Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ప్రకాశ్ లక్ష్మీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేయాలని చాలా ప్రయత్నిస్తాడు కానీ పాస్ వర్డ్ తెలీక ఏం చేయలేకపోతాడు. ఎలా అయినా పాస్ వర్డ్ కనుక్కోవాలని అనుకుంటాడు. విహారి లక్ష్మీ భర్తగా ప్రకాశ్ రావడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మీ సిల్క్ కోపరేటివ్‌ బ్యాంక్ ఎలక్షన్ ఫైల్స్ అందిస్తుంది. 

లక్ష్మీ వెళ్లిపోతుంటే విహారి లక్ష్మీ చేయి పట్టుకొని ఆపుతాడు. ఇంట్లో ఇంత జరుగుతున్నా ఎలా ఉంటున్నావ్ ఆఫీస్ పని కూడా చేసేస్తున్నావ్ అని అడుగుతాడు. దాంతో లక్ష్మీ ముందు మనం సిల్క్ కార్పొరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పదవి ఎలక్షన్స్ మీద ఫోకస్ చేద్దాం తర్వాత ఆప్రకాశ్ వాళ్లు గురించి ఆలోచిద్దామని అంటుంది. లక్ష్మీ వ్రతం చేసినప్పటి నుంచి చూస్తున్నా నువ్వేదో దాస్తున్నావ్ అని నాకు అర్థమైంది అది  ఏంటో చెప్పు అని అడుగుతాడు. లక్ష్మీ యమున ఇచ్చిన విడాకుల పేపర్ల గురించి ఆలోచిస్తుంది. విహారితో మాత్రం ఏం లేదని చెప్తుంది. విహారి లక్ష్మీ చేయి పట్టుకొని నీకు ఇచ్చిన మాటను వదలను నీ చేతిని వదలను అని అంటాడు. అన్నీ కాలం ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతాయి అని చెప్తుంది. 

ప్రకాశ్ ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే నాతో చెప్పు అని విహారి అంటాడు. వాడు నా జోలికి రాడు వస్తే ఏమవుతుందో వాడికి తెలుసు అని లక్ష్మీ అంటుంది. ప్రకాశ్ రాత్రి లక్ష్మీ వర్క్ చేస్తుంటే వెళ్లి కనకం ఎంత సేపు వర్క్ చేస్తావ్ ఈ టైం వరకు ఎందుకు వర్క్ చేస్తున్నావ్ కదా నీ జీతం ఎంత అని అడుగుతాడు. నేను నీ భర్తని కదా చెప్పు అని ప్రకాశ్ అంటే చంపేస్తా అని లక్ష్మీ  అంటుంది. వద్దు వద్దులే అని ప్రకాశ్ లక్ష్మీతో పడుకుందామా అని అంటాడు. లక్ష్మీ కోపంగా చూస్తుంది. బెడ్‌కి నువ్వు ఇటు పడుకో నేను అటు పడుకుంటా అని బెడ్ మీద పడుకుంటాడు. దాంతో ప్రకాశ్ వీపునకు మేకులు గుచ్చి కెవ్వు మంటాడు. ఇక్కడ పడుకోవడం సేప్ కాదు అని బయట సోఫా మీద పడుకుంటానని వెళ్తాడు. పండు ప్రకాశ్‌తో బాగా అయింది కదా అని అంటాడు. మా చెల్లి జోలికి వస్తే చంపేస్తా అంటాడు. దాంతో ప్రకాశ్ ఈ లక్ష్మీకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందే అని అనుకుంటాడు. 

ప్రకాశ్ బయట పడుకోవడం పద్మాక్షి, అంబిక, సహస్రలు ఏమైంది అని అడిగితే మాకు కొంచెం టైం కావాలి లక్ష్మీకి నేను ఇంకా అలవాటు కాలేదు కదా అని అంటాడు. సహస్ర వాళ్లకి ఏదో ఒకటి సర్ది చెప్తాడు. ఉదయం విహారి వచ్చి లక్ష్మీని లేపుతాడు. ప్రకాశ్‌ని చూసి బాగా నిద్ర పట్టిందా దోమలు వీపునకు కుట్టాయా అని అడుగుతాడు. అందరూ కావాలనే నన్ను టార్గెట్ చేశారని ప్రకాశ్ అనుకుంటాడు. ఇక అంబిక వచ్చి విహారికి ఎలక్షన్ గురించి అడుగుతుంది. పోటీ చేస్తున్నా అని విహారి అంటే అంబిక పాలిటిక్స్ అవసరమా అంటుంది. అవసరమే అని లక్ష్మీ అంటుంది. మీకు నచ్చింది చేసుకో అని అంబిక అనేసి వెళ్లిపోతుంది.

ప్రకాశ్ కూడా ఆఫీస్‌కి వస్తానని అంటాడు. సరే రారా అని విహారి తీసుకెళ్తాడు. ఏమీ తెలీని లక్ష్మీకే ఎండీ పోస్ట్ ఇచ్చావు అంటే నాకు సీఈవో పోస్ట్ ఇస్తావు కదా అంటాడు. నీకు అంత కంటే పెద్ద పోస్ట్ ఇవ్వాలి అంటాడు. ఇక విహారి ప్రకాశ్‌ని మాటల్లో పెట్టి ప్రకాశ్ ఫోన్ మోడల్ చూస్తానని అడిగి తీసుకుంటాడు. ఇక లక్ష్మీ ప్రకాశ్ పర్సు అడిగి అలాంటిదే విహారి గారు అడిగారు ఒకసారి చూపించు అని పర్సు తీసుకుంటుంది. ప్రకాశ్ చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఫోన్, పర్సు తీసుకొని ప్రకాశ్‌ని కింద వదిలేసి కారు పోనిస్తాడు. ప్రకాశ్ కారు వెనక పరుగెడతాడు. సాయంత్రం వీలైతే ఇంట్లో కలుద్దాం.. నువ్వు చేసిన మోసానికి ఇది సాంపిల్ మాత్రమే అని అంటారు. మొత్తానికి ప్రకాశ్‌ని సీటీ చివర వదిలేస్తారు.  మరోవైపు అంబికను సిల్క్ కోపరేటివ్ ప్రస్తుత డైరెక్టర్‌ కలుస్తాడు. తనకు సాయం చేయమని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.