Ammayi garu Serial Today Episode రాజు, సూర్యప్రతాప్‌లతో పాటు ఫ్యామిలీ మొత్తం కీర్తిని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్తారు. డాక్టర్ కీర్తి కండీషన్ అవుట్ ఆఫ్‌ డేంజర్ అని చెప్తారు. పంతులు కీర్తితో నీ కోసం సీఎం సార్ వచ్చారని చెప్తారు. కీర్తికి సూర్యప్రతాప్‌ ఏం జరిగిందని అడిగితే కీర్తి రాజు చెప్పినట్లు జరిగింది చెప్తుంది. సూర్యప్రతాప్‌ కీర్తితో ఎవరో చేసిన తప్పునకు నువ్వు ఇలా చేయడం ఏంటి అమ్మా.. మన తప్పు లేకపోయినా మన మీద ఏమైనా నింద పడితే అది మన తప్పు కాదమ్మా ఎవరో చేసిన తప్పునకు నువ్వు శిక్ష వేసుకోవడం ఏంటి అమ్మా అని అడుగుతారు. దానికి కీర్తీ కన్నీరు పెట్టుకొని నా తప్పు లేదు అని నన్ను నమ్మే ఒక్క మనిషి కూడా లేకపోతే నేనేం చేయాలి సార్ అని కీర్తి ఏడుస్తుంది. నీకు మేం అంతా ఉన్నాం సూర్యప్రతాప్‌ కీర్తికి ధైర్యం చెప్తారు. ఇక పంతులు రాజునే తన కోసం సూర్యప్రతాప్‌ గారు చెప్పిన అబ్బాయి అని చెప్తారు. నీ రాజే నిన్ను కాపాడుకున్నాడమ్మా అని కీర్తితో పంతులు చెప్తారు.

సూర్యప్రతాప్‌ కీర్తితో మా రాజుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అమ్మా అని అడుగుతారు. ఎవరూ లేని నాకు మీరంతా ఉన్నారు అనే ధైర్యం ఇచ్చారు సార్.. మీ లాంటి వాళ్లని నేను ఎందుకు వద్దు అనుకుంటాను సార్.. తెలియని అమ్మాయిని కాపాడిన రాజు తన సొంత మనిషిని ఇంకెలా చూస్తారో అర్థమైంది సార్ నాకు ఇష్టమే అని కీర్తి చెప్తుంది. రూప, రాజులు షాక్ అయిపోతారు. రాజు మనసులో ఈ పెళ్లి జరగదు ఆ విషయం తొందర్లోనే మీకు తెలుస్తుందని అనుకుంటాడు. సూర్యప్రతాప్‌ కీర్తిని తన ఇంటికి తీసుకెళ్తానని చెప్తాడు. 

మరోవైపు బయట సూర్యప్రతాప్‌ గురించి మాట్లాడుతారు. సూర్యప్రతాప్‌ కీర్తిని తీసుకొస్తుంటే కేసు సెటిల్ చేసుకున్నారా.. మీ అల్లుడి వల్ల నష్టపోయిన ఈ అమ్మాయిని ఏ విధంగా న్యాయం చేస్తారు అని అడుగుతారు. ఏం జరిగిందో ఆ అమ్మాయే సూర్యప్రతాప్‌ అంటారు. కీర్తి మీడియాతో మాట్లాడుతుంది. తాను ఓ అనాథ అని తనకు దేవుడు తప్ప ఎవరూ లేరని ఎప్పటిలా గుడికి వెళ్లి వస్తుంటే అని జరిగింది మొత్తం చెప్తుంది. అమ్మాయి చెప్పింది నిజమే అని పంతులు చెప్తారు. ఇక సూర్యప్రతాప్‌ ఈ సంఘటన జరగకముందే ఈ అమ్మాయికి మా రాజుకి పెళ్లి చేయాలి అనుకున్నాం ఇప్పుడు కూడా నిర్ణయంలో మార్పు లేదు రాజు, కీర్తిల పెళ్లి చేస్తానని చెప్తారు. 

