Nindu Manasulu Serial Today Episode సిద్ధూ, ప్రేరణ ఒకే ఆటోలో కోచింగ్ ఇచ్చే రిటైర్డ్ ఆఫీసర్‌ విశ్వనాథం ఇంటికి వస్తారు. ఆటో అతనికి ప్రేరణ 50 సిద్ధూ వంద ఇస్తే చిల్లర లేదని ఆటో అతను ఇద్దరికీ 60 అయిందని సిద్ధూకి పది రూపాయలు అడిగి వంద తీసుకోకుండా ఇరవై రూపాయలు ప్రేరణకు ఇవ్వమని అంటాడు. 

సిద్ధూ ప్రేరణకి వంద ఇస్తే ప్రేరణ నాకేం అవసరం లేదు నా పేరు చెప్పుకొని బన్ కొనుక్కొని టీలో ముంచుకొని తిను అని అంటుంది. దానికి సిద్ధూ ఏంటండీ నన్ను మీరే పోషిస్తున్నట్లు మాట్లాడుతారు. ఇప్పటికే మీకు ఇవ్వాల్సిన ఆరు వందలు అప్పు పడిపోయాను..ఆ పాపం చుట్టుకొని వెంటే తిరుగుతుంది వద్దన్నా మీతోనే  తిరగాల్సి వస్తుంది అని అంటాడు. నన్నే పాపం అంటావా అని ప్రేరణ సిద్ధూతో గొడవ పడుతుంది. ఇంతలో గతంలో సిద్ధూ, ప్రేరణల డ్రాయింగ్ వేసిన పరాంకుశం వస్తాడు. డ్రాయింగ్ కొనమని చెప్తాడు. అర్జెంటుగా వెళ్లిపో లేకపోతే చంపేస్తా అని ప్రేరణ అంటుంది. మీరు ఇది కొనే వరకు ఇంకో పెయింట్ వేయను అని అంకుశం పరాంకుశం అంటాడు. పరాంకుశం ఇద్దరినీ డ్రాయింగ్ తీసుకోమని చెప్పడంతో ఇద్దరూ అతన్ని కొడతారు. ఎలా అయినా మీతో డ్రాయింగ్ కొనిపిస్తా అని అనుకుంటాడు. 

ఇక సిద్ధూ లోపలికి వెళ్లడం మొత్తం పీఏ చూసి అన్నీ విజయానంద్‌కి తగిలిస్తాడు. ఇక ప్రేరణ సిద్ధూ తన వెనక రావడం చూసి నీకు ఇదే పనా అని ప్రేరణ అడిగితే ఇదే ఫుల్ టైం పని పార్ట్ టైంగా బైక్ డ్రైవింగ్ చేస్తానని అంటాడు. ప్రేరణ మిస్ అండర్ స్టాండ్ చేసుకుందని తెలిసి మేడం మిస్ అండర్‌ స్టాండింగ్‌ అని తనేం ఫాలో అవ్వడం లేదని అంటాడు. ప్రేరణ వెళ్లి పోయిన తర్వాత ఏంట్రా బాబు మన పని మనం చేసుకున్నా ఇలా అనుకుంటున్నారు అని సిద్ధూ అనుకుంటాడు. 

