Meghasandesam Serial Today Episode: డాన్స్ అకాడమీ ఓపెనింగ్‌లో ఎవరి బిజీలో వాళ్లుంటే అపూర్వ, నక్షత్రను పక్కకు తీసుకెళ్లి శివ గురించి ఎంక్వైరీ చేయమన్నాను చేశావా అని అడుగుతుంది. చేశాను మమ్మీ అని చెప్తుంది నక్షత్ర.
నక్షత్ర: తను ఒక అనాథ. వాడి పేరు శివ అంట. చదువుకోవాలని ఆసక్తి కనబరిస్తే బావ చేరదీశాడట. బావ గ్రేట్ కదా మమ్మీ.
అపూర్వ: అవును అవును.. చాలా గ్రేట్.. ( మనసులో అంటే ఆ శివనే తన తమ్ముడు అని భూమి, గగన్ కు చెప్పకుండా దాచేసింది అన్నమాట. ఈ పాయింట్‌లో భూమిని దెబ్బ కొట్టడానిక మనకు ఏదైనా ఉపయోగపడొచ్చు.)
నక్షత్ర: అవును మమ్మీ.. ఈ శివ గురించి నన్నెందుకు ఎంక్వైరీ చేయమన్నావు.
అపూర్వ: మన శత్రువులో ఎవరు దగ్గరగా కనిపించినా..? మనం వాళ్ల గురించి ఎంక్వైరీ చేయాలి నక్షత్ర.
నక్షత్ర: ఏంటో మమ్మీ బావను శత్రువులా ఫీల్ అవ్వాలంటే బాధగా ఉంది. చెర్రిగాడు కట్టిన తాళి నా మెడలోంచి తెగి.. గగన్ బావ ఫ్రెష్‌గా నా మెడలో తాళఙ కట్టాడు అనుకో.. అప్పుడు మనం మిత్రులం అయిపోవచ్చేమో..?
అపూర్వ: నక్షత్ర పబ్లిక్‌లో ఉన్నప్పుడు మనం ఇలా మాట్లాడకూడదు. ఎవరైనా వింటే బాగోదు. పెళ్ళి అయిపోయిన నువ్వే ఆ గగన్ గాడి గురించి ఆంత ఆశ పడితే ఇక పెళ్లి కాని ఆ భూమి ఇంకెంత ఆశ పడుతుంది చెప్పు.
నక్షత్ర: అయినా భూమికి ఉదయ్‌తో పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా..?
అపూర్వ: ఫిక్స్ మాత్రమే అయింది. ఇంకా పెళ్లి కాలేదు కదా..? చూస్తుంటే ఆ ఉదయ్ గాణ్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం దానికి లేనట్టు ఉంది. ఆ గగన్ గాడి దగ్గర మార్కులు కొట్టేయడానికే చూస్తుంది అది.
నక్షత్ర: నో మమ్మీ.. అది బావ దగ్గర మార్కులు కొట్టేయడానికి వీల్లేదు.
అపూర్వ: ఏమీ లేదే పిచ్చిదానా..? మీ డాడీ ఉదయ్‌తో ఈ ఆడిటోరియం ఓపెన్ చేయిద్దామన్నాడు. అంతకంటే ముందు ఈ ఆడిటోరియం నువ్వే ఓపెన్ చేయాలని మీ గగన్ బావను ఒప్పించింది ఆ భూమి. ఉదయ్‌తో కాకుండా ఆ గగన్‌తోనే ఆడిటోరియం ఓపెన్ చేయిస్తానని నాతో చాలెంజ్ కూడా చేసింది. చాలెంజ్‌లో అది నెగ్గితే మనం గగన్ దగ్గర మాట పడమా..?
నక్షత్ర: నో మమ్మీ అది చాలెంజ్ లో నెగ్గడానికి వీల్లేదు. నువ్వే నెగ్గాలి. ఈ ఆడిటోరియం ఓపెన్ చేయిస్తానని చెప్పి మాట తప్పినందుకు బావ దాన్ని అసహ్యించుకోవాలి. దాని కోసం నువ్వే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి.
అపూర్వ: చేశాను నక్షత్ర ఈ చాలెంజ్‌లో నేనే గెలిచేలా చేశాను.
నక్షత్ర: ఏం చేశావు నక్షత్ర..
అపూర్వ: అది..
అంటూ ఆగిపోయి. దీనికి చెప్పకపోవడమే మంచిది అని మనసులో అనుకుని ఏదో ఒకటి చేశానులే అది అమలైన వెంటనే నీకు తెలుస్తుందిగా అని చెప్తుంది అపూర్వ. తర్వాత డాన్స్ అకాడమీ ఓపెనింగ్ సెరమనీలో మాట్లాడిన నక్షత్ర తాను కూడా త్వరలోనే వెస్ర్టన్ డాన్స్ అకాడమీ పెడుతున్నట్టు ప్రకటిస్తుది. దీంతో శరత్ చంద్ర కోపంగా ఇంటికి వస్తాడు. అందరి ముందు నక్షత్రను పిలిచి తిడతాడు.
శరత్: తోడబుట్టిన దానికి పోటీగా వెస్ట్రన్ డాన్స్ స్కూల్ పెడతానని నలుగురి మధ్య ప్రకటిస్తావా..? నా శోభ ఆశయానికి నువ్వు అడ్డుగోడలా నిలబడ్డట్టు అవుతుంది.
అపూర్వ: ఇద్దరికీ ఒకే పాటకి డాన్స్ పోటీ పెడదాం. అందులో ఎవరు గెలిస్తే వాళ్లే డాన్స్ స్కూల్ నడిపిస్తారు.
అని అపూర్వ చెప్పగానే మొదట ఒప్పుకోని శరత్ చంద్ర తర్వాత అపూర్వ మాటలకు కన్వీన్స్ అయి సరే అంటాడు. దీంతో ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. ఇద్దరూ పాటలకు డాన్స్ చేస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!