Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీతో కలిసి సంతాన వ్రతం చేయడానికి పొద్దున్నే లేచి రెడీ అవ్వడానికి వెళ్తాడు. సహస్ర చూసి నా కళ్లు కప్పి మీరు ఎలా వెళ్తారు బావ అనుకుంటుంది. మరోవైపు మంగళ గౌరీ వత్రం ఏర్పాట్లను యమున, వసుధ చూస్తుంటారు. సహస్ర అమ్మ, పిన్నిలను నిద్ర లేపి పనులు చూసుకోమని కంగారు పెడుతుంది.
లక్ష్మీ యమునతో మార్కెట్‌కి వెళ్తానని చెప్పి బయటకు వెళ్తుంది. ఆదికేశవ్, గౌరీలు పొద్దున్నే గుడికి చేరుకుంటాడు. ఇంట్లో చెప్పకుండా వచ్చామని గౌరీ అంటుంది. ముందే చెప్పాను కదా మళ్లీ వాళ్ల నిద్ర చెడగొట్టడం ఎందుకు అంటారు ఆదికేశవ్. ఇక విహారికి కాల్ చేస్తే పది నిమిషాల్లో విహారి వస్తామని అంటాడు. సహస్ర తల్లి, పిన్నిని కిందకు తీసుకొస్తుంది. యమునని చూసి అత్తయ్య మీరు ఉన్నారు ఆ లక్ష్మీ ఏది అని అడిగితే మార్కెట్‌కి వెళ్లిందని యమున చెప్తుంది. ఇంతలో విహారి రావడంతో ఎక్కడికి అని సహస్ర అడుగుతుంది. పని ఉందని విహారి అంటే సహస్ర వ్రతం అయ్యాక వెళ్లమని అంటుంది. విహారి ఇప్పుడే వెళ్లాలి అంటే నేను వస్తాను అంటుంది. నువ్వు నాతో రావడం ఏంటి అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది.
సహస్ర పట్టు పడితే వసుధ సహస్రని నీ రాశి ఫలాలు బాలేవు అని ఆపేస్తుంది. విహారి వెళ్లిపోతాడు. రోడ్డు మీద లక్ష్మీ వెయిట్ చేస్తుంటుంది. విహారి లక్ష్మీని ఎక్కించుకొని గుడికి వెళ్తాడు. తర్వాత సహస్ర కూడా బయల్దేరుతుంది. ఆదికేశవ్ వాళ్లు అన్ని ఏర్పాట్లు చేస్తారు. యమున చాలా మంచిదని తనని పూజకి పిలుద్దామని ఆదికేశవ్ అంటే తనని పిలవొచ్చో లేదో తను ముత్తయిదువు కాదు కదా అని గౌరీ అంటే ఆదికేశవ్ అలా తప్పని ఆమె మంచి మనసుతో ఆశీర్వదిస్తే చాలని పిలవమని అంటాడు. యమునకు గౌరీ కాల్ చేసి ఆదికేశవ్, గౌరీ ఇద్దరూ పిలుస్తారు. యమున వస్తానని అంటుంది.
లక్ష్మీ, విహారి గుడికి చేరుకుంటారు. వెనకాలే సహస్ర వచ్చేస్తుంది. పంతులు ఇద్దరినీ చూసి మీ ఇద్దరూ భార్యభర్తలా ఇలా నుదిటి మీద కుంకుమ పెట్టకుండా వచ్చావేంటి అమ్మ అని పంతులు అడుగుతారు. కంగారులో మర్చిపోయి వచ్చేశా అని లక్ష్మీ అంటుంది. విహారి తాను పెట్టుకున్న కుంకుమ లక్ష్మీకి తాకేలా హగ్ చేసుకొని కుంకుమ పెడతాడు. సహస్ర చూసి కోపంతో రగిలిపోతుంది. నా బావతో నువ్వు కుంకుమ పెట్టించుకుంటావా అని అనుకుంటుంది. విహారి, కనకం ఇద్దరూ పంతులు ఆశీర్వాదం తీసుకుంటారు.
సహస్ర కోపంతో వాళ్లు వచ్చే మెట్ల మీద పువ్వులతో కలిపి కొబ్బరి చిప్పలు పడేస్తుంది. అవి లక్ష్మీ కాలికి గుచ్చుకుంటుంది. లక్ష్మీ కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. లక్ష్మీ నడవ లేకపోతే విహారి ఎత్తుకొని పైకి తీసుకెళ్తాడు. సహస్ర ఫేస్ మాడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!