Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమునకు హార్ట్ అటాక్ కూడా వచ్చిందని ఇక నుంచి తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని టెన్షన్ పెట్టే ఏ విషయాలు యమునతో మాట్లాడొద్దని డాక్టర్ చెప్తుంది. విహారి ఇంట్లో అందరినీ తన తల్లి పరిస్థితి గురించి చెప్పి జాగ్రత్తగా ఉండమని అంటాడు.
అంబిక విహారితో ఈ పరిస్థితికి కారణం లక్ష్మీ వల్లనే అని తను గెంటేసిన లక్ష్మీని మళ్లీ నువ్వు తీసుకురావడం వల్లే ఇలా అయిందని అంటుంది. వసుధ, చారుకేశవలు లక్ష్మీకి సపోర్ట్‌గా మాట్లాడుతారు. సహస్ర మాత్రం లక్ష్మీ బయటకు వెళ్తే విహారి లక్ష్మీతో వేరే కాపురం పెట్టేస్తాడని భయపడి లక్ష్మీని ఇక్కడే ఉండమని అంటుంది. ఇక సహస్ర విహారితో అత్తయ్య గురించి నువ్వు టెన్షన్ పడకు బావ నేను అత్తయ్యని కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్తుంది.
ఎస్‌ఐ లక్ష్మీకి కాల్ చేస్తుంది. హ్యాకర్‌ని నిలదీశామని 30 కోట్లు కాకుండా మిగతా డబ్బు కోసం తెలీడం లేదని సైబర్ క్రైమ్ టీమ్ కూడా 70 కోట్లు సెల్ కంపెనీలకు పంపడం వల్ల తిరిగి తీసుకురాలేమని అంటున్నారని అంటుంది. దానికి లక్ష్మీ ఎలా అయినా ఆ డబ్బు రికవరీ చేయాలి మీరు మీ ప్రయత్నం చేయండి నేను నా ప్రయత్నం చేస్తాను అంటుంది. ఇక సహస్ర లక్ష్మీ దగ్గరకు వచ్చి 70 కోట్లు అంటూ నువ్వు బావని ఇబ్బంది పెట్టి అత్తయ్యకు ఏమైనా అయితే నేను ఊరుకోను..అసలే అత్తయ్య ఆరోగ్యం బాలేదు అని అంటుంది. యమునమ్మకి ఏం కాకుండా చూసుకోవడం మనందరి బాధ్యత.. అలాగే ఆ 70 కోట్లు కూడా రికవరీ చేయడం నా బాధ్యత అంటుంది. కొన్ని రోజులు ఆగమని చెప్తున్నా అని సహస్ర అంటే లక్ష్మీ ఆగను ఎవరీకీ ఏం కాకుండా చూసుకుంటా అని అంటుంది. ఇది ఇంత కాన్ఫిడెంట్‌గా ఉంది.. నేను వెనకున్నా అని తెలిసిపోతుంది. బావ నన్ను ఛీ కొడతాడు. ఈ లక్ష్మీని ఎలా ఆపడం అని లక్ష్మీ అనుకుంటుంది.
విహారి తల్లి దగ్గరకు వెళ్లి కూర్చొంటాడు. యమున లేస్తుంది. లక్ష్మీ చాటుగా మాటలు వింటుంది. విహారి తల్లితో నీకేం కాదమ్మా నేను ఉన్నా కదా అంటాడు. ఏంటి నాన్న అలా అంటున్నావ్ అని యమున అంటుంది. నీ సంతోషం నాకు ముఖ్యం అని విహారి అంటే నా సంతోషం నువ్వు సహస్ర సంతోషంగా ఉండటంలో ఉంది నాన్న అంటుంది. విహారి షాక్ అయిపోతాడు. నువ్వు మాటిచ్చి తాళి కట్టిన భార్యరా సహస్ర తనతో నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా కోరికరా అని అంటుంది. రేపు నేను ఉన్నా లేకపోయినా అని సహస్రని నువ్వు బాగా చూసుకోవాలి నాన్న ఎందుకంటే ఈ అమ్మకి నీ సంతోషంతో పాటు ఈ కుటుంబం చాలా ముఖ్యం.. నువ్వు నా కోసం ఎలా ఆలోచిస్తావో ఈ కుటుంబం కోసం నువ్వు అలాగే ఆలోచించాలి.. ఈ కుటుంబం ఎప్పటికీ కలిసుండే బాధ్యత నీదే అంటుంది. విహారి తల్లితో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అంటాడు.
యమున విహారితో నేను ఉంటానో లేదోరా అందుకే చెప్తున్నా.. నీకు సహస్రకు మధ్యలో ఇంకెవరినీ రానివ్వకురా అని అంటుంది. లక్ష్మీ ఏడుస్తూ వెళ్లిపోతుంది. విహారి తలూపి వెళ్లిపోతాడు. యమున మనసులో విహారి నుంచి లక్ష్మీని దూరం పంపేయడం కాదు ఈ సమస్యకు పరిష్కారం సహస్రను విహారికి దగ్గర చేసి లక్ష్మీని దూరం చేయాలి అని అనుకుంటుంది. విహారి తల్లి మాటలు తలచుకొని హారతి చేతిలో వెలిగించుకొని తులసికోట దగ్గర నిల్చొంటాడు. పండు చూసి ఆపాలని ప్రయత్నిస్తాడు. నాకు నేను శిక్ష వేసుకోవాలి పండు సహస్రతో పెళ్లికి అందర్ని ఒప్పించా.. కానీ లక్ష్మీని పెళ్లి చేసుకొని మనసిచ్చా.. లక్ష్మీకి నా మనసులో ప్రేమ చెప్పలేను.. సహస్రతో నువ్వు నా భార్య కాదని చెప్పలేను.. పద్మాక్షి అత్తకి చెప్పలేను.. ఏడుస్తాడు. విహారి ఏడిస్తే పండు కూడా ఏడుస్తాడు.
మరోవైపు అంబికకు సుభాష్ కాల్ చేసి లక్ష్మీ డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అంటాడు. విహారి కంటే లక్ష్మీనే డేంజర్ అని అంబిక అంటుంది. ఎవరికీ ఏం అనుమానం చూసి లేపేయాలని అంబిక అంటుంది. అంబిక టెన్షన్ చూసి చారుకేశవ వెళ్లి ఏంటి టెన్షన్ పడుతున్నావ్ అని అడుగుతాడు. ఏం లేదని అంబిక అనేస్తుంది. లక్ష్మీ విషయంలో టెన్షన్ పడుతున్నట్లున్నావని చారుకేశవ అంటాడు. లక్ష్మీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా అయినా నీ మధ్య నువ్వు దాని వైపు మాట్లాడుతున్నావ్ అంటుంది. లక్ష్మీ నాకు కూతురి లాంటిది లక్ష్మీతో పెట్టుకున్నవాళ్లకి పుట్టగతులు లేకుండా పోతాయి. ఇప్పటికైనా మారకపోతే చాలా బాధ పడతావ్ అని చారుకేశవ అంటాడు. లక్ష్మీ యమున పడుకోవడంతో యమున దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకొని మీరు నాకు దేవుడి కంటే ఎక్కువమ్మా. నేను విహారి, సహస్రమ్మల సంసారానికి ఎప్పుడూ అడ్డు పడను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.