Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తన మీద కోపంగా ఉండటంతో సహస్ర బతిమాలుతుంది. అంతా మర్చిపోదాం ఇంతకు ముందులా ఉందామని అడుగుతుంది. అది ఎలా కుదురుతుంది అని అంటాడు. నువ్వు నన్ను మోసం చేశావని విహారి అంటే ముందు మోసం చేసింది నువ్వే అని సహస్ర అంటుంది. ఇద్దరి గొడవ చూసిన పద్మాక్షి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది.

Continues below advertisement

సహస్ర పెళ్లి గురించి తల్లికి చెప్తుంది. దాంతో పద్మాక్షి సహస్రని లాగిపెట్టి కొడుతుంది. విహారి నాకు నిన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చాడు.. అంటే పెళ్లి చేసుకునే తీరేవాడు. లోపు నువ్వు ఎందుకే ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్ అని కొడుతుంది. తర్వాత విహారికి సహస్ర తరఫున సారీ చెప్తుంది. విషయం యమున, భక్తవత్సలానికి చెప్పొద్దని చెప్తుంది. విషయం తెలిస్తే గొడవ అవుతుందని చెప్పి విహారిని ఒప్పించి పంపిస్తుంది. నన్ను ఎందుకు కొట్టావమ్మా అని సహస్ర అడిగితే సహస్రని లాగిపెట్టి కొడుతుంది. అంత పెద్ద విషయం జరిగితే నువ్వు డాక్టర్కి డబ్బు ఇవ్వడం ఏంటి.. అది విహారి చూడటం ఏంటి.. ఇక నుంచి ఏం జరిగినా నాకు చెప్పకుండా నీ సొంత తెలివి వాడితే నిన్ను చంపేస్తా అని అంటుంది.

సుభాష్అర్ధరాత్రి ఎవరూ చూడకుండా అంబిక దగ్గరకు వస్తాడు. అంబిక షాక్ అయిపోతుంది. నువ్వేంటి టైంలో అంటే మనిద్దరం క్రైమ్ పార్టనర్స్కాదు లైఫ్పార్టనర్స్ కూడా.. నేను పరిచయం అయినప్పటి నుంచి నువ్వు ప్రతీది నాకు చెప్పేదానివి కానీ నిన్నటి నుంచి నువ్వు ఏం చెప్పలేదు.. నన్ను ప్రేమిస్తున్నావని అనుకున్నా.. నీకు చాలా లక్ష్యాలు ఉన్నాయి కానీ నువ్వే నా లక్ష్యం నేను నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు అని అంటాడు.

Continues below advertisement

 

అంబిక సుభాష్తో నేను మా ఇంట్లో వాళ్లతో పెళ్లికి ఒప్పుకోవడం నిజం.. కానీ నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నది నిన్ను అని తన ప్లాన్ చెప్తుంది. సరే నువ్వు అనుకున్నట్లే చేద్దాం అని సుభాష్ అంటాడు. సుభాష్ వెళ్తూ ఉంటే లక్ష్మీ బయటకు వస్తుంది. లక్ష్మీని చూసిన సుభాష్ లక్ష్మీని ఎలా అయినా చంపేయాలి అని ఫ్లవర్ వాజ్తో లక్ష్మీని చంపేయాలని చూస్తే అంబిక అడ్డుకుంటుంది. దానికి ఇంకా టైం ఉంది అని సుభాష్ని ఆపి పంపేస్తుంది.

లక్ష్మీ తన జీవితం ఏంటి ఇలా అయిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. ఆదికేశవ్ కూతురి గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటాడు. అంతలోనే నా అల్లుడు అలాంటి వాడు కాదు అని తనకి తాను సర్దిచెప్పుకుంటాడు. మనసులో ఏదో అలజడి అని అనుకుంటాడు. అల్లుడు అమ్మాయి ఫోన్ కూడా చేయడం లేదు చేసినా ఇద్దరూ విడివిడిగా మాట్లాడుతున్నారు కలిసి మాట్లాడటం లేదు. ఎక్కువగా ఇండియాలోనే ఉంటున్నారు.. అసలు వాళ్ల మధ్య ఏం జరుగుతుందని ఆలోచిస్తారు. ఇంతలో రాజీ ఇంటికి వస్తుంది. రాజీ లక్ష్మీ నెంబరు అడుగుతుంది. ఆదికేశవులు లక్ష్మీ నెంబరు ఇస్తారు. రాజీ ఫోన్ చేసి కాల్ కలవకపోవడంతో వచ్చిన తెలుగు మాటల్ని బట్టీ లక్ష్మీ వాళ్లు ఇండియాలోనే ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు అని చెప్తుంది. ఆదికేశవులు చాలా టెన్షన్ పడి రమేశ్ అనే వ్యక్తికి కాల్ చేస్తాడు.

విహారి వాళ్ల ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేస్తారు. పెళ్లి చూపులకు సుభాష్పంజాబీ వ్యక్తిలా ఎంట్రీ ఇస్తాడు. కరన్సింగ్అని పంతులు పరిచయం చేస్తారు. సుభాష్ తెలుగు మాట్లాడటంలో మీకు తెలుగు వచ్చా అని అడిగితే నేను తెలుగు రాష్ట్రాల్లోనే పెరిగాను అని చెప్తాడు. అంబికను తీసుకొస్తారు. అంబిక పర్సనల్గా మాట్లాడాలి అని సుభాస్ని గదికి తీసుకెళ్తుంది. ఇద్దరూ తమ ప్లాన్కి నవ్వుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.