రంజిత్‌కి టైంకి అన్నీ వండి పెట్టాలని అనడంతో ఐశ్వర్య కిచెన్‌లో ఫోన్ చూసి వంటల ప్రోగ్రాం పెడుతుంది. ఇంతలో సుధాకర్ వస్తాడు. సునామీ ఏం చేస్తున్నావే అంటే ఐశ్వర్య విషయం చెప్తుంది. మాడిపోయిన కూర చూసి ఇది మాత్రం ఆయనకు పెట్టకే నిజంగానే రాక్షసుడు అయిపోతాడు అని అంటాడు. ఇక మీ అమ్మ ఏది అని అడిగితే ఎవరినో కలవడానికి వెళ్లిందని చెప్తుంది. ఎవరినో ఏంటే మీ నాన్ననే కలవడానికి వెళ్లుంటుందని అనుకుంటాడు. ఇక ప్రేరణ లోపలికి వెళ్లి అప్లికేషన్‌ నింపుతుంది. ఇక సిద్ధూ కూడా అప్లికేషన్ అడిగి అక్కడ చాలా మందిని చూసి ఒక్క సీటు కోసం ఇంతమంది పోటీ పడుతున్నారా అని అనుకుంటాడు. ప్రేరణ పక్కకి సిద్ధూ వెళ్తే ఏంటి ఫాలో అవుతున్నావ్ అని అడుగుతుంది. నిన్ను ఫాలో అవ్వడమే నాకు పనా నేను అప్లికేషన్ నింపడానికి వచ్చానంటే ప్రేరణ నవ్వుతూ ఇది సివిల్స్ కోచింగ్ కోసం అది కూడా ప్రిలిమ్స్ పాస్ అయినవాళ్లు మెయిన్ కోచింగ్ కోసం ఇలా వచ్చారని అంటుంది. నేను అందుకే వచ్చానని అంటే నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావా అని ప్రేరణ షాక్ అయిపోతుంది. 

ప్రేరణ అప్లికేషన్ నింపుతూ నీ ముఖం చూస్తే నమ్మాలి అనిపించడం లేదు అని అంటుంది. నీ ముఖం చూస్తే నాకు అనిపించడం లేదు అయినా నమ్మడం లేదా అని అంటాడు. అందరూ అప్లికేషన్స్ ఇస్తారు. మరోవైపు ఇందిర ఈశ్వరిని తీసుకొని ఈశ్వరి ఇంటికి వస్తుంది. ఇందిర బామ్ తీసుకురావడానికి వెళ్తుంది. ఇంతలో గణ వస్తాడు. ఏమైంది అని అడిగితే ఈశ్వరి విషయం చెప్తుంది. ఇక గణ ఇందిరని చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఈవిడే సాయం చేసి ఇంటి వరకు తీసుకొచ్చిందని ఈశ్వరి చెప్తుంది. దాంతో గణ ఇందిరని అనుమానంగా చూసి నువ్వు ఆ టైంకి అక్కడేం చేస్తున్నావ్ నువ్వే పడేలా చేశావా అని అడుగుతాడు. ఇందిర షాక్ అయిపోతుంది. ఇదేం అన్యాయం బాబు నాకేంటి అవసరం నేను ఎందుకు అలా చేస్తాను అని అంటుంది. అందర్ని అనుమానిస్తావ్ ఏంట్రా వదిలేయ్ అని ఈశ్వరి అంటుంది. నీ పేరు ఏంటి అని అడిగితే గంగ అని చెప్తుంది. దాంతో గణ నువ్వు ఎవరు ఎక్కడ నుంచి వచ్చావ్ ఇలా అన్నీ డిటైల్స్ అడిగితే ఈశ్వరి వదిలేయ్‌రా ఆవిడ భయపడుతుంది. ఆవిడను సుధాకర్ తీసుకొచ్చాడని అంటుంది. ఇంతలో సుధాకర్ వచ్చి అక్కని చూసి బిత్తరపోతాడు. గణ సుధాకర్‌ని ప్రశ్నిస్తే ఈశ్వరి వదిలేయ్‌రా వెళ్ల అని అంటుంది. 

ప్రేరణ వాళ్లు విశ్వనాథం గారి దగ్గరకు వస్తారు. అందరూ కూర్చొని ఉంటారు. ప్రేరణ సిద్ధూని చూసి నిజంగానే నువ్వు పాస్ అయ్యావా అంటే సిద్ధూ ప్రేరణకు దండం పెడతాడు. ఇక  విశ్వనాథం వచ్చి అప్లికేషన్లు చూసి ఆనంద్, వర్ధిని, సిద్ధూలను బయటకు వెళ్లిపోమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.