Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ భర్తని నేనే అంటూ విహారి ఫ్రెండ్ ప్రకాశ్ ఇంటికి వచ్చి అందరితో చెప్తాడు. సాక్ష్యాలు చూపిస్తాడు. దాంతో లక్ష్మీ ప్రకాశ్ భార్యనే అని అందరూ అనుకుంటారు. సహస్ర అందరితో తన భర్త లక్ష్మీకే తెలీదు కదా మనం ఎంత ఇబ్బంది పెట్టాం అని అంటుంది. 

పద్మాక్షి లక్ష్మీతో లక్ష్మీ నీ భర్త గురించి ఎప్పుడు అడిగినా లేడు అన్నావ్ కానీ అసలు ఎవడో తెలీదు అని చెప్పలేదు అని అంటుంది. ప్రకాశ్ మంచోడు పైగా విహారి ఫ్రెండ్ కాబట్టి లక్ష్మీ గురించి మనకు ఏం టెన్షన్ లేదు అని సహస్ర ప్రకాశ్‌ని లక్ష్మీని తీసుకెళ్లమని అంటాడు. ప్రకాశ్ అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. లక్ష్మీని ఇన్ని రోజులు చూసుకున్నందుకు థ్యాంక్స్‌ విహారి అని చెప్పి లక్ష్మీ తీసుకెళ్తాడు. ఇంతలో విహారి ప్రకాశ్‌ని ఆపుతాడు. నవ్వుతూ ప్రకాశ్ భుజం మీద చేయి వేసి ఎక్కడికి వెళ్తావ్‌రా అని అడుగుతాడు. ఇంకెక్కడికి రా కొన్ని రోజులు ఇండియాలో ఉండి తర్వాత అమెరికా వెళ్తాం అని అంటాడు. 

విహారి నవ్వుతూ ప్రకాశ్ చెవిలో గుమ్మం దాటావు అంటే నీ శవమే వెళ్తుందిరా అని వార్నింగ్ ఇచ్చి అందరితో వీడు నా బెస్ట్ ఫ్రెండ్ వీడికి ఇంకెవరూ లేరు వీళ్లిద్దరికీ మనమే ఉన్నాం కదా అని అంటాడు. చచ్చినట్లు ప్రకాశ్ ఇక్కడే ఉంటానని అంటాడు. పండు ప్రకాశ్ బ్యాగ్ పట్టుకొని మీరు మా లక్ష్మీమ్మ భర్తనా అయితే మీకు మర్యాదల్లో ఏ లోటు ఉండదు అని అంటాడు. ఇక విహారి అయితే వెళ్లరా వెళ్లి రెస్ట్ తీసుకో అన్నీ నేను తిరగ్గా మాట్లాడుతా అని అంటాడు. 

విహారి బయట కోపంగా ఉంటే పండు, చారుకేశవ, వసుధలు వస్తారు. చారుకేశవ ప్రకాశ్‌ని చంపేస్తానని  అంటాడు. పండు కూడా చంపేద్దాం అంటాడు. విహారి ఆపి ముగ్గురితో లక్ష్మీకి నాకు పెళ్లి అవ్వడానికి మేం ఇన్ని అవస్థలు పడటానికి కారణమే ఆ ప్రకాశ్ గాడు. అని మొత్తం చెప్తాడు. మూమూలుగా ఆ ప్రకాశ్ నా ముందుకి రావడానికే భయం కానీ వచ్చాడు అంటే ఏదో జరుగుతుంది. వాడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు కానీ ఇలాంటి పని చేయలేడు కానీ ఇలా చేశాడు అంటే వాడి వెనక ఎవరో ఉన్నారు.. అది తెలుసుకోవాలి అని అంటాడు. ఈ లోపు లక్ష్మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే అని వసుధ అడిగితే వాడికి అంత సీన్ లేదు లక్ష్మీ జోలికి వస్తే నేనేం చేస్తానో వాడికి తెలుసు అని అంటాడు. 

