Nuvvunte Naa Jathaga Serial Today August 12th  దేవా మిథున కోసం మల్లెపూలు తీసుకొస్తాడు. ప్రేమతో తీసుకొచ్చావా? మామూలుగా తీసుకొచ్చావా? నా మీద ప్రేమతోనే తీసుకొచ్చానని చెప్పు దేవా అని కొంటెగా అడుగుతుంది. దేవా మనసులో నీ కోసం ప్రేమతోనే తీసుకొచ్చా మిథున కానీ నేను చేసిన తప్పుల వల్ల నేను నీకు చెప్పలేకపోతున్నా అని అనుకుంటాడు.

మిథున కూడా మనసులో నువ్వు నా కోసం ప్రేమతోనే తీసుకొచ్చావని నాకు తెలుసు దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీతోనే చెప్పిస్తా అని  అనుకుంటుంది. మిథున వాటిని తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టేస్తుంది. దేవా మిథునతో నీ కోసం తీసుకొస్తే అలా దేవుడి దగ్గర పెట్టేశావ్ అని అడుగుతాడు. దాంతో మిథున నువ్వు నా కోసం ఎందుకు తెచ్చావో చెప్తే నేను అప్పుడు తీసుకొని నీ చేతితో నా తలలో పెట్టుంచుకునేదాన్ని అంటాడు. మిథున మనసులో నీతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పించుకుంటా అని అనుకుంటుంది. ఇక దేవా అయితే నువ్వు పువ్వులు పెట్టుకుంటే మురిసిపోవాలి అనుకున్నా కానీ ఏంటి మిథున ఇలా చేశావ్ అని అనుకుంటాడు.

ఆదిత్య ఫుల్‌గా మందు తాగుతూ ఏరా మిథునని ప్రేమిస్తున్నా అని చెప్తావా.. ప్రాణం పోయే చివరి వరకు తన చేయి వదలవా అయితే నేనేం చేయాలిరా.. నా ప్రాణానికి ప్రాణం అయిన మిథున చేయి నువ్వు వదలను అంటే నేనేం చేయాలిరా.. మిథునని ప్రాణంగా ప్రేమించానురా.. నువ్వు మా మధ్య లోకి రాకపోయి ఉంటే మిథున నా భార్య అయ్యేది. నా భార్య మిథునతో నేను హ్యాపీగా ఉండేవాడిని ఇప్పటికీ ఎప్పటికీ ఈ జన్మకి మిథున నా భార్యరా.. మా మధ్యలోకి వచ్చిన వాళ్లని ఈ భూమ్మీద ఉండనివ్వను. అని గన్ తీసి దేవాని చంపేయాలని ఆదిత్య అనుకుంటాడు. 

దేవా బయట నుంచి వచ్చేసరికి మిథున ఇంట్లో అందరితో సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి దేవా నవ్వుకుంటాడు. మిథున చూసి ఒకర్ని ఒకరు చూస్తూ ఉంటారు. చూస్తూన్న చూస్తూనే ఉన్నా.. అని సాంగ్ వేసుకుంటారు. వస్తున్నా వచ్చేస్తున్నా అని ఆదిత్య గన్‌ తీసి బయల్దేరుతాడు. మిథున దేవాని చూడటం అలంకృత చూసేసి అక్కని ఆటపట్టిస్తుంది. ఇంతలో హరివర్ధన్ వస్తాడు. దేవా, హరివర్ధన్ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దేవా మామని చూసి కంగారు పడి వెళ్లిపోబోతూ పడిపోతుంటే హరివర్ధన్ పట్టుకుంటాడు. తర్వాత దేవా భుజం తట్టి వెళ్లిపోతాడు. మిథున చాలా సంతోషిస్తుంది. అలంకృత అయితే అక్క నాన్నని బావ మీద కోపం పోయింది అని సంబర పడిపోతుంది. 

