Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర వాళ్లు తన ఇంట్లో ఉండటం కనక మహాలక్ష్మీ చూసేస్తుంది. కంగారులో తన చేతిలో ఉన్న గ్లాజ్ కింద పడేస్తుంది. అందరూ వెనక్కి తిరిగి చూసే సరికి కనకం అక్కడి నుంచి పారిపోయి విహారి దగ్గరకు వెళ్లి తలుపు గడియ పెట్టి విహారితో అమ్మ గారు అమ్మగారు అని కంగారుగా చెప్తుంటుంది. అమ్మా వాళ్లు వచ్చారు అమ్మగారు వచ్చారని చెప్తుంది. ఎవరు ఏ అమ్మగారు అని విహారి అడిగితే యమునమ్మగారు, పద్మాక్షి గారు, అంబిక గారు, సహస్ర గారు అందరూ వచ్చారు అని చెప్తుంది. విహారి షాక్ అయిపోతాడు.
కంగారుగా డోర్ ఓపెన్ చేసి తీసి చూసి షాక్ అయిపోతాడు. కంగారుగా వెంటనే డోర్ క్లోజ్ చేసేసి తల పట్టుకుంటాడు. సహస్ర పెళ్లి బట్టల కోసం ఏదో ఊరు వచ్చానని అంటే ఇదే ఊరా ఇదే ఇళ్లా అని షాక్ అయిపోతాడు.
కనకం: మీరు తర్వాత ఆశ్చర్యపోవచ్చు ముందు మనం తప్పించుకోనే మార్గం చూడండి. మన ఇద్దరినీ ఇకే గదిలో చూసే సరికే రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు మా ఊరిలో మా ఇంట్లో చూస్తే ఇంకేమైనా ఉందా. హాల్‌లోనే విహారి కనకంల పెళ్లి ఫొటో ఉంటుంది. సహస్ర వాళ్లు చూస్తారేమో అని కంగారు పడతారు. కనకం, విహారి చాటుగా వాళ్లని చూస్తుంటారు.
సహస్ర: వావ్ చీరలన్నీ చాలా బాగున్నాయి.
ఆదికేశవ్: అవునమ్మా నా కూతురి పెళ్లి చేశా ఈ మధ్యే అందరికీ నేను నేచిన చీరలే పెట్టానమ్మా.
వసుధ: ఓ మీ అమ్మాయికి పెళ్లి అయిందా ఏ ఊరు ఇచ్చారేంటి.
ఆదికేశవ్: ఏ ఊరు కాదమ్మా ఏ దేశం అనాలి అమెరికా ఇచ్చానమ్మా. నా అల్లుడు నిజంగా చాలా గొప్పోడమ్మా. నా కూతురు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో గొప్ప అల్లుడు దొరికాడు. నా అల్లుడు బంగారం ప్రస్తుతం ఇక్కడే ఉన్నారమ్మా. అమెరికా నుంచి నిన్ననే వచ్చారు వాళ్లని చూపిస్తా ఉండు.
విహారి: మీ నాన్న మనల్ని పిలిచేలా ఉన్నారు.
కనకం: ఇప్పుడు మనిద్దరం వాళ్లకి కనిపిస్తే అంతే సంగతులు. మీమల్ని చాలా మాటలు అంటారు. నా మీద చాలా నిందలు వేస్తారు. అది చూసి మా అమ్మానాన్న ఏమైపోతారో.
విహారి: లక్ష్మీ కంగారు పడకు. ఏదో ఒకటి చేద్దాం.
ఆదికేశవ్ భార్య గౌరీని పిలిచి అమ్మాయి అల్లుడిని తీసుకురమ్మని చెప్తాడు. కనకం, విహారి ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏదో ఒకటి చేయండని కనకం విహారిని కంగారు పెట్టేస్తుంది. గౌరీ కూడా వచ్చేస్తుంటుంది. దాంతో విహారి కనకంతో లక్ష్మీ నేను ఇప్పుడు ఒక పని చేస్తా ఏం చేసినా నువ్వు తప్పుగా తీసుకోవద్దు.. ఏం అనొద్దు అని అంటాడు. కనకం సరే అంటుంది. సరిగ్గా గౌరీ గది తలుపు తీసి లోపలికి వచ్చే టైంకి విహారి లక్ష్మీకి ముద్దు పెడుతున్నట్లు దగ్గరకు తీసుకొని పట్టుకుంటాడు. అది చూసి గౌరీ సిగ్గుతో అటు తిరిగి వెళ్లి తలుపు దగ్గరకు వేసి వెళ్లిపోతుంది. కనకం టెన్షన్ పడుతుంది. ఇక గౌరీ వచ్చి వాళ్లు తర్వాత వస్తారని అంటుంది. ఆదికేశవ్ ఏమైంది తీసుకురా అంటే వాళ్లు వచ్చే పరిస్థితిలో లేరని ఆదికేశవ్ చెవిలో విషయం చెప్తుంది.
విహారి తప్పుగా అనుకోవద్దని సారీ చెప్తాడు. సహస్రకు యమున చీరలు చూపించి ఇది బాగుందా అది బాగుందా అని అడిగితే పద్మాక్షి యమునను నోరు మూసుకొని కూర్చొమని అంటుంది. అది చూసిన విహారి అమ్మని ఎందుకు అంత అసహ్యించుకుంటున్నారని అనుకుంటాడు. ఇక కొన్ని చీరలు సహస్ర వాళ్లు తీసుకొని మిగతావి డిజైన్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చేయ్‌మని అంటారు. ఆదికేశవే స్వయంగా తీసుకొస్తానని అంటాడు. ఇంతలో సోదమ్మ కనిపిస్తే సహస్ర పిలిచి పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని అంటే అన్నీ జరగవని అంటుంది. సోదమ్మ నోటి నుంచి అలాంటి మాటలు ఎందుకు వచ్చాయో తెలీదు కానీ మా ఊరి శివాలయంలో ఒక రోజు నిద్ర చేసి కార్తీక దీపం వదిలి వెళ్లండి మంచి జరుగుతుందని అంటాడు. వసుధ కూడా అలా చేద్దాం అని అంటుంది. సహస్ర ఓకే అంటుంది. మరోవైపు విహారి ఆదికేశవ్‌తో పని ఉంది వెళ్లిపోతా అని చెప్తాడు. కనకం కూడా ఆయనకు పని ఉంది వెళ్లాలని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆదికేశవ్ ఇంట్లో లక్ష్మీని చూసేసిన సహస్ర ఫ్యామిలీ.. విహారి పెళ్లి విషయం బయట పడిపోతుందా!