Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోకపోతే తాను వెళ్లిపోతా అని హాల్లోనే బ్యాగ్‌తో ఉంటుంది. గడువు ముగియడంతో లక్ష్మీ బ్యాగ్ తీసుకొని వస్తుంది. అంబిక అందరితో మన ఇంటి పని మనిషి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి రెడీ అయింది.. ఏడ్చేవాళ్లు ఏడ్చి తనని సాగనంపండి అని అంటుంది. 

Continues below advertisement

సహస్ర తల్లితో ఏదో ఒకటి చేసి తనని ఆపు అంటుంది. దాంతో పద్మాక్షి ఇప్పుడు మనం ఏం చేసినా అంబికకు అనుమానం వస్తుందని అంటుంది. అంబిక లక్ష్మీ దగ్గరకు వెళ్లి  ఏంటి చూస్తున్నావ్ నిన్ను నీ జాలిముఖాన్ని చూసి ఎవరైనా ఆపుతారని చూస్తున్నావేమో.. ఎవరూ ఆపరు.. నువ్వు ఇంక వెళ్లు అంటుంది. దాంతో లక్ష్మీ వెళ్లిపోతూ ఉంటూ అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇంతలో భక్తవత్సలం లక్ష్మీని ఆపుతారు..

లక్ష్మీ ఆగుతుంది. ఏంటి నాన్న తనని ఆపావ్.. దారి ఖర్చులకు ఇస్తావా.. ఎండీగా చేసి తను బాగానే వెనకేసుకుంది అని అంబిక అంటుంది. భక్తవత్సలం లక్ష్మీని పిలుస్తారు. ఇలాంటి మంచి మనషి మన జీవితాల్లోకి వచ్చి మనల్ని బాగు చేసి మన దగ్గర ఆశ్రయం పొందుతుంటే తనని పంపేయడం మంచిది కాదు అని అంటారు. అంబిక ఒప్పుకోదు. తనని ఆశ్రయం ఇవ్వడానికి తను ఈ ఇంటికి చుట్టం కాదు.. తనకి ఈ ఇంటితో ఏం సంబంధం లేదు అని అంటుంది. ఏం సంబంధం లేనప్పుడు తన మనల్ని చాలా సార్లు కాపాడింది కదా అప్పుడు ఏం సంబంధం ఉన్నట్లు అని అడుగుతాడు. ఏ తల్లి కన్న బిడ్డో మనకి తనకి ఏం సంబంధం లేకపోయినా మనకు ఎంతో సాయం చేసింది. అలాంటి అమ్మాయికి మనకి బంధం బంధుత్వం లేదు అంటున్నావ్ కదా.. అని భక్తవత్సలం వసుధ, చారుకేశవల దగ్గరకు వెళ్లి ఇద్దరి చేతులు పట్టుకొని దేవుడు మీకు పిల్లలు ఇవ్వలేదు అని చాలా సార్లు బాధ పడుంటారు..ఇక మీరు బాధ పడాల్సిన అవసరం లేదు.. చారు కేశవని మార్చి ప్రయోజకుడ్ని చేసింది లక్ష్మీనే.. వసుధ నువ్వు చేసిన నోముల్నీ ఫలించాయి.. లక్ష్మీని ఇంటి నుంచి దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. అందుకే మీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నా.. లక్ష్మీ పరాయిది అని ఇంట్లో వాళ్లే కాదు బయట వాళ్లు అనుకుంటున్నారు.. దానికి సమాధానమే నా నిర్ణయం అని అంటారు.

