Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తను చెప్పడం వల్లే సహస్రని పెళ్లి చేసుకున్నాడని నీ జీవితం నాశనం చేసేశానని యమున లక్ష్మీ దగ్గర ఏడుస్తుంది. మీరే కాదు నేను కూడా విహారి గారితో సహస్రమ్మని పెళ్లి చేసుకోమని చెప్పానని అందుకే ఆయన ఆ రోజు తాళి కట్టడానికి నేను ఓ కారణం నేను తలూపాను అని లక్ష్మీ చెప్పి ఏడుస్తుంది.
లక్ష్మీ ఏడుస్తూ వాళ్లిద్దరికీ ఎలా పెళ్లి జరిగినా ఆ పెళ్లి జరగడమే న్యాయం.. ఎందుకంటే మీరు అంతా కలిసి ఉండటమే విహారి గారికి కావాలి.. నా భవిష్యత్ ఏమైనా మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అంతకు మించి నాకు ఏం వద్దమ్మా అని లక్ష్మీ చెప్తుంది. యమున లక్ష్మీని పట్టుకొని ఏడుస్తుంది. అంబిక లక్ష్మీని తలచుకొని రగిలిపోతుంది. కోపంతో అద్దం కూడా పగలగొట్టేస్తుంది. లక్ష్మీ తనని చూసి ఎగతాళిగా నవ్వినట్లు ఊహించుకుంటుంది. అన్నింటికీ ఆ లక్ష్మీనే కారణం.. ఈ లక్ష్మీ నా ఆశల్ని చంపేయడానికి వచ్చిందా.. నా జీవితంలోకి వచ్చిన ప్రేమని మా అన్నయ్య చంపేశాడు.. ఈ కుటుంబం నా ప్రేమని చంపేసింది ఇప్పుడు నన్ను ఇలా తయారు చేసింది.. ముక్కలైపోయిన నా సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలి అని అనుకుంటుంది.
పండు హడావుడిగా పనులు చేస్తాడు. వసుధ, చారుకేశవ సంతోషంగా దత్తత పనులు చేస్తారు. అమ్మ అనే మాట వినలేను ఏమో అని చాలా బాధ ఉండేది కానీ లక్ష్మీ వల్ల ఇక జీవితంలో ఆ వెలతి ఉండదు అని వసుధ అంటుంది. నా కూతురి నా జీవితంలోకి వచ్చేస్తుందని చారుకేశవ చాలా సంతోషపడతాడు. నా బిడ్డ కాళ్లు కదపకుండా.. కళ్లు తడవకుండా నేను చూసుకుంటా అని చారుకేశవ, వసుధ కన్నీరు పెట్టుకుంటారు. ఆ మాటలు విన్న అంబిక మీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. మీరు అనుకున్నది జరగనివ్వను.. అసలు దత్తత అవ్వాలి అంటే ఆ లక్ష్మీ బతికుండాలి కదా అని అనుకుంటుంది.
లక్ష్మీ రెడీ అయి వస్తుంటే విహారి ఎదురుగా వెళ్లి లక్ష్మీని ఆపి లక్ష్మీని తన చేతులతో దిష్టి పట్టపగలు చీర కట్టుకొని చందమామ నేల మీదకు వచ్చింది కదా ఎవరైనా చూసి దిష్టి పెట్టకూడదు అని ఇలా దిష్టి తీశా అంటాడు. అదంతా సహస్ర చూస్తూ షాక్ అయిపోతుంది. ఇక విహారి లక్ష్మీ కాటుక తీసి దిష్టి చుక్క పెడతాడు. తర్వాత విహారి లక్ష్మీ నడుం పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. తర్వాత ఇద్దరూ ముద్దు పెట్టుకుంటారు. తీరా చూస్తే ఇదంతా సహస్ర కల. ఇది నా ఊహ అయినా ఏమైనా దాని కడుపులో నా బిడ్డ నాకు దక్కిన తర్వాత దాన్ని ఈ లోకంలో లేకుండా చేసేస్తా అని అనుకుంటుంది.
లక్ష్మీ కిందకి రావడం చూసి వసుధ, చారుకేశవ మన అమ్మాయి వస్తుంది అని దగ్గరకు వెళ్లి సంబర పడిపోతారు. ఎంత అందంగా ఉన్నాయి లక్ష్మీ అని యమున అంటే నా కూతుర్ని దిష్టి పెట్టకు వదినా అని వసుధ అంటుంది. ఇకపై ఏ కష్టం అయినా మా అమ్మాయి దగ్గరకు రావాలి అంటే నన్ను దాటుకొని పోవాలి అని చారుకేశవ అంటారు. లక్ష్మీ మన ఇంటి అమ్మాయి అయితే ఇక తనకు ఏం కష్టం ఉంటుంది అని భక్తవత్సలం అంటారు. మొదలెట్టేశారా అంటూ అంబిక అంటుంది. లక్ష్మీ అంటే ఎందుకు నీకు అంత కుళ్లు అని వసుధ అంబికను అంటుంది. మీరు ఎన్ని చేస్తారో చేయండి దేవుడు అనేవాడు అన్నీ చూస్తాడు.. ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు అని అంబిక అనేస్తుంది.
సహస్ర అంబిక దగ్గరకు వెళ్లి లక్ష్మీ దత్తత ఆపుతా అన్నావ్ కదా ఏం చేస్తావ్ అని అంటుంది. కాసేపట్లో చూస్తావు కదా దాని ప్రాణం అయినా ఆపేస్తా ఏమైనా చేయొచ్చు.. అది మాత్రం అడ్డు పడకుండా చేద్దామని అనుకుంటున్నా అని అంబిక అంటుంది. లక్ష్మీ కడుపులో తన బిడ్డ ఉండటం వల్ల సహస్ర చాలా టెన్షన్ పడుతుంది. అంబికను తన ప్లాన్ అడుగుతుంది. అంబిక చెప్పదు.. ఈ విషయం అమ్మకి చెప్పి లక్ష్మీని ఏదో ఒకలా కాపాడుకోవాలని సహస్ర మేడ మీదకు పరుగులు పెడుతుంది. విహారి మేడ మీద నుంచి కిందకి వచ్చి ప్రెగ్నెంట్ అని మర్చిపోయావా పరుగులు పెడుతున్నావ్.. నీకు ఏమైనా అయితే ముందు నన్ను తిడతారు జాగ్రత్తగా ఉండు అని అంటాడు. ఈ మధ్యే కదా బావ ప్రెగ్రెంట్ అయింది అమ్మ దగ్గరకు వెళ్లే హడావుడిలో మర్చిపోయా అంటుంది. సహస్ర పద్మాక్షి దగ్గరకు వెళ్లి అంబిక చెప్పిన విషయం చెప్తుంది. పద్మాక్షిని కూడా కిందకి తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.