Nindu Manasulu Serial Today Episode గణ విజయానంద్‌ని తన పోస్ట్ కోసం బతిమాలడానికి వస్తాడు. ఇంటి బయట పీఏని చూసి మనసులో ఒక సారి అవమానించిన వాడి ఇంటికి మళ్లీ మళ్లీ రావడం కంటే చింతల బస్తీ సంతలో చీకులు అమ్ముకోవడం బెస్ట్ కానీ ఏం చేస్తాం అవసరం అని అనుకుంటాడు. పీఏని అడిగి విజయానంద్ దగ్గరికి వెళ్తాడు.
విజయానంద్: మొత్తానికి తిరిగి డ్యూటీలో జాయిన్ అయినట్లు ఉన్నావే.. ఇంతకీ ఎందుకు వచ్చావ్.గణ: అన్నీ తెలిసి ఇలా ఎందుకు మాట్లాడుతారు సార్.విజయానంద్: నాకేం తెలీదే.గణ: సార్ నా పోస్ట్ నాకు ఇవ్వకుండా నన్ను ట్రాఫిక్‌లోకి పంపారు.విజయానంద్: అరే అలా అయింది అదేంటి అలా అయింది. ఇలా అయింది అని నాకు నువ్వు చెప్తే తప్ప తెలీలేదే. గణ: సార్ నాకు తిరిగి నా జాబ్ ఇప్పించండి సార్. మీరు అనుకుంటే అవుతుంది. విజయానంద్: నేను అనుకోలేదు అంటావా. ఎంత మాట. నీకోసం నేను చాలా కష్టపడ్డానో నీకు తెలీదు కదా ఉండు మినిస్టర్‌తో మాట్లాడుతా నువ్వు విందుకు గానీ అని చెప్పి మినిస్టర్‌కి కాల్ చేసి గణకి ట్రాఫిక్ ఇచ్చారు ఏంటి అని అడుగుతాడు. అక్కడ కూడా ఎస్‌ఐనే వాడి మీద కంప్లైంట్స్ ఉన్నాయి.. కొన్ని రోజులు ఉండమని చెప్పు కుదిరితే చూద్దాం. ట్రాఫిక్లో తృప్తి పడమను అని అంటాడు. విజయానంద్ గణతో ట్రాఫిక్‌లో తృప్తి పడు సమయం చూసి నీ పోస్ట్ నీకు ఇప్పిద్దాం. గణ: అంతేనా సార్.విజయానంద్: నా వల్లే కదా నీకు ఈ పోస్ట్ అయినా వచ్చింది. కంటిన్యూ అయిపో.గణ: అయిపోతా సార్ అయిపోతా.విజయానంద్: నేను నీకు చేసిన సాయానికి నా రుణం నువ్వు తీర్చుకోవాలి. గణ: భలే వారు సార్ తప్పకుండా మీ రుణం తీర్చుకోకుండా నేను విశ్రాంతి తీసుకోను. ఉంటాను సార్.పీఏ: అదేంటి సార్ అతను మీ కాళ్ల దగ్గరకు వచ్చి మోకరిల్లినా కూడా బాదుతూనే ఉంటారు.విజయానంద్: వీడు మన మాట వినాలి అంటే ట్రాఫిక్‌లో వేసి బాదుతూనే ఉండాలి. కుక్కలకు అన్ని ముక్కలు ఒక్కసారి వేయాలి. అదే మనుషులకు అయితే ఒక్కో ముక్క విసురుతూ ఉండాలి. అప్పుడే విసిరేవాడి విలువ వాడికి తెలుస్తుంది.
ఐశ్వర్య ఇల్లంతా ఒత్తుతుంటే రంజిత్ వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతాడు. మీకు మతిమరుపా అని అడుగుతుంది. మీ ఇంటికి అద్దెకి వచ్చిన వాళ్లు ప్రతీ రోజు పరిచయం చేసుకోవాలా అని అంటే అద్దెకి వచ్చారా అని రంజిత్ గుర్తు చేసుకుంటాడు. రూల్స్ మర్చిపోయారు అని రంజిత్ అంటే రూల్ రూల్ అని మమల్ని రోటిలో వేసి రుబ్బుతున్నారని అంటుంది. రూల్ ప్రకారం 5 నిమిషాల్లో కాఫీ తీసుకొని రా అని రంజిత్ చెప్తే ఐశ్వర్య తల బాదుకొని అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలిలా అయిపోయింది నా బతుకు అని అనుకుంటుంది.