Continues below advertisement

లక్ష్మీని పిలిచి వసుధ, చారుకేశవ చేతుల్లో పెట్టి లక్ష్మీ ఈ ఇంటి బిడ్డ అవ్వాలి.. లక్ష్మీని మీరు దత్తత తీసుకుంటారా.. మీ కూతురిగా చేసుకుంటారా అని అడుగుతాడు. అంబిక, సహస్ర, పద్మాక్షి షాక్ అయిపోతారు. మిగతా వాళ్లు సంతోషపడతారు. ఏం  మాట్లాడుతున్నారు నాన్న అని అంబిక అంటుంది. వసుధ మాత్రం లక్ష్మీ లాంటి బిడ్డను ఇస్తాను అంటే మేం ఎందుకు వద్దు అంటాం అని అంటారు. పద్మాక్షి మనసులో ఏం మాట్లాడలేను.. ఏం అనలేను.. ఇలాంటి పరిస్థితిలో పడేశాడు ఆ దేవుడు అని అనుకుంటుంది. సహస్ర తల్లితో ఏంటమ్మా రేపటి నుంచి అది నాతో సమానంగా ఈ ఇంట్లో తిరుగుతుందా అని అంటుంది. 

లక్ష్మీతో విహారి ఇక నుంచి నిన్ను పరాయిదాయి అనేవాళ్లు ఉండరు అని అంటుంది. అంబిక ఇంటి నుంచి వెళ్లిపోతా అని అంటుంది. ఎవరు ఎంత చెప్పినా వినకుండా అంబిక గుమ్మం దాటుతుంటే లక్ష్మీ ఆపుతుంది. లక్ష్మీ దగ్గరకు వెళ్లి మీరు దయచేసి వెళ్లకండి అని అంటుంది. నీ మాట నేను ఎందుకు వినాలి అని అంటుంది. దానికి లక్ష్మీ మీరు ఒక్క అడుగు బయటకు పెట్టినా రిజిస్టేషన్ దగ్గర జరిగిన వీడియో బయట పెడతా.. సుభాష్‌తో మీరు చేసింది చెప్తా అప్పుడు మిమల్ని అందరూ గెంటేస్తారు. మీరు వెళ్తా అంటే ఇప్పుడే మొత్తం చెప్పేస్తా అంటుంది. అందరూ చూస్తూ ఉంటే లక్ష్మీ దయచేసి ఇంట్లోకి రండి అని దండం పెడుతుంది. దాంతో అంబిక ఇంట్లోకి వస్తుంది. 

అంబిక పద్మాక్షితో నీకు లక్ష్మీని అక్క దత్తత తీసుకోవడం ఇష్టమేనా అంటే హా ఇష్టమేనే దానికి పిల్లలు లేరు కదా అని అంటుంది. అంబిక మనసులో ఈ దత్తత ఆగిపోయేలా చేస్తా అని అనుకుంటుంది. విహారి లక్ష్మీ గురించి తాతతో మాట్లాడుతాడు. లక్ష్మీ మనకు చాలా సాయం చేసింది అందుకే ఇలా చేశా అంటారు. విహారి తాతకి థ్యాంక్స్ చెప్తాడు. విహారి చాలా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇంట్లో ఒక్కో స్థానం నీకు దక్కుతుంది లక్ష్మీ త్వరలోనే నువ్వు నా మనిషివి అని అందరికీ చెప్తా అని అనుకుంటాడు. 

లక్ష్మీని చూసి పిలిచి నువ్వు నాకు దూరంగా వెళ్లాలి అనుకున్నావ్ కదా.. కానీ వెళ్లలేవు.. దత్తత అయిపోతే నువ్వు ఇక ఈ ఇంటి మనిషివే.. నా నుంచి ఎక్కడికీ వెళ్లలేవు అని అంటాడు. చారుకేశవ వచ్చి విహారి ఇక నుంచి తను ఎక్కడికి వెళ్తాను అంటే తండ్రిలా వెతికి నేను  తీసుకొస్తారా అని అంటాడు. చారుకేశవ, వసుధ చాలా సంతోషపడతారు. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. విహారి కావేరిని పిలిచి కావేరి నిన్ను హాస్టల్‌లో చేర్పిస్తా పద అని అంటాడు. అన్నయ్యా నేను ఏమైనా తప్పు చేశానా.. ఇక్కడే ఏదో పని చేసుకొని ఉంటాను అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.