Illu Illalu Pillalu Serial Today Episode వేదవతిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు రామరాజు వేదవతి చేయి పట్టుకొని సారీ చెప్తాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు వాటేసుకుంటారు. నర్మద, ప్రేమ చాలా సంతోషపడతారు. తర్వాత వేదవతి తొలి పంట ధాన్యానికి పూజ చేస్తుంది.

ప్రేమ నర్మదతో ఈ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా.. నా కారణంగా విడిపోయిన వాళ్లు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని బాధ పడ్డాను ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అక్క అని అంటుంది. అత్తయ్యకి ఉన్న ఇంకో బాధ కూడా మనం దూరం చేస్తే అత్తయ్యా ఇంకా సంతోషంగా ఉంటారు అంటుంది నర్మద. ఏంటి అక్క అది అని ప్రేమ అడిగితే ఇంటి పెత్తనం అని చెప్తుంది. దానికి ప్రేమ ఆ వల్లి ఊపిరి పీల్చుకోకుండా బతుకుతుంది కానీ ఇంటి తాళాలు లేకుండా బతకలేదు. అంత తేలికగా ఇస్తుందా అని అంటుంది ప్రేమ. అది ఇవ్వదు మనం ఇచ్చేలా చేయాలి అని నర్మద అంటుంది. ఎలా అక్కా అని ప్రేమ అంటే ఎదురింటిలో దొంగ పడ్డాడని అని మనం అనుకున్నాం కానీ మన ఇంటిలో పడిన దొంగ గురించి ఆలోచించలేదు.. మన ఇంటికి వచ్చిన దొంగ ఆ వల్లీ వాళ్ల నాన్నే అని నా అనుమానం అని నర్మద అంటుంది. ఎలా అక్క అని ప్రేమ అంటే బీరువా తాళాల వల్ల.. ఆ వల్లి రాత్రి కూడా తాళాలు పక్కనే పెట్టుకుంటుంది. కానీ రాత్రి ఆ తాళాలు దొంగ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదో గూడు పుటాని జరిగింది అని అంటుంది. 

ప్రేమ అక్కతో అవును అక్క ఇప్పుడు అర్థమవుతుంది. అసలు కూతురి పుట్టిన రోజుకి వస్తే ఆయన దొంగలా గెటప్ వేసుకొని రావడం ఏంటి అని అంటుంది. ఇద్దరూ షాక్ అయి వల్లీ తనంతట తానే తాళాలు ఇచ్చేలా చేయడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందని ప్రేమకి ప్లాన్ చెప్తుంది. ఆనంద్‌ రావు ఓ చోట ఉండటం చూసి నర్మద కావాలనే దొంగ దొరకేశాడు ప్రేమ అని అరుస్తుంది. ప్రేమ కూడా అరుస్తూ దొంగ దొరికేశాడా ఎవరు అని అడుగుతుంది. ఇద్దరి కేకలకు ఆనంద్‌ రావు చాటుగా దాక్కుంటాడు. ప్రేమ, నర్మదలు ఇద్దరూ దొంగ ఇడ్లీ బాబాయ్‌నే వల్లి వాళ్ల నాన్నే రాత్రి వచ్చిన దొంగ అని అంటుంది. దబాయించేసి నేను కాదు అని నమ్మించేయాలి అని అనుకుంటాడు. దాంతో నర్మద దొంగ కాళ్లు నేను చూశాను మీ కాళ్లు దంగ కాళ్లు సేమ్ సేమ్ అని అంటుంది. దొంగ హైట్ మీ హైట్ సేమ్ టూ సేమ్ పొట్ట కూడా సేమ్ అని అంటారు. 