మరోవైపు యమున ప్రకాశ్ నిజంగా లక్ష్మీ భర్త ఏనా.. మరి అలా అయితే విహారి నా కళ్ల ముందే లక్ష్మీ మెడలో తాళి కట్టాడు. అసలు లక్ష్మీ తన పెళ్లి మోసం వల్ల జరిగింది అని చెప్పింది ఆ మోసం ఏంటి.. అసలేం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదే అనుకుంటుంది. ఇక లక్ష్మీ కూడా  ప్రకాశ్ ఏ ఉద్దేశంతో వచ్చాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సహస్ర లక్ష్మీ దగ్గరకు వస్తుంది. లక్ష్మీ అని సహస్ర ప్రేమగా పిలుస్తుంది. ఏంటి ఇలా ప్రేమగా మాట్లాడుతున్నా అనుకున్నావా.. నీ గురించి తెలీక నీ భర్త గురించి తెలీక అలా మాట్లాడాను. ఇక నుంచి నీతో అలా మాట్లాడను. నువ్వు అయినా చెప్పాల్సింది నీ భర్త ఎవరో నీకే తెలీదు అని అంటుంది. 

విహారి దూరంగా చూడటం చూసి రా బావ లోపలికి అంటుంది. ఇక ప్రకాశ్ వచ్చి పద బావ లోపలికి వెళ్దాం అని అంటాడు. విహారి కోపంగా చూసే సరికి రా విహారి అంటాడు. ఇక సహస్ర విహారితో ప్రకాశ్ మన వాడే పైగా మంచోడు కాబట్టి ఇక నుంచి లక్ష్మీని నా సొంత అక్కలా చూసుకుంటా అని అంటుంది. అది మంచిదే సహస్ర అని విహారి అంటాడు. వాళ్లిద్దరి మధ్యలో మనం ఎందుకు బావ పద అని సహస్ర అంటే నేను నా ఫ్రెండ్‌తో మాట్లాడి వస్తా అని విహారి అంటాడు. ప్రకాశ్‌ని కొట్టబోతే ప్రకాశ్ అడ్డుకొని హ్యాండిల్ విత్ కేర్ మామ అని అంటాడు. దాంతో విహారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపి పాతేస్తా..  నీ వెనక ఎవరో ఉన్నారు నీ కథ మొత్తం తేల్చుతా అని అంటాడు. 

ప్రకాశ్ లక్ష్మీతో ఏంటి ఎండీ అయ్యావంట జీతం ఎంత  అని అడుగుతాడు.లక్ష్మీ కోపంగా ఎక్స్‌ట్రాలు చేస్తే విహారి గారు పాతేస్తా అన్నారు నేను అయితే ఇక్కడే తగల బెట్టేస్తా అంటుంది. దాంతో ప్రకాశ్ వద్దులే అని అంటాడు. అంబిక, పద్మాక్షిలు లక్ష్మీ గురించి మాట్లాడుతారు. మొత్తానికి దాని భర్త వచ్చేశాడులే అనుకుంటారు. ఇంతలో ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి వచ్చి లక్ష్మీ ల్యాప్‌టాప్, ఫైల్స్  తీసుకురమ్మని చెప్పిందని అంటాడు. పద్మాక్షి అంబికతో అబ్బో మేడం గారు వర్క్ ఫ్రం హోం అంట అని అంటుంది. సుభాష్ అంబికకు కాల్ చేసి విహారి సిల్క్ బోర్డ్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నట్లు చెప్తాడు. ప్రకాశ్ ఎదురుగానే లక్ష్మీకి రాజు వచ్చి ల్యాప్ట్యాప్, ఫైల్స్ ఇస్తాడు. లక్ష్మీ వర్క్ చేయడం చూసిన ప్రకాశ్ ఎండీ కదా ఎన్ని బాధ్యతలో డబ్బు కూడా బాగా వస్తుంది అన్నీ ఆ ల్యాప్ టాప్ చూస్తే తెలుస్తుంది అనుకుంటాడు. ఇంతలో లక్ష్మీకి వసుధ పిలవడంతో వెళ్తుంది. ప్రకాశ్ లక్ష్మీ ల్యాప్ ట్యాప్‌కి పాస్ వర్డ్ వేయడం చూసి లక్ష్మీ పేరు విహారి పేరు ఇలా రకరకాలు ట్రై చేస్తూ ఉంటాడు. పాస్ వర్డ్ తప్పు అని వస్తుంది. ఎలా అయినా పాస్ వర్డ్ కనుక్కోవాలి అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.