Nindu Noorella Saavasam Serial Today Episode:  అంజలి గురించి తెలుసుకోవడానికి మనోహరి, రణవీర్‌కు కాల్‌ చేస్తుంది. అంజలిని ఎలాగైనా చంపేందుకే రణవీర్‌ డిసైడ్‌ అవుతాడు.

రణవీర్‌: అమర్‌ ఆ ఇంటి చుట్టు అంజు చుట్టూ పెద్ద కొట కడుతున్నాడు దాన్ని దాటుకుని నేను లోపలికి రాలేను అందుకే నేను ఆ ఇంట్లోకి రాలేను. నువ్వు ఎలాగూ ఆ ఇంట్లోనే ఉంటావు కదా ఏ చిన్న అనుమానం వచ్చినా నాకు ఫోన్‌ చేసి చెప్పు

మను: సరే కానీ ఇదంతా ఎందుకు అంజలియే దుర్గ అని తెలిస్తే అంజలిని వదిలేస్తావా..?

రణవీర్‌: నాకు ఆస్థి కన్న ఏది ఎక్కువ కాదని నీకు తెలుసు కదా మనోహరి. నా సమాధానం ఏంటో నీకు తెలుసు. నాకు నిజం కావాలి

మను: సరే ఏదైనా నాకు తెలిస్తే నీకు ఫోన్‌ చేస్తాను (కాల్‌ కట్‌ చేస్తుంది.) డీఎన్‌ఏ రిపోర్ట్‌ ఫెయిల్‌ అయితే అంజలి మా కూతురు కాదా..? మరి అమర్‌ ఎందుకు అబద్దం చెప్తున్నాడు. ( మనసులో అనుకుంటుంది.)

అంజలి వెళ్తుంటే.. మనోహరి ఆపేస్తుంది.

అంజు: హలో ఆంటీ ఎందుకు ఆపారో చెప్పకుండా అలా చూస్తున్నారేంటి..?

మను: క్లారిటీ కోసం

అంజు: దేని గురించి క్లారిటీ

మను: ఆ ఆరు నిన్న ఎలా చూసుకునేది.. అందరితో సమానంగా చూసుకునేదా..?

అంజు: రణవీర్‌ అంకుల్‌కు మీకు ఏమైంది ఆంటీ ఎందుకు అలా అడుగుతున్నారు. మొన్న కూడా అంకుల్‌ అంతే అమ్మ ఎలా చూసుకునేది అని అడిగారు

మను: ఓ అది రణవీర్‌ ముందే అడిగారా..? (మనసులో అనుకుంటుంది)

అంజు: హలో ఆంటీ ఎందుకు అని అడుగుతున్నాను

మను: ఎందుకంటే మా ఇద్దరికీ నువ్వంటే బాగా ఇష్టం అని అడిగాను

అంజు:  మా అమ్మకు డాడీకి నేనంటే చాలా ఇష్టం.. అమ్ము, అన్నయ్యల కంటే నన్నే బాగా చూసుకునేవారు

మను: అంజు ఒక్కసారి నువ్వు  నన్ను అమ్మ అని పిలుస్తావా..?

ఇంతలో అమ్ము వాళ్లు వచ్చి అంజును తీసుకెళ్తుంటే.. డోర్‌ దాకా వెళ్లిన అంజు అమ్మా అని పిలిచి వెళ్లిపోతుంది. మనోహరి షాక్‌ అవుతుంది. మరోవైపు యమలోకం వెళ్తున్న ఆరు గుప్తను నవ్వుతూ చూస్తుంది.

ఆరు: గుప్త గారు నేను కచ్చితంగా పైకి రావాల్సిందేనా..? నాకు సాయం చేసే దేవుళ్లు ఎవ్వరూ లేరా..? నేను యూస్‌ చేసుకునే లైఫ్‌లైన్‌ లేదా..?

గుప్త: ఏమిటీ నువ్వు మాట్లాడుతున్నది. ఇన్ని రోజులు భూమ్మీద ఉన్న ఆశ తీరలేదా..? అయినా నీకు సాయం చేయడం తప్పా ఆ జగన్నాథుడికి వేరే పని లేదనుకుంటివా..? నీకిచ్చిన సమయం పూర్తి అయింది. అయినా నువ్వు భూలోకం తిరిగి వెళ్లి ఏమి చేయుదువు

ఆరు: ఏమో గుప్తు గారు ఏదైనా అద్బుతం జరగవచ్చు.. మీరే దగ్గరుండి నన్ను భూలోకం తీసుకెళ్లవచ్చు

చిత్రగుప్తుడు కంగారుగా వస్తాడు. గుప్తను పక్కకు తీసుకెళ్తాడు.

చిత్రగుప్త:  త్రిమూర్తులు యమపురికి వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో ఈ బాలిక అక్కడికి వచ్చిన ఎడల మన ఇరువురము ప్రభువుల వారితో కలిసి ఈ బాలిక లెక్కల విషయంలో మనము చేసిన తప్పులు తెలిసిపోవును అందుకే వారు వెళ్లు వరకు ఈ బాలికను తీసుకుని భూలోకమునకు వెళ్లుము

గుప్త: ఇంత కష్టపడి ఈ బాలికను ఇక్కడిదాకా తీసుకువచ్చింది మరలా భూలోకం తీసుకువెళ్లుటకా..? ఆ పని నేను చేయలేను. వారు యమపురిని వదిలి వెళ్లు వరకు ఇచ్చటనే ఈ బాలికను మేఘములలో తిప్పెదను

చిత్రగుప్త: అయితే నారదముని చూస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో

గుప్త: మీరు కూడా నాతో భూలోకం వస్తే నేను సమ్మతించెదను

అంటూ గుప్త మెలిక పెట్టేసరికి చిత్రగుప్తుడు సరే అంటాడు. ముగ్గురు కలిసి భూలోకం బయలుదేరుతారు. తర్వాత అమర్‌ ఫ్యామిలీ మొత్తం ఫంక్షన్‌కు వెళ్తుంటే.. తనకు నగలు లేవని చిత్ర చెప్తుంది. అయితే అత్తయ్య నీకు నగలు ఇస్తారు అని భాగీ చెప్పగానే తనకు ఆరు నగలు కావాలని చిత్ర అడుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!