ప్రేమ ఆనంద్రావుతో దొంగలా వచ్చింది మీరే అయితే మీకు ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటాం అని అంటారు. నా మీదకు రాకుండా చూసుకుంటాం అని చెప్తున్నారు కదా ఏం చేద్దాం అని ఆలోచిస్తాడు. వీళ్లని నమ్మకూడదు అని అనుకుంటాడు. నర్మద ప్రేమతో పర్లేదులే   ప్రేమ సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే పోలీసులు కనిపెడతాడు. అప్పుడు వల్లీకూడా దొరికిపోతుంది. వల్లీ ఎందుకు దొరికిపోతుంది అని ఆనంద్ అడిగితే అత్తయ్య దగ్గర ఉండాల్సిన తాళాలు వల్లీ దగ్గర ఉన్నాయి కాబట్టి వల్లీకి ప్రమాదమే అదే తాళాలు అత్తయ్య దగ్గర ఉంటే వల్లీకి ఏం ప్రాబ్లమ్ రాదు కదా అని అంటారు. వల్లీ దగ్గర తాళాలు ఉన్నన్ని రోజులు తిప్పలు తప్పవు అని అంటారు. ఆనంద్ రావు ఆలోచనలో పడతాడు. ఇద్దరూ తమ ప్లాన్ సక్సెస్ అని అనుకుంటారు. 

వల్లి తల్లితో సమయానికి వచ్చి కాపాడావు అమ్మా అంటుంది. ఇంతలో ఆనంద్ రావు వచ్చి దొంగతనానికి వచ్చింది నేనే అని నర్మద, ప్రేమలకు ఫుల్లుగా డౌట్ వచ్చేసిందని చెప్తాడు. తల్లీకూతుళ్లు షాక్ అయిపోతారు. వాళ్లు నీకు భయపెట్టడానికి అలా అన్నారు అని భాగ్యం అంటే.. ఇంటి బయట వీధిలో సీసీ కెమెరాలు ఉన్నాయంట వాటిని పోలీసులకు ఇస్తారంట అని చెప్తాడు. ఇంటి బయట సీసీ కెమెరాలు లేవే అని శ్రీవల్లి అంటే ఇప్పుడు మనం అంత మాట్లాడుకోవాల్సిన టైం లేదు ముందు మా బీరువా తాళాలు ఇచ్చేద్దాం పద అంటాడు. దానికి వల్లి నాన్న గారండీ వీటి కోసం చాలా కష్టపడ్డాను నేను ఇవ్వను నాన్న గారు అంటారు. దాంతో ఆనంద్ రావు అమ్మడు ఇవి నీ దగ్గర ఉంటే నీ కాపురం కూలిపోద్దే ఇప్పటికే ఈ తాళాలు దొంగ చేతికి ఎలా వచ్చాయని డౌట్ వచ్చిందని అంటాడు. భాగ్యం కూడా తాళాలు ఇచ్చేయమని అంటుంది. ఇద్దరూ తాళాలు ఇచ్చేయమని వల్లీ తీసుకెళ్తారు. 

వల్లీ ఇంట్లో అందరిని పిలిచి ఇంటి తాళాలు అయిష్టంగా అత్తకి ఇస్తుంది. నాకు ఎందుకమ్మా తాళాలు ఇస్తున్నావ్ అని వేదవతి అడిగితే నేను జైలుకి వెళ్తానని అని ఆనంద్ రావు నోరు జారిపోతాడు. అందరూ షాక్ అయిపోతారు. ఏమన్నారు బావగారు అని రామరాజు అడిగితే భాగ్యం అదేం లేదు అని కవర్ చేస్తుంది. నా కూతురు చిన్న పిల్ల దానికి ఇంకా ఇంటిని చూసుకునే అంత జ్ఞానం లేదు వదినగారి దగ్గర ఉంటేనే మంచిది అంటుంది. ఇంతలో నర్మద వచ్చి బాబాయ్ గారు జైలు అని అన్నారు అంటుంది. ప్రేమ కూడా నాకు వినిపించింది అంటుంది. దాంతో భాగ్యం జైలు కాదు ఇళ్లు అని కవర్ చేస్తుంది. మీ అత్త గారికి తాళాలు ఇవ్వమని భాగ్యం అంటుంది. వల్లి ఇస్తుంది ఇంతలో నర్మద ఆపి ఒక్క నిమిషం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.