గణ ట్రాఫిక్ ఎస్‌ఐలా డ్యూటీలో జాయిన్ అయి యూనిఫాం చూసుకొని చిరాకుపడతాడు. ఇక ప్రేరణ అటుగా రావడం చూసి నిన్నంటి వరకు ఎలా ఉండే వాడిని అంతా తారు మారు చేశావు కదనే అని అనుకుంటాడు. ప్రేరణ బుక్ చేసుకున్న బుకింగ్ అతని బైక్ ఆపుతాడు. ప్రేరణ వాళ్లని అవమానిస్తాడు. రోడ్డున పడ్డారు అని మాట్లాడుతాడు. ప్రేరణ బండి అతనికి డబ్బు ఇచ్చి విలువ లేని మాటలు పడే టైం నాకు లేదు అని అంటుంది. గణ ప్రేరణకు అర్థమయ్యేలా నాకు తక్కువ అంచనా వేస్తే జీవితాంతం రోడ్డన పడాల్సి వస్తుంది అంటాడు. ఇలా ఎగిరెగిరి పడే ఎక్కడో బతకాల్సిన వాడివి ఇక్కడ పడ్డావ్. అయినా రోడ్డున పడింది ఎవరో అర్థమైంది కదా అని వెళ్లిపోతుంది. గణ రగిలిపోతాడు.
ఇక సిద్ధూ కూడా అటుగా వస్తాడు. కాగితాలు అడుగుతాడు. సిద్ధూ అన్నీ ఇస్తాడు. ఈ రోడ్డులో ఇంత స్పీడ్ వెళ్లకూడదు అని సిద్ధూతో గొడవ పడతాడు. సిద్ధూ కుమార్‌కి కాల్ చేసి అడ్రస్ చెప్పి బైక్ వదిలేసి వెళ్లా తీసుకెళ్లురా అంటాడు. గణతో ట్రాఫిక్ రూల్స్ మీకు కొత్త నాకు కాదు ముందు అది తెలుసుకో అని అంటాడు. మరోవైపు ఇందిర మార్కెట్‌కి వచ్చిన ఈశ్వరిని చూసి ఆయన్ను దగ్గరుండి చూసుకోవాలి అంటే ఆ ఇంటికి వెళ్లాలి అందుకు నా అవసరం వాళ్లకి ఉందని ఈవిడకు తెలిసేలా చేయాలని అనుకుంటుంది. అందుకు ఓ అరటి పండు కొని తిని తొక్క ఈశ్వరి కాళ్ల కింద పడేస్తుంది. ఈశ్వరి అది తొక్కి కింద పడిపోతుంది. ఇందిర పట్టుకొని మంచిగా మాట్లాడుతుంది. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లమని ఈశ్వరి అంటే అవసరం లేదు మన ఇంటికి వెళ్దాం అంటుంది. మన ఇళ్లు ఏంటి అని ఈశ్వరి అడిగితే మీ ఇంటికే తీసుకెళ్లి కేరళ వైద్యం చేస్తానని తీసుకెళ్తుంది.
మరోవైపు గణ పుణ్యమా అని ప్రేరణ, సిద్ధూలు ఆటో కోసం ఒకే చోట నిల్చొంటారు. ఇద్దరూ ఒకే సారి ఆటో ఆపుతారు. ఇద్దరూ గొడవ పడతారు. నువ్వు ఎక్కిన ఆటోలో నేను రాను అని అనుకుంటారు. సిద్ధూ ముందు ఆటో ఎక్కుతాడు. వీడిని ఎంత వదిలించుకుందామన్నా జిడ్డులా తగిలాడు అనుకుంటూ ప్రేరణ ఎక్కుతుంది. ఎక్కడికి వెళ్లాలని ఆటో డ్రైవర్ అడిగితే ఇద్దరూ ఒకే అడ్రస్ చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.