Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ మెయిల్ చూసి బ్యాంక్ వాళ్లు లోన్ ఓకే చేశారని చారుకేశవ, వసుధకి చెప్తుంది. చాలా కష్టపడ్డావ్ విజయం సాధించావ్ లక్ష్మీ అని అంటారు. చారుకేశవ అందరికీ గుడ్ న్యూస్ చెప్తామని హాల్‌లోకి వెళ్తారు. లక్ష్మీ విహారితో వంద కోట్లు ఓకే చెప్పారని అంటుంది. విహారి చాలా సంతోషపడతాడు.
ఇంట్లో అందరికి చారుకేశవ, వసుధలు విషయం చెప్తారు. లక్ష్మీ వల్లే ఈ విజయం వచ్చిందని లక్ష్మీ చాలా కష్టపడిందని లక్ష్మీని వాళ్లు పొగడటంతో దాని జపం మొదలు పెట్టారా అని పద్మాక్షి అంటుంది. సహస్ర విహారికి స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్తుంది. లక్ష్మీనే ముందు డ్యామేజ్ చేసింది కదా అని అంబిక వాళ్లు అంటారు. చారుకేశవ లక్ష్మీతో గెలిచే వాళ్లకి విమర్శించే నోరు విమర్శిస్తూనే ఉంటుందని అంటాడు.
యమున రావడంతో లక్ష్మీ, విహారి ఇద్దరూ సంతోషంగా వెళ్లి విషయం చెప్తారు. విహారి స్వీట్ ఇస్తాను అంటే వద్దు అనేస్తుంది. విహారి, లక్ష్మీ షాక్ అవుతారు. ఏమైంది అని అడిగితే ట్యాబ్లెట్ వేసుకోలేదని అంటుంది. పద్మాక్షి వాళ్లతో లోన్ వచ్చింది అని సంబర పడటం కాదు మంచిగా వాడి కంపెనీకి పేరు తీసుకురండి అని చెప్తుంది. విహారితో సహస్ర ఆఫీస్‌కి వెళ్తాం అంటే నువ్వు అంబిక అత్తయ్యతో వెళ్లిపో నేను లక్ష్మీ, మామయ్య వస్తామని అంటుంది. వసుధ యమున దగ్గరకు వెళ్లి ఆరోగ్యం బాలేదా లేకపోతే మా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడుగుతుంది. ఇది వరకులా మీరు అందరితో మాట్లాడటం లేదు చొరవగా ఉంటడం లేదు అని అంటుంది. లక్ష్మీని కూడా ఏం అనలేదు అని వసుధ అంటే నేను ఎక్కువ రియాక్ట్ అయితే పద్మాక్షి వదినకు నచ్చదు అని సైలెంట్‌గా ఉన్నానని అంటుంది.
వసుధ వెళ్లిపోయిన తర్వాత యమున ఇంట్లో అందరికీ ఏదో ఒకరోజు లక్ష్మీ, విహారి పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది. ఆ రోజు అందరూ ఎలా రియాక్ట్ అవుతారో.. వదిన ఏం అంటుందో.. సహస్ర ఏం చేసుకుంటుందో ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు అని యమున తల పట్టుకుంటుంది. విహారి వాళ్లంతా ఆఫీస్‌కి వెళ్తారు. బ్యాంక్ వాళ్లు వస్తారు చివరి సారి ఒక సారి అని చెప్తారు. అందరూ సహస్ర మనసులో లోన్ ప్రాసెస్ అంతా అయిపోతుంది ఫండ్ వస్తుందని బావ సంబర పడుతున్నారు కానీ అదంతా మాయం అయిపోతుంది దానికి కారణం లక్ష్మీనే అవుతుందని అనుకుంటుంది.
లక్ష్మీ బ్యాంక్ వాళ్లకి మరోసారి ప్రజంటేషన్ ఇస్తుంది. ప్రజంటేషన్ సూపర్ అని చెప్పి బ్యాంకర్లు లక్ష్మీ, విహారిల సంతకాలు తీసుకుంటారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లోన్ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పి వంద కోట్ల ఫండ్‌ని శాంక్షన్ చేస్తామని కొన్ని గంటల్లోనే మీరు ఇచ్చిన అకౌంట్స్‌కి ఫండ్ వస్తుందని అంటారు. విహారి చాలా సంతోషపడతాడు. బ్యాంక్ వాళ్లకి థ్యాంక్ చెప్తాడు. బ్యాంక్ వాళ్లు వెళ్లిపోతారు. లక్ష్మీ, విహారిలు కంగ్రాట్స్ చెప్పుకుంటారు. తర్వాత అకౌంట్ టీమ్‌తో మీటింగ్ పెడతారు. అంబిక సుభాష్‌కి కాల్ చేస్తుంది. సుభాష్ హాకర్లతో ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఫండ్స్ ట్రాన్సఫర్ చేయడానికి రెడీగా ఉంటాడు.
అంబిక మనసులో విహారి పతనానికి టైం స్టార్ట్ అయిందని అనుకుంటుంది. పండు ఇంట్లో అందర్ని పిలిచి న్యూస్ చూపిస్తాడు. విహారి కంపెనీలకు లోన్ ఒకే అయిందని ఇప్పుడు మొత్తం పాజిటివిటీ వచ్చిందని లక్ష్మీ వల్లే ఇదంతా అని చెప్తారు. పండు సంతోషంతో లక్ష్మీ వల్లే మొత్తం అయింది అంటే యమున, పద్మాక్షి కోపంగా చూస్తారు. వసుధ లక్ష్మీని పొగిడేస్తుంది. పద్మాక్షి కేకలేస్తుంది. రెండు రోజుల క్రితం నిర్లక్ష్యంతో మన కంపెనీని నాశనం చేసింది.. విహారి కలగజేసుకొని తిరిగి మార్చాడు. అసలు ఆ దరిద్రాన్ని ఈ మహాతల్లి తెచ్చి మన నెత్తిన పెట్టింది. అది ఇప్పుడు నా కూతురికి పోటీ వస్తూ తైతక్కలాడుతుంది అని పద్మాక్షి అంటుంది.
యమున కోపంగా వదినా.. సహస్రకు ఎప్పుడూ లక్ష్మీ పోటీ కాదు. సహస్ర నా కొడుకు విహారి భార్య నా కోడలు.. లక్ష్మీని సహస్రతో అస్సలు పోల్చొద్దు అంటుంది. పోల్చింది మీరే ఇంట్లో వాళ్లని ఎలా చూసుకోవాలో పని వాళ్లని ఎలా చూసుకోవాలో తెలుసుకోండి అని పద్మాక్షి అంటుంది. సుభాష్ వాళ్లు రెడీగా ఉంటారు. చారుకేశవ అకౌంటెంట్‌తో మాట్లాడుతారు. అందరూ రెడీగా ఉంటారు. అందరూ రెడీగా ఉంటారు. సుభాస్‌కి అంబిక కాల్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!