Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, లక్ష్మీ రాత్రి అడవిలో దాక్కుంటారు. విహారి తన మనసులో మాట లక్ష్మీకి చెప్పాలని అనుకుంటాడు. లక్ష్మీ వైపు చూడకుండా లక్ష్మీ అంటే తనకు ఇష్టమని ప్రేమని ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్తాడు. లక్ష్మీ వైపు తిరిగే సరికి లక్ష్మీ పడుకొని ఉంటుంది. 

విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్లి నా మనసులో మాటలు చెప్తే విననివ్వకుండా అలసట నీకు వచ్చేసింది లక్ష్మీ అనుకుంటాడు. లక్ష్మీ నుదిటి మీద చేయి వేస్తాడు. తల కాలిపోవడంతో జ్వరం వచ్చినట్లు ఉందని అనుకొని అడవిలో వేరే ప్రాంతానికి వెళ్లి నీరు తీసుకొస్తాడు. నీరు తీసుకొస్తుంటే రౌడీలు టార్చిలు వేసి వెతుకుతూ ఉండటం చూసి దాక్కుంటాడు. రౌడీలు వెళ్లిపోయిన తర్వాత లక్ష్మీ  దగ్గరకు వెళ్లి సపర్యలు చేస్తాడు. తడి రుమాలుతో లక్ష్మీ చేతులు తుడిచి నుదిటి మీద తడిగుడ్డ పెడతాడు. ఈ సమస్యలు అన్నీ తీరిపోయిన తర్వాత నా మనసులో మాట నీకు చెప్తా లక్ష్మీ చెప్తా అనుకుంటాడు. ఉదయం లక్ష్మీ నిద్ర లేస్తుంది. చుట్టూ చూసి విహారిని చూసి మీరు చాలా గొప్పవారు విహారి గారు మీ లాంటి భర్త దొరకడం నా అదృష్టం కానీ మీ భార్యగా మీ పక్కన నిల్చొనే భాగ్యం ప్రేమ పొందే అర్హత నాకు లేదు ఈ జన్మకి ఈ అదృష్టం చాలు అనుకుంటుంది. ఇక రౌడీల అలికిడి వింటుంది.

రౌడీలు వచ్చేస్తున్నారు ఇప్పుడు వాళ్లు విహారిని చూస్తే ప్రమాదం అనుకొని చుట్టూ చూసి గడ్డి ఉండటంతో విహారిని నేల మీద పడుకోపెట్టి విహారి మీద గడ్డి కప్పేస్తుంది. తర్వాత రౌడీలను డైవర్ట్ చేయడానికి కావాలనే తనని రౌడీలు చూసేలా వాళ్ల ఎదురుగా వెళ్లి వాళ్లని వేరే వైపు పరుగెత్తిస్తుంది.  లక్ష్మీ పరుగెడుతుండగా సుభాష్ చూసి లక్ష్మీని పట్టుకుంటాడు. ఇక విహారి నిద్ర లేస్తాడు. చుట్టూ చూసి కనకం ఏది అనుకుంటాడు. తన మీద గడ్డి కప్పి ఉండటం చూసి తనని కాపాడటానికి లక్ష్మీ ప్రాణాలకు తెగించిందని అనుకుంటాడు. కనకం కోసం వెతుకుతాడు. ఇద్దరు రౌడీలు జీపు దగ్గర మాట్లాడుకోవడం చూసి వాళ్లని కొట్టి లక్ష్మీ ఎటు వెళ్లిందని అడిగి జీపు తీసుకొని వెళ్తాడు. అయితే ఆ రౌడీలను సుభాష్ కావాలనే అక్కడ పెడతాడు. విహారి చూసి జీపులో వచ్చి లక్ష్మీ గుద్దించి చంపేలా లక్ష్మీని కట్టేసి రోడ్డు మీద పడుకో పెడతారు. విహారి స్పీడ్‌గా వెళ్లి లక్ష్మీని గుద్దేసే టైంకి కారు ఆపుతాడు. లక్ష్మీ కట్లు  విప్పి పైకి లేపేసరికి సుభాష్ వాళ్లు వెళ్లి నీ చేత చంపించాలని అనుకున్నాం మిస్ అయిపోయిందిరా అని అంటాడు. రౌడీలు విహారిని కొట్టడానికి వెళ్తే విహారి సుభాష్తో పాటు అందర్ని చితక్కొడతాడు.

విహారిని సుభాష్ కాల్చడానికి గన్ తీయడం లక్ష్మీ చూసి విహారిని పక్కకి నెట్టి టైం తాను లోయలో పడిపోతుంది. లక్ష్మీని విహారి చూస్తుండగా సుభాష్ విహారిని కాల్చేస్తాడు. లక్ష్మీ, విహారి ఇద్దరూ లోయలో పడిపోయారు ఇక బతకరు అనుకొని సుభాష్ వాళ్లు వెళ్లిపోతారు. కానీ లక్ష్మీ ఓ చెట్టు మొదలు పట్టుకొని ఉంటుంది. విహారి కరెక్ట్‌గా అక్కడే ఇరుక్కుంటాడు. లక్ష్మీని విహారి కాపాడి పైకి తీసుకొస్తాడు. ఇక లక్ష్మీ విహారి చేతికి దెబ్బ చూస్తుంది. బయటకు వెళ్లాలని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: అన్న డబ్బు కొట్టేసిని లోహిత.. చందుకి అవమానం తప్పదా! సోదమ్మా మహికి ఏం చెప్పిందంటే!