మిథున, దేవాలు నీ వల్లే నీ వల్లే అంటూ సాంగ్ వేసుకుంటారు. ఇద్దరూ క్యూట్‌గా ఒకర్ని ఒకరు చూసుకొని నీవే నీవే వెలుగుల వెన్నెలవే అంటూ సాంగ్ పాడుకుంటారు. అలంకృత అక్కని అక్కా ఎక్కడున్నావ్ అక్కా అని ఆటపట్టిస్తుంది. ఇంతలో ఆదిత్య వచ్చి దేవా పక్కనే నొల్చొంటాడు. ఆదిత్యతో దేవా నువ్వు ఎప్పుడు వచ్చావ్ భయ్యా అంటే నీతో మాట్లాడాలి అని ఆదిత్య అంటాడు. ఇక త్రిపుర, రాహుల్‌లు హరివర్ధన్లో సాఫ్ట్ కార్న్ ఉందని వెంటనే వాడిని తరిమేయాలని అనుకుంటాడు. తింగరి ఇంటి పత్రాలు కొట్టేసి తాకట్టు పెట్టిందో లేదో అని సూర్యకాంతానికి కాల్ చేసి అడుగుతుంది. వెంటన కాంతం భర్తని తండ్రి గదిలోకి పంపిస్తుంది. శ్రీరంగం ఇంటి డాక్యుమెంట్స్ కొట్టేస్తాడు. 

దేవా ఆదిత్యతో భయ్యా మాట్లాడాలి అని పిలిచావ్ గంట అయింది ఒక్క మాట మాట్లాడలేదు ఏంటో చెప్పు అని అడుగుతాడు. నాకు మిథున కావాలి భయ్యా.. మిథున లేకుండా నేను బతకలేను.. నా మిథునని నాకు వదిలేయ్ అంటాడు. మిథున నా భార్య నా భార్యని నన్ను వదిలేయ్ అంటావ్ ఏంటి బుద్ధి లేకుండా అని దేవా అంటాడు. మిథునకు నీకు అసలు పెళ్లే జరగలేదు.. నువ్వు బలవంతంగా తాళి కట్టావ్. కానీ మా పెళ్లికి వేదపండితులు ముహూర్తాలు పెట్టారు. అందరూ మమల్ని భార్యాభర్తల్లా చూశారు. తన నా భార్య అని అంటాడు. దేవా ఆదిత్యతో హే ఆపు నా భార్యని నువ్వు నా భార్య అంటుంటే నేను వినలేకపోతున్నా అని అంటాడు. దానికి ఆదిత్య నువ్వు నా భార్యని నా భార్య అని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నా అని అంటాడు. నువ్వు తనని నన్నే తీసుకెళ్లమని చేతకాని వాడిలా ఉంటావేంటి అని నన్నే తిట్టావ్ మరి ఇప్పుడు నువ్వు ఇలా మాట మార్చేసి డబుల్ గేమ్ ఆడితే ఎలా అని ఆదిత్య అడుగుతాడు. నీ మాటకు నువ్వు మాట మార్చేసి మనసు మార్చుకొని మిథున కావాలి అంటే నేను రోడ్లు పట్టుకొని పిచ్చోడిలా తిరగాలా అంటాడు. ఏంటి భయ్యా ఇలా మాట్లాడుతున్నావ్ నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది ఏంటి భయ్యా అని అంటాడు. దాంతో ఆదిత్య ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడం అంటే ప్రాణం పోవడమే.. రెండు రోజుల్లో నా భార్య కావాల్సిన భార్య మెడలో నువ్వు తాళి కట్టి మిథునని లాక్కెళ్లిపోయావ్ ప్రాణం లేకుండా అయినా బతకగలను కానీ మిథున లేకుండా బతకలేను. నా మిథునని నాకు వదిలేయ్ అంటాడు ఆదిత్య. తను నా మిథున కేవలం నా మిథున అని దేవా అంటాడు. ఎంత డబ్బు కావాలి అని ఆదిత్య అడుగుతాడు. దేవా ఆదిత్య కాలర్ పట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.