమే ఉంటాం అని విజయాంబిక చెప్తుంది. ఆనంద్ ఫోన్ నుంచి రూపకి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి మ్యూట్‌లో పెడుతుంది. ఆనంద్ రాఘవని చూసి ఎమోషనల్ అయిపోతాడు. రాఘవ, ఆనంద్‌ల మాటలు రూప, రాజులు వింటారు. చెవిలో నిన్ను కాపాడటానికి రాజు, రూపలు వచ్చారని ఆనంద్ చెప్తాడు. రాఘవ ఆనంద్‌తో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఏదో ప్లాన్‌తోనే వచ్చుంటారని అంటాడు. ఇద్దరూ ఎమోషనల్‌గా మాట్లాడుతారు. ఆనంద్ నిన్ను ఇలా చేసిన వాళ్లుని వదలను అని అంటాడు. విజయాంబిక వాళ్లకి నమ్మకం కలిగేలా సూర్యప్రతాప్ కోసం మాట్లాడుతాడు. రూప, రాజులు లొకేషన్‌కి చేరుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.