Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode రత్నబాబు ఎవరినో కలవడానికి వెళ్తే కనకం, చారుకేశల వెనకాలే ఫాలో అవుతారు. ఇంట్లో విహారితో అంబిక ఆఫీస్‌కి వెళ్లలేదా ఎందుకు ఈ మధ్య సరిగా వెళ్లడం లేదు అని అంబిక అడుగుతుంది. సహస్ర మనసులో ఆ ప్రకాశ్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి బావ కాపలా కాస్తున్నాడు అనుకుంటుంది.
ఎలక్షన్స్ గురించి విహారి చెప్తే మనం మన స్థాయి ఏంటి అవసరమా అని పద్మాక్షి ఎలక్షన్ గురించి అడిగితే దాని వల్ల ఏంతో సేవ చేయొచ్చు అని కొంత మంది మన వెనకు ఉంటారు. మనం చేసిన సేవ పుణ్యం ఎక్కడికీ పోదు అంటాడు. యమున కూడా విహారికి సపోర్ట్ చేస్తుంది. అంబిక లక్ష్మీని పిలుస్తుంది. లక్ష్మీ ఎక్కడికో వెళ్లిందని సహస్ర అంటుంది. విహారి లక్ష్మీకి కాల్ చేస్తాడు.
లక్ష్మీ, చారుకేశవలు రత్నబాబు వచ్చిన చోటుకి వస్తారు. రత్నబాబు ఎక్కడికి వస్తాడో ఎవర్ని కలుస్తాడో మనకు సాక్ష్యం కావాలి కదా అని వీడియో తీస్తుంది. ఇంతలో కాల్ చేస్తే కట్ చేస్తుంది. బిజీగా ఉందని విహారి చెప్తే అంబిక పక్కకు వెళ్లి రత్నబాబుకి కాల్ చేస్తుంది. లక్ష్మీ ఇంట్లో లేదు అంటే మీ దగ్గరకు వచ్చుంటుంది. తనతో జాగ్రత్త అని చెప్తుంది. రత్నబాబు మొత్తం చూసే టైంకి లక్ష్మీ వాళ్లు దాక్కుంటారు. తర్వాత రత్నబాబు ఇద్దరు విదేశీయులను కలుస్తారు. రత్నబాబు వాళ్లతో డీల్ కుదుర్చుకోవడం రాత్రి కలుస్తానని అనడంతో మొత్తం లక్ష్మీ వీడియో తీస్తుంది. లక్ష్మీ ఉన్న చోట సౌండ్ రావడంతో రత్నబాబు తన రౌడీలను పంపిస్తాడు. లక్ష్మీ వాళ్లు తప్పించుకుంటారు. ఎలా అయినా ఆ డీల్‌ని సాక్ష్యాలతో పట్టుకోవాలని అనుకుంటారు.
లక్ష్మీ, చారుకేశవ ఇంటికి వెళ్తారు. విహారి బయటే ఉంటాడు. లక్ష్మీ చారుకేశవతో విహారి గారు నా కోసమే ఎదురు చూస్తున్నారు మొన్న కూడా నేను కనిపించలేదని చాలా గొడవ చేశారు అంటే చారుకేశవ నేను కవర్ చేస్తా అంటాడు. ఆఫీస్‌కి వెళ్తామని చారుకేశవ అంటాడు. ఇంతలో ప్రకాశ్ వచ్చి లక్ష్మీని బాగా కష్టపెడుతున్నావ్ డబుల్ శాలరీ ఇవ్వు అని అంటాడు. విహారి ప్రకాశ్ గొంతు పట్టుకొని ఈ సారి మా మాటల మధ్యలోకి వస్తే చంపేస్తా అంటాడు. లక్ష్మీ, పండు, చారుకేశవ, వసుధలు రత్నబాబు విషయంలో ఏం చేయాలా అర్థం కావడం లేదని అనుకుంటారు. లక్ష్మీ అందరికీ ప్లాన్ చెప్తుంది. రిస్క్ కదా అని అంటే అయినా చేయాలి అని లక్ష్మీ అంటుంది. లక్ష్మీ వసుధతో ఈరోజు మీరు నాలా నా గదిలో పడుకోండి అని చెప్తుంది. చారుకేశవ, లక్ష్మీ, పండు ముగ్గురు రాత్రి 7 గంటలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు.
లక్ష్మీ రాత్రి బయటకు వెళ్లాలని అనుకుంటే ప్రకాశ్ లక్ష్మీ దగ్గరకు వచ్చి ఏంటి విహారితో కలసి నన్ను బెదిరిస్తున్నావ్ అంటాడు. నిన్ను రాళ్లతో కొట్టి చంపాలని అంటాడు. ఎక్కువ చేస్తే మీ ఇద్దరి గుట్టు నా దగ్గర ఉంది మీ నాన్నకి చెప్పనా.. ఈ ఇంట్లో చెప్పనా మీ నాన్నకి చెప్తే అదే నీకు చివరి మాట అదే అవుతుందని అని అంటాడు. లక్ష్మీ కొట్టడానికి చేయి ఎత్తితో ప్రకాశ్ పట్టుకొని నాతో జాగ్రత్త అంటాడు. ఇంతలో విహారి వచ్చి ప్రకాశ్ గొంతు నులిపేసి లక్ష్మీ చేయి పట్టుకుంటావా అని అంటాడు. ప్రకాశ్ సారీ చెప్పి బయటకు వెళ్లి ప్లవర్ వాజ్‌తో తల మీద కొట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.