Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక యమున నగలు దొంగతనం చేసి సిద్దార్థ్‌కి ఇచ్చేస్తుంది. అంబిక సిద్దార్థ్‌లను లక్ష్మీ చూసేస్తుంది. ఎవరు అతను అని లక్ష్మీ అడిగితే నా ఫ్రెండ్ అని అంబిక చెప్తుంది. ఫ్రెండ్ అయితే రాజమార్గంలో వెళ్లాలి కానీ ఇలా చాటుగా కలిసి వెళ్తున్నాడు ఏంటి అని అడుగుతుంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు ఈ ఇంటి మనిషిగా అడుగుతున్నావేంటి అని అంబిక అంటుంది. 

లక్ష్మీ అంబికతో నేను ఈ ఇంటి మనిషిని నాకు ఈ ఇంటికి కావాల్సిన దాన్ని నా వాళ్ల జోలికి వస్తే తిరగబడతాను నాకు విశ్వాసం ఉంది అని అంటుంది. విశ్వాసం ఉంది అంటే నువ్వు కుక్కవా అని అంబిక అంటుంది. అవును నేను కుక్కనే నాకు విశ్వాసం ఉంది మరి మీకు విశ్వాసం ఉందా అని లక్ష్మీ అడుగుతుంది. ఎందుకో తడబడుతున్నారు.. ఏదో జరుగుతుందని లక్ష్మీ అనుకొని అది ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఉదయం కూడా రాత్రి అంబిక కలిసిన వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తుంటుంది. 

విహారి జాగింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి తన తండ్రి కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అనుకోకుండా లక్ష్మీని ఢీ కొడతాడు. లక్ష్మీ విహారిని చూసి అంబికమ్మ గురించి చెప్తే బాగున్నా అయినా ఏం ఆధారం లేకుండా ఎలా చెప్పేది అని అనుకుంటుంది. ఇక విహారి తండ్రి కేసులో అంబిక అమ్మ మీద అనుమానం ఉందని అనుకుంటుంది. విహారి చేతి గాయం గురించి అడిగిన లక్ష్మీ ఆ గాయం ఎలా తగిలిందని అడుగుతుంది. విహారి నిజం చెప్పకపోవడంతో విహారి చేతిని తన తల మీద పెట్టుకొని ఒట్టు వేసి చెప్పమని అడుగుతుంది. విహారి షాక్ అయిపోతాడు.

విహారి లక్ష్మీతో మీ అమ్మానాన్నలు మనల్ని దీవించారు. మా అమ్మ కూడా మొదటి సారి మనల్ని దీవించింది ఆ దీవెనలు వృథా అవ్వకూడదు అని సహస్రతో పూజ ఇష్టం లేక ఇలా చేశాను అంటే లక్ష్మీ కన్నీరు పెట్టుకొని ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నా మీద ఒట్టు అని అంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయను అని విహారి అంటాడు. ఇక వెళ్తూ విహారి లక్ష్మీ మీద పడిపోతాడు. ఒకర్ని ఒకరు చూసుకుంటాడు. విహారి షూ లేస్ లక్ష్మీ కడుతుంది. లక్ష్మీ లేస్తుంటే విహారి లక్ష్మీ నుదిటి మీద చూసుకోకుండా ముద్దు పెట్టేస్తాడు. 

యమున ఏడుస్తూ హాల్‌లోకి వచ్చి నా నగలు పోయావని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. అవి మీ అన్నయ్య ఇచ్చిన నగలు వసుధా అని చెప్పుకొని యమున ఏడుస్తుంది.  అంబిక బిత్తర చూపులు చూస్తుంటే లక్ష్మీ అంబికను చూస్తుంది. ఆయన గుర్తుగా మిగిలిన నగలు అవి వాటిని పోగొట్టుకున్నాను.. అని ఏడుస్తుంది. విహారి ఊరుకోమని అంటే మీ నాన్నని కాపాడుకోలేకపోయాను.. మీ నాన్న ఇచ్చిన నగలు కాపాడుకోలేకపోయాను అంటుంది. సహస్ర విహారితో బావ ఎలా అయినా ఆ నగలు సంపాదించాలి అంటుంది. అత్తని ఓదార్చుతుంది. సీసీ టీవీ ఫుటేజ్ చూద్దామని విహారి అంటే సీసీ కెమెరా పోయిందని పండు చెప్తాడు.

లక్ష్మీ విహారితో పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అంటుంది. అంబిక కంగారు పడి వద్దని పోలీసులు ఇంటికి వస్తే పరువు  పోతుందని అంటుంది. విహారి పర్లేదని నా ఫ్రెండ్ ఉన్నాడని అతనికి కాల్ చేసి చెప్తాడు. లక్ష్మీ మాత్రం అంబికను అనుమానంగా చూస్తుంది. నాన్న జ్ఞాపకంగా ఉన్న నగలు ఎలా అయినా తీసుకొస్తానని విహారి అంటాడు. సహస్ర విహారి దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తే పని అయిపోతుంది కదా అంటుంది. అన్నీ డబ్బుతో అవ్వవు కదా అని విహారి అంటాడు. బావ ఇది టైమో కాదో నాకు తెలీదు కానీ నీకు ఒకటి చెప్పాలి అని అంటుంది. ఏంటి అని విహారి అంటే మా నాన్న ఫ్లైట్ టికెట్స్ ఇచ్చారని అంటుంది. ఇప్పుడు ఇది సందర్భమా అని విహారి అంటాడు. 

సహస్ర బాధగా మనకు పెళ్లి అయింది కానీ ఏ అచ్చటా ముచ్చటా లేదు అని అంటుంది. పెళ్లి అయినప్పటి నుంచి నా సంతోషం కోసం ఏం చేశావు బావ అని అడుగుతుంది. ఇంతలో చారుకేశవ అక్కడికి వస్తాడు. విహారితో కంపెనీకి సంబంధించి సంతకాలు పెట్టించుకుంటాడు. ఇక సహస్రతో దేన్నీ బలంగా లాగేలా ఉండకూడదు బంధాలు తెగిపోతాయి. జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది అని చెప్తాడు. ఏంటి అర్థం కాకుండా మాట్లాడారు అని సహస్ర వెళ్లిపోతుంది. యమున ఏడుస్తుంటే లక్ష్మీ ఓదార్చుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ కోసం చేయి విరుచుకున్న విహారి.. యమున నగలు సిద్దార్థ్‌కి ఇచ్చేసిన అంబిక!