Nindu Manasulu Serial Today Episode విశ్వనాథ్ గారు పెట్టిన పరీక్ష అందరితో పాటు ప్రేరణ, సిద్ధూ రాస్తారు. ఇద్దరూ తాము సెలక్ట్ అవ్వాలని కోరుకుంటారు. విశ్వనాథ్ వచ్చి ప్రతీ సారి పరీక్ష పెట్టి ఒకరిని సెలక్ట్ చేస్తా ఈ ఏడాది మాత్రం ఎప్పుడూ జరగనట్లు ఆశ్చర్యకరంగా రిజల్ట్స్ వస్తాయి. ఈ సారి ఇద్దరికీ సమానంగా మార్కులు వచ్చాయని చెప్తారు. ఇద్దరూ సెలక్ట్ అయిన కూడా ఆ ఇద్దరిలో ఒకరికే కోచింగ్ ఇస్తాను అని చెప్తారు.
సెలక్ట్ అయిన వారిలో ప్రేరణ, సిద్ధూ సెలక్ట్ అయ్యారని చెప్తారు. ఇద్దరూ చాలా సంతోషంతో ఒకరికి ఒకరు కంగ్రాట్స్ చెప్పుకుంటారు. మిగతా అందర్ని పంపేస్తారు. విశ్వనాథం సిద్ధూ, ప్రేరణలతో మీ ఇద్దరిలో నేను ఎవరికి కోచింగ్ ఇవ్వాలో మీరే నిర్ణయించుకోండి నేను ఈలోపు నా భార్యకి భోజనం పెట్టి వస్తానని అంటారు. మరోవైపు ఇందిర గణ ఇంట్లోకి పని మనిషిలా వెళ్లాలి అంటే ఇప్పుడున్న పనిమనిషిని తప్పించాలని అనుకుంటుంది. గేటు బయట పని మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సుధాకర్ అక్కని వెళ్లిపోదామని బతిమాలుతాడు. కాసేపు సైలెంట్‌గా ఉండు అని ఇందిర చెప్పి ముసుగు, తాడు తీస్తుంది. అవి చూసిన సుధాకర్ వణికిపోతాడు. ఏంటే నీ ప్లాన్ ఆ రాక్షసుడు వస్తే చంపేస్తాడే అని అంటాడు.
పని మనిషికి ముసుగు వేసి తల మీద కొట్టి తాడుతో కట్టి ఇద్దరూ తీసుకెళ్లిపోతారు. ఇక విశ్వనాథ్ తన భార్యకి భోజనం కలిపి తినిపిస్తారు. మీకు సేవలు చేయాల్సిన నేను మీతో సేవలు చేయించుకుంటున్నా అని బెడ్ మీద కదల్లేని స్థితిలో ఉన్న విశ్వనాథ్ భార్య మహాలక్ష్మీ ఏడుస్తుంది. భార్యకి సేవ చేయడం అదృష్టమని విశ్వనాథ్ తినిపిస్తాడు. మరోవైపు సిద్ధూ ప్రేరణ ఇద్దరూ ఒకర్ని ఒకరు ఒప్పించాలని ప్రయత్నిస్తారు.
ప్రేరణ: హలో విశ్వనాథ్ గారి దగ్గర కోచింగ్ తీసుకోవడం నాకు చాలా అవసరం. సిద్ధూ: నీకు అవసరం ఏమో నాకు తప్పని సరి. ఆకలితో మాడిన కడుపు, నిద్ర లేని రాత్రులు ఇలా నేను చాలా కష్టాలు పడ్డాను. కష్టం విలువ నాకు తెలుసు. ప్రేరణ: సీటు కోసం నీ కష్టాలు చెప్పుకుంటున్నావా. అబద్ధాలు చెప్తున్నావా అని అడుగుతుంది. ఇద్దరూ నువ్వు వేరే దగ్గర కోచింగ్ తీసుకో అంటే నువ్వు తీసుకోఅంటారు. నీకు రిక్వెస్ట్ చేస్తున్నా సీటు వదిలేయ్ అని ప్రేరణ అంటుంది. సిద్ధూ: నేను వదులుకోలేను.
ఐఏఎస్ కావాలి అన్నది మా నాన్న కల నాకు అవకాశం వదిలేయ్ అంటుంది. నాది జీవితం నేను వదలను అని సిద్ధూ అంటాడు. నీకు అమ్మానాన్నల మీదే ఇష్టం లేదు నువ్వు వేస్ట్ నీకు సీటు వేస్ట్ అని వదిలేయ్ అని ప్రేరణ అంటుంది. మీ నాన్న కలని నీ కల అంటున్నావ్ రేపు ఆయన నీకు పెళ్లి చేయడం కల అంటే వదిలేసి వెళ్లిపోతావ్ అదేదో ఇప్పుడే వెళ్లిపో అని సిద్ధూ అంటాడు. నా కల చంపకు అని ప్రేరణ అంటే నీది కల మాత్రమే నాది జీవితం అమ్మాయిలకు కల ఒకటే ఉండదు అని అంటాడు. అమ్మాయిల్ని అలా అనకు అని మంచి మనసు ఉంటే అర్థం చేసుకొని ఇవ్వు లేదంటే లేదు కానీ పెళ్లి పేరంటాలు నీకు ఎందుకయ్యా అని ప్రేరణ ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. ఎందుకు అలా రెచ్చిపోతున్నావ్ అని సిద్ధూ అడుగుతాడు. తండ్రి అంటే కూతుళ్ల మీద తన కల రుద్దడం కాదు కూతురి కళ నెరవేర్చాలి మీ నాన్నకి అంత సీన్ లేనట్లుంది. నిన్ను కలెక్టర్‌ని చేసి ఆ డబ్బుతో బతకాలి అనుకుంటున్నాడా అని సిద్ధూ అంటాడు. మానాన్న గురించి తప్పుగా మాట్లాడకు అని అందరూ నీలా ఉంటారా అందరు తల్లిదండ్రులు నిన్ను పెంచినట్లు పెంచరు అని ప్రేరణ అంటుంది. దానికి సిద్ధూ నీ ఫ్యామిలీని ఒక్క మాట అంటే నీకు కోపం వస్తే ఆ రోజు మీ ఫ్రెండ్ పెళ్లిలో నన్ను నా ఫ్యామిలీని తిట్టావ్ అప్పుడు నాకు మండదా అని అడుగుతాడు. ఇద్దరూ నీకు సంస్కారం లేదు అంటే నీకు లేదు అని తిట్టుకుంటారు. ఇద్దరూ తప్పుకోమంటే తప్పుకోమని మొండికేస్తారు.
ఇంతలో విశ్వనాథం వచ్చి నిర్ణయం చెప్పమని అంటే ఇద్దరూ సీట్ వదలము అంటారు. దాంతో విశ్వనాథ్ ఇద్దరికీ 3 రోజుల గడువు ఇస్తారు. ఈలోపు నిర్ణయించుకోమని అంటారు. సిద్ధూ వెళ్లిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు ప్రేరణతో అతను లేకపోయి ఉంటే నువ్వే కదా టాపర్‌వి అతన్ని నువ్వే రికమండ్ చేశావ్ అంటే వాళ్ల బాధ చూడలేక మానవత్వంతో సాయం చేశానని అంటుంది. రేపు అతను తప్పుకోకపోతే ఏం చేస్తావ్ అని ఆయన అడిగితే ఎలా తప్పుకోడో నేను చూస్తానని ప్రేరణ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.