Brahmamudi Serial Today Episode:  రేవతితో ఫోన్‌ లో మాట్లాడిన అపర్ణ తర్వాత రాజ్‌ ఇంటికి రావాలంటే స్వరాజ్‌ ద్వారా రప్పించాలని అంటుంది. దీంతో ఇందిరాదేవి కూడా అవును అదంతా నేను చూసుకుంటాను అని చెప్తుంది. మరోవైపు రుద్రాణి, యామినికి కాల్‌ చేస్తుంది.

రుద్రాణి: యామిని నీకో బాంబ్‌ బ్లాస్ట్‌ అయ్యే న్యూస్‌.. ఆ కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్‌..

యామిని: ఏంటి రుద్రాణి గారు మీరు చెప్పేది.. కావ్య ప్రగ్నెంటా..?

రుద్రాణి: అవును నాకు ఇందాకే తెలిసింది. అందుకే నీకు వెంటనే ఫోన్‌ చేశాను.

యామిని: గుడ్‌ వెరీ గుడ్‌ ఆఫర్‌ కోసం ఎదురుచూస్తున్న వాడికి బంఫర్‌ ఆఫర్‌ దొరికింది. రుద్రాణి గారు. కావ్య కడుపుకు కారణం బావే అన్న విషయం బావకు తెలియదు. ఆ కావ్యకు నిజం చెప్పే అవకాశం లేదు.  ఆ కావ్యను ఇరికించడానికి భలే చాన్స్‌ దొరికింది రుద్రాణి గారు. వెంటనే ఈ విషయం బావకు చెప్పి ఇక పూర్తిగా బావను నావాణ్ని చేసుకుంటాను.

రుద్రాణి: తొందరపడకు యామిని కాస్త ఓపిక పట్టు..

యామిని: ఏమంటున్నారు రుద్రాణి గారు నాకు అర్థం కావడం లేదు.

రుద్రాణి:  ఆ కావ్య కడుపుతో ఉన్న విషయం నువ్వు చెప్పడం కన్నా ఆ కావ్యే చెప్పేటట్టు చేయాలి. అప్పుడు ఆ కావ్య తీసుకున్న గోతిలో అదే పడుతుంది.

యామిని: అదెలా

రుద్రాణి:  కావ్యపై ధాన్యలక్ష్మీకి కోపం వచ్చేలా చేయాలి. అందుకోసం కావ్య అప్పుకు పని చెప్పేటట్టు చేయాలి. అప్పుడు కావ్యను ధాన్యలక్ష్మీ తిడుతుంది. ఆ ఆవేశంలో కావ్య నిజం చెప్తుంది. కావ్య నిజం చెబితే రాజ్‌ మనసు విరిగిపోతుంది. వెంటనే రాజ్‌ను నువ్వు మచ్చిక చేసుకోవచ్చు

యామిని: థాంక్స్‌ రుద్రాణి గారు వెంటనే మీ ప్లాన్‌ ఎగ్జిక్యూట్‌ చేయండి.

అంటుంది యామిని మరోవైపు ఇంద్రాదేవి రాజ్‌కు ఫోన్ చేసి కావ్యకు దగ్గరయ్యే అవకాశం వచ్చిందని స్వరాజ్‌ను తీసుకుని ఇంటికి రమ్మని చెప్తుంది. దీంతో రాజ్ నిజమే కదా అనుకుంటూ హ్యాపీగా ఉంటాడు. ఇంతలో యామిని వస్తుంది.

యామిని: ఏమైంది బావ ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు

రాజ్‌: ఆ కళావతికి దగ్గరయ్యే మంచి అవకాశం వచ్చింది.

యామిని: ఇంకా ఎన్ని రోజులు ఇలా దగ్గరయ్యే చాన్స్‌ దొరికింది అనుకుంటూ సంతోషపడతావు బావ..  ఎప్పుడు తనతో శాశ్వతంగా ఉంటావు

రాజ్‌: యామిని తనతో పాటు ఉండిపోవాలని తనతో జీవితాన్ని పంచుకోవాలని నాకు ఆత్రుతగానే ఉంది. కానీ ఆ టైం రావాలి కదా

యామిని: నాకు ఎందుకో ఆ టైం వచ్చినా కలావతి కావాలనే అలా చేస్తుందేమో అనిపిస్తుంది బావ.

రాజ్‌: ఏమంటున్నావు యామిని

యామిని: ఒక ఆడపిల్లగా మరో ఆడపిల్ల మనసును నేను అర్థం చేసుకోగలను బావ. కళావతి నీతో రావడం ఇష్టం లేకనే అలా నిన్ను అవైడ్‌ చేస్తుందని నాకు అనిపిస్తుంది బావ

రాజ్‌: ఆలోచిస్తుంటే.. నువ్వు చెప్పింది కూడా నిజమేమో అనిపిస్తుంది యామిని ఒకసారి ఇలా కూడా చెప్పి ట్రై చేస్తాను. తనకు ఇక్కడకు రావడం ఇష్టం లేకపోతే నేనే అక్కడ ఉంటానని చెప్తాను.  నిజంగా తనకు నా మీద ప్రేమ ఉంటే తన ఇంట్లో కూడా చోటిస్తుంది

యామిని: ( మనసులో) నీకు అది చోటివ్వడం కాదు బావ. శాశ్వతంగా ఆ కళావతి నీకు దూరం అయ్యే ప్లాన్‌ చేశాను

అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతుంది యామిని. కావ్య కిచెన్‌లో పని చేస్తుంటే అపర్ణ, ఇందిరాదేవి వచ్చి తిడతారు. కావ్యను పూజకు రెడీ కమ్మని చెప్తారు. అప్పు కూడా వచ్చి చెప్తుంది. వెంటనే కావ్య వెళ్లిపోతుంది. అంతా గమనించిన రుద్రాణి వెళ్లి ధాన్యలక్ష్మీని తీసుకొచ్చి అందరూ కలిసి నీ కోడలికి అన్యాయం చేస్తున్నారు నీ కోడలి చేత వంట చేయిస్తున్నారు అంటూ రెచ్చగొడుతుంది. ధాన్యలక్ష్మీ కోపంగా రుద్రాణిని తిట్టి వెళ్లిపోతుంది. అందరూ పూజ దగ్గర ఉండగా రాజ్‌, స్వరాజ్‌ను తీసుకుని వస్తాడు. అపర్ణ ఆశ్చర్చపోయినట్టు నటిస్తుంది. ఇంతలో కావ్య రెడీ అయి రాగానే రాజ్‌ అలాగే చూస్తుండిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!