Senior Actor Suman Joins Star Maa Sapthapadi Serial Cast: 'అన్నమయ్య' వంటి క్లాసికల్ హిట్‌తో పాటు ఎన్నో లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో టాలీవుడ్ ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారు సీనియర్ హీరో సుమన్. ఆ తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌తో బుల్లి తెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత సుమన్ కొన్ని టీవీ సీరియళ్లలో నటించారు. అప్పట్లో అర్చన, యమలీల, దాంపత్యం సీరియళ్లలో నటించి మెప్పించారు. కాస్త గ్యాప్ తీసుకుని కన్నడ సీరియల్ 'స్నేహద కదలల్లి' పేరుతో ఓ సీరియల్‌లో చేస్తున్నారు. 'త్రినయని' సీరియల్ ఫేం చందు గౌడ కన్నడలో చేసిన ఈ సీరియల్‌లో అతనికి ఫాదర్ రోల్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది 'స్టార్ సువర్ణ' ఛానల్‌లో టెలికాస్ట్ అవుతోంది.

తెలుగులో రీమేక్

ఇప్పుడు తెలుగు రీమేక్‌లోనూ సుమన్ కనిపించబోతున్నారు. 'స్టార్ మా'లో త్వరలోనే ప్రారంభం కానున్న 'సప్తపది' సీరియల్‌లో సుమన్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. 'స్నేహద కదలల్లి' సీరియల్‌కే ఈ 'సప్తపది' సీరియల్ రీమేక్ అని తెలుస్తుండగా... సేమ్ క్యారెక్టర్‌నే సుమన్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Also Read: బిచ్చగాడు వర్సెస్ రిచ్చెస్ట్ పర్సన్ - ఓటీటీలోకి వచ్చేసిన 'కుబేర'... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

'ఇంటింటి రామాయణం' మేకర్స్ నుంచి

యునిక్యూ మీడియా బ్యానర్‌పై 'సప్తపది' సీరియల్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి 'స్టార్ మా'లో 'ఇంటింటి రామాయణం' సోమ - శనివారం వరకూ ప్రతీ రోజూ రాత్రి 8:30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ఈ సీరియల్ తమిళ సీరియల్ 'వీటిక వీడు' సీరియల్‌కు రీమేక్ కాగా... మరి 'సప్తపది' ఏ సీరియల్‌కు రీమేక్ అనేదే క్లారిటీ రావాల్సి ఉంది. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు సీరియల్‌లో సుమన్ కనిపిస్తుండడంతో ఆడియన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

సీరియల్స్... చాలా స్పెషల్...

ప్రస్తుతం చాలా మంది సీనియర్ హీరోలు, హీరోయిన్లు టీవీ సీరియళ్లలో నటించేందుకు మొగ్గు చూపుతున్నారు. సీనియర్ హీరోయిన్ ఆమని, పవిత్ర లోకేశ్ వంటి వారు సీరియళ్లలో నటిస్తున్నారు. ఆమని 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో తన నటనతో మెప్పిస్తున్నారు. ఇప్పుడు సుమన్ సైతం సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏళ్ల క్రితమే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన కన్నడ సీరియల్‌తో టీవీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే రీమేక్ సీరియల్‌లో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

అప్పట్లో సుమన్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. లవ్, యాక్షన్, కామెడీ ఇలా జానర్ ఏదైనా డిఫరెంట్ మూవీస్‌లో తనదైన యాక్టింగ్‌తో మెప్పించారు. క్లాసికల్ మూవీ 'అన్నమయ్య'లో వెంకటేశ్వరునిగా ఆయన నటన అత్యద్భుతం. అప్పటి జనరేషన్ నుంచి ఇప్పటివరకూ ఆ రోల్ అంటే అందరికీ ఇష్టమే. ఆ తర్వాత హీరోగానూ పలు మూవీస్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం సీరియళ్లతోనూ ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.