సూర్యప్రతాప్‌ని కావాలనే దీపక్, మీడియా రెచ్చగొడతారు. రుక్మిణి మనసులో నాన్నకి కావాలనే రెచ్చగొడుతున్నారని మీడియాని కోప్పడి తండ్రిని వెళ్లిపోదాం అంటుంది. కానీ సూర్యప్రతాప్‌ ఆపి ఇది మా కుటుంబ విషయం మీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ చెప్తున్నా కీర్తి, రాజులకు దగ్గరుండి పెళ్లి జరిపిస్తా అని మాట ఇస్తారు. మీడియా రాజుకి పెళ్లి ఇష్టం లేదని బలవంతం చేస్తున్నారని అడుగుతారు. దాంతో రాజుని సూర్యప్రతాప్‌ కూడా ప్రశ్నిస్తాడు. దాంతో రాజు తనకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తాడు. కీర్తి ఇక అనాథ కాదని తనకి కూతురిలాంటిదని తన ఫ్యామిలీతోనే ఉంటుందని చెప్పి తీసుకెళ్తారు. 

ఇంట్లో ఉన్న వారంతా ఆ న్యూస్ చూసి షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్‌ కీర్తిని తీసుకొని ఇంటికి వస్తాడు. సూర్యప్రతాప్‌ సుమని పిలిచి రాజు, కీర్తిలకు దిష్టి తీయమని చెప్తాడు. సుమ దిష్టి తీస్తుంది. విరూపాక్షి కోపంగా ఉంటుంది. విరూపాక్షి సూర్యని ఆపుతుంది. ఇంట్లోకి రాగానే సూర్యప్రతాప్‌కి ఎదురెళ్లి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్‌ కాదు అని చెప్తుంది. నా ఇంట్లో నేను తీసుకున్న నిర్ణయం గురించి నాకు ఎవరూ చెప్పనవసరం లేదు ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది అని అంటాడు. ఇది నీ ఇళ్లు నీ ఇంటికి నీకు ఇష్టం వచ్చిన వాళ్లని తీసుకురా అది నీ ఇష్టం నేనేం అనను కానీ ఈ అమ్మాయిని నా కూతురి స్థానంలోకి తీసుకొస్తా అంటే మాత్రం నేను ఒప్పుకోను అని విరూపాక్షి అంటుంది. నా కూతురి  స్థానంలోకి ఈ అమ్మాయే కాదు ఇంకే అమ్మాయి వచ్చినా ఒప్పుకోను అంటుంది. 

విజయాంబిక విరూపాక్షితో నీ కూతురికి నా తమ్ముడు అన్యాయం చేయలేదు. బంటీ, రాజుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటుంది. వాళ్ల కోసం ఆ నిర్ణయం తీసుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉండాలి కదా వాళ్ల కళ్లలో ఆ సంతోషం ఉందా అని అంటుంది. సూర్యతో కీర్తిని బంటి, రాజుల జీవితాల్లోకి తీసుకొని రావడానికి నీకు హక్కు లేదు అంటుంది. నువ్వు ఎవరు నా తమ్ముడిని హద్దులు పెట్టడానికి అని విజయాంబిక అంటే నన్ను అనడానికి నువ్వు ఎవరు విజయాంబిక.. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే సరే లేదంటే పళ్లు రాలతాయ్ అంటుంది. ఇంతలో సూర్యప్రతాప్‌ రాజుకి భార్యగా బంటీకి తల్లిగా ఈ అమ్మాయి ఉంటుంది ఇది ఫైనల్ అంటాడు. దానికి విరూపాక్షి ఒకరి భార్య స్థానంలోకి ఇంకో అమ్మయి భార్యగా రావడం అంత ఈజీ కాదు ఆ విషయం ఇక్కడ ఉన్న అందరి కంటే నీకే బాగా తెలుసు అంటుంది. 

విరూపాక్షి సూర్యప్రతాప్‌తో గొడవ పడుతుంటే రుక్మిణి ఆపుతుంది. నాయన ఏం చేసినా మంచే చేస్తాడు అని అంటుంది. రాజు కీర్తిలకు కూడా పెళ్లి ముహూర్తం పెట్టించమని చంద్రతో సూర్యప్రతాప్‌ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!