Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం, విహారిలు అమెరికా అని చెప్పి బయల్దేరుతారు. ఆదికేశవ్, గౌరీలు ఏడుస్తూ కూతురిని అల్లుడి చేతిలో పెట్టి జాగ్రత్తలు చెప్తారు. కనక మహాలక్ష్మీ వల్ల నాకు ఇబ్బందులు ఉండవు కానీ నా వల్లే తనకు ఇబ్బందులు పడతాయేమో అని అంటాడు. దానికి ఆదికేశవ్ మీరు దేవుడు అల్లుడు గారు మీ వల్ల నా కూతురు ఇబ్బంది పడదు అని అంటుంది. ఇక కనకంతో నీ వల్ల అల్లుడికి ఏ ఇబ్బంది పడకూడదని అంటాడు.
కనకం: ఆయనకు ఎప్పుడూ నా వల్ల ఎలాంటి సమస్య కలగకూడదని నా ప్రయత్నం కూడా నాన్న. ఆయన దారికి కానీ ఆయన జీవితానికి కానీ నేను ఎప్పుడు అడ్డు వెళ్లాలని అనుకోవడం లేదు. నేను ఏం చేసినా ఆయన సంతోషం కోసమే చేస్తాను. ఆయన్ని ఆనందంగా ఉంచడానికి ఆయన నుంచి దూరంగా ఉండటానికి కూడా నేను వెనకాడను.
గౌరీ: కనకం అవేం పిచ్చి మాటలే ఆ అమ్మవారి దయ వల్ల మీ ఇద్దరూ పది కాలాల పాటు చల్లగా ఉంటారు ఆ నమ్మకం మాకు ఉంది. మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసుండాలని మేం కోరుకుంటాం.
బామ్మ: ఇదిగో మనవడా మనవరాలు పది నెలల్లో పండండి పాపో బాబునో మాకు ఇవ్వడానికి మీరు కృషి చేయండి. ఇదిగో గౌరీ నువ్వు వాళ్లకి ఎదురురా.
ఆదికేశవ్: ఏడుస్తున్న కనకంతో జాగ్రత్తగా వెళ్లి రండి.
కనకం ఏడుస్తుంది. కనకాన్ని తల్లిదండ్రుల ప్రేమ గుర్తొచ్చి విహారి కారులో కన్నీరు పెట్టుకుంటాడు. మీ కళ్లలో కన్నీరు ఏంటి అని కనకం అడిగితే విహారి దారిలో కారు ఆపేసి బయటకు వెళ్లి నిల్చొంటాడు. కనకం కూడా దిగి విహారి దగ్గరకు వెళ్తుంది. విహారి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నారని కనకం అడుగుతుంది. నా వల్ల మా వాళ్ల వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడుగుతుంది. నా వల్లే తప్పు జరిగింది ఓ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. ఒక కుటుంబం మొత్తం అబద్ధంలో బతుకుతుందని అంటాడు. మన పెళ్లి బొమ్మల పెళ్లి అనుకున్నాం కదా బాధ పడొద్దు అని కనకం విహారికి ధైర్యం చెప్తుంది. నీ జీవితం నేను చూసుకొని వెళ్లిపోతే నువ్వు నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుందని నేను చేస్తుంది తప్పోఒప్పో తెలీడం లేదని అంటాడు.
నీ జీవితం చక్కబెడతానని విహారి అంటే దానికి కనకం మీరు మీ ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలని ఇప్పుడు మా గురించి ఆలోచిస్తే ఎవరినీ సంతోషంగా చూసుకోలేరని తన గురించి తన ఫ్యామిలీ గురించి మర్చిపోమని చెప్తుంది. కచ్చితంగా ఈ సమస్యని పరిష్కరిస్తానని నీ జీవితానికి అందమైన మార్గం చూపిస్తానని అంటాడు. మరోవైపు అంబిక విహారి గురించే ఆలోచిస్తుంది. విహారి చెప్తున్న అబద్ధం ఎలా బయట పెట్టాలా అని ఆలోచిస్తుంది. ఇంతలో సుభాష్ అంబికకు కాల్ చేసి మధ్యాహ్నం మీటింగ్ ఉందని చెప్తాడు. దాంతో అంబిక మీటింగ్ కోసం విహారి హైదరాబాద్ వస్తాడు. ఈ రోజే లక్ష్మీ కూడా వచ్చింది అంటే మనం ఊహించని ఒక కొత్త విషయం బయట పడుతుందని అంటుంది. విహారి లక్ష్మీ ఒకే చోటుకు వెళ్లుంటారా అని సుభాష్ అడిగితే అయిండొచ్చని అంబిక అంటుంది. అతి త్వరలో మనం విహారి అడ్డు తొలగించుకోవాలని అంబిక అంటుంది.
విహారిని నేల మట్టం చేసే వరకు వదలను అని అంబిక అంటుంది. ఇంతలో సహస్ర అంబిక దగ్గరకు వస్తుంది. సహస్రతో అంబిక విహారి, లక్ష్మీల గురించి చెప్తుంది. ఇద్దరూ ఒకే రోజు ఇంటి నుంచి వెళ్లారు ఒకే రోజు వస్తే కొత్త విషయం తెలుస్తుందని అంటుంది. దానికి సహస్ర బావ ఆ లక్ష్మీ మీద మనసు పారేసుకున్నాడని అనుకుంటున్నావా అని అంటుంది. దానికి అంబిక లక్ష్మీ మీ బావ మీద మనసు పారేసుకొని ఉంటుందని అంటుంది. ఇక విహారి హైదరాబాద్ వచ్చేశాడని అంబికకు కాల్ వస్తుంది. ఇక లక్ష్మీ రావడం ఇద్దరూ చూస్తారు. సహస్ర షాక్ అయిపోతుంది. ఇక నుంచి జాగ్రత్త పడు అని అంబిక సహస్రతో చెప్తుంది. సహస్ర కోపంతో ఊగిపోతుంది. లక్ష్మీ పని అయిపోయిందని అనుకొని కిందకి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: భార్య, మామల్ని దారుణంగా అపార్థం చేసుకున్న రాజు.. తండ్రిని చేరిన పసికందు!