గుండెనిండా గుడిగంటలు జూన్ 11ఎపిసోడ్
పూల వ్యాన్ ఎత్తుకెళ్లిపోతాడు గుణ. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల గ్రూపులో మెసేజ్ పెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు బాలు. ఓ ఆటో డ్రైవర్ ద్వారా పూల వ్యాన్ సమాచారం తెలుసుకుని ఫాలో అవుతారు బాలు మీనా. మరోవైపు పార్టీ నేత నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అరగంటలో పూల దండలు తీసుకురావాలని వార్నింగ్ ఇస్తాడు. బాలు ఫ్రెండ్ రాజేష్ కూడా పూల వ్యాన్ చూసి ఫాలో అవుతాడు. డంపింగ్ యార్డ్ వద్దకు వెళుతున్న వ్యాన్ కి అడ్డంగా కారు పెట్టి ఆపుతాడు. మరోవైపు ఆటోలు కూడా వ్యాన్ ని ఫాలో అవుతాయి. అది చూసిన డ్రైవర్ దొరికిపోయానని భావించి అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో బాలు, మీనా వచ్చి వాడిని చితక్కొడతారు. దొరికిపోయాం అని భావించి గుణ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఆ డ్రైవర్ ని పంపించి వ్యాన్ మాయం చేయించింది ప్రత్యర్థి పార్టీ సభ్యులే అనుకుంటాడు బాలు. గుణ కావాలనే ఇదంతా చేశాడని తెలుసుకోలేకపోతాడు.
ఎట్టకేలకు పార్టీ నేతలకు పూల దండలు తీసుకెళ్లి అప్పగిస్తాడు. అప్పటివరకూ కోపంతో ఊగిపోయిన బాలు ట్రాలీతో కనిపించడం చూసి హమ్మయ్య అనుకుంటాడు. ఎందుకు ఇంత లేటైంది, ప్రత్యర్థి పార్టీలకు ఎంతకు అమ్ముడు పోయావని క్వశ్చన్ చేస్తాడు. తాను అమ్ముడు పోలేదని..ఎవరో కావాలని ట్రాలీ ఎత్తుకెళ్లారని చెబుతాడు. ఆ పార్టీ నేత కూడా ఎవరో గిట్టనివాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తాడు. ట్రాలీలో దండలన్నీ సరిగా ఉన్నాయా లేవా చూసి బాలుని వదిలేస్తాడు. ఎంతో నిజాయితీగా పనిచేసిన మిమ్మల్ని అవమానించాను ఏమీ అనుకోకు అని చెప్పాడు. బాలు-మీనా పడిన కష్టానికి మెచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తాడు. హమ్మయ్య పెద్ద గండం నుంచి గట్టెక్కాం అని అనుకుంటారు.
ఇంటికెళుతూ దార్లో బస్తీవాళ్లకి డబ్బులు ఇద్దామని వెళతారు మీనా బాలు. వాళ్లు మాత్రం డబ్బులు ఇచ్చి మమ్మల్ని దూరం చేయొద్దు అంటారు. గతంలో నువ్వు చేసిన సాయమే ఈరోజు మీకు పనిచేసింది..మా డబ్బులు మాకిచ్చి దూరం చేయాలని చూడొద్దు అంటారు. డబ్బులు తీసుకోరు.
ఇంట్లో ప్రభావతి సూటిపోటి మాటలు అంటుంటుంది. సత్యం ఏదో చెప్పేలోగా బాలు మీనా వస్తారు. జరిగినదంతా చెబుతారు. ప్రభావతి కుళ్లుకుంటుంది. డబ్బులన్నీ పుట్టింటికి దోచిపెడుతుందేమో అంటుంది. నువ్వు నా పేరు మీద పార్లర్ పెట్టుకుని నెల నెలా డబ్బులిస్తున్నావ్. కొందరున్నారులే ఎందుకు అని ఫైర్ అవుతుంది. మీనాకు అర్థమయ్యేలా సూటిపోటి మాటలు అంటుంది. మీనా లోపలకు వెళ్లడం చూసి పౌరుషంతో ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తుంది అనుకుంటుంది ప్రభావతి.మరోవైపు రోహిణి టెన్షన్ పడుతుంది..ఎక్కువ డబ్బులు ఇచ్చి అత్తయ్య నుంచి మార్కులు కొట్టేస్తుందేమో అని భయపడుతుంటుంది. మీనా బయటకు రావడం చూసి డబ్బులు ఇస్తుందని సంతోషంతో ఉంటుంది ప్రభావతి. కానీ బయటకు వెళ్లిపోతాను అని చెప్పేసి వెళ్లిపోతుంది. షాక్ అవుతుంది ప్రభావతి
రాజేష్ ని కలసిన మీనా నా భర్త ఆటోతో కష్టపడుతుంటే చూడలేకపోతున్నా అందుకే ఆయనకు కారు కొనిద్దాం అనుకుంటున్నా అంటుంది మీనా. రాజేష్ సంతోషిస్తాడు
గుండెనిండా గుడిగంటలు జూన్ 12 ఎపిసోడ్ లో ... కారు లేకపోవడం మీకీ కష్టం అని మీనా అంటే.. మా ఇంట్లో జాలి లేకపోవడం వల్లే కదా నీకింత కష్టం అంటాడు బాలు. ఆటో నడిపి నడిపి వళ్లంతా నొప్పులు అనడంతో ...సరే వళ్లు పడతాను అంటుంది మీనా..అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటిది హాల్లో అని మండిపడుతుంది. ఇకపై మీరు మీ రూమ్ కి వెళ్లండని పంపిస్తాడు